రా.. రా.. రారా బంగారం.. మరి వచ్చేనా..? supporters put up posters demanding hero ajith to enter politics

Supporters put up posters demanding hero ajith to enter politics

ajith, tamil hero, AIADMK crisis, jayalalithaa, shasikala, dinakaran, ajith supporters, political heir, tamil politics

Supporters of kollywood hero ajith, who was said to be legal and political heir of AIADMK chief and Tamil Nadu late chief minister jaya lalithaa demand to announce his political entry

రా.. రా.. రారా బంగారం.. మరి వచ్చేనా..?

Posted: 04/18/2017 08:04 PM IST
Supporters put up posters demanding hero ajith to enter politics

తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో.. అమ్మ వారసుడిగా ఆ మధ్యకాలంలో ప్రచారంలోకి వచ్చిన తమిళ హీరో అజిత్ పార్టీ పగ్గాలను అందుకోవాలని డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మానసపుత్రుడిగా పేరొందిన అజిత్.. తన రాజకీయ ప్రవేశం చేయాలని.. తమిళనాట ఆయన అభిమానులు ర..రా రారా బంగారం అంటూ గీతాన్ని అలపిస్తున్నారు. దీంతో తమిళనాట రాజకీయాలలో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకోనుందా..? అని సర్వత్రా ఎదురుచూస్తున్నారు.

జయలలితకు కుటుంబపరంగానూ.. రాజకీయ పరంగానూ తానే వారసురాలినని ఓ వైపు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ముందుకు సాగుతున్న క్రమంలో.. అజిత్ ఎంట్రీ ఇస్తే ఎలా వుంటింది. అర్కే నగర్ ఎన్నికలలో అమ్మకు వారసురాలిని మేమే అంటూ మూడు పార్టీలు ప్రచారం చేసిన విషయం విధతమే. అసలు నిజానికి అమ్మకు వారసులుగా తమిళ ప్రజలు ఎవరికీ అమోదం తెలుపుతారు. ఎవరు అమ్మకు రాజకీయ వారసులైతే ప్రజా సంక్షేమాన్ని అమ్మతరహాలోనే ముందుకు తీసుకెళ్ల గలుగుతారు అన్న అంశాలు కూడా ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.

ఈ క్రమంలో అజిత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. మరోలా చెప్పాంటే డిమాండ్ చేస్తున్నారు. అజిత్‌ రాజకీయ ప్రవేశానికి అనుకూలంగా చెన్నైలో పోస్టర్లు వెలిశాయి. అజిత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రవేశ విషయమై తన నిర్ణయం వెలువరించాలని కోరుతూ అభిమానులు చెన్నై నగరంలోని పలు ప్రాంతాలలో పోస్టర్లు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అదే రోజున తన తదుపరి చిత్రం టీజర్ విడుదల కోసం ఆయన ప్రయత్నాలు జరుపుతున్న క్రమంలోనే అభిమానులు మాత్రం మరోలా అలోచిస్తూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై అజిత్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

జయలలిత రాజకీయ వారసుడు అజిత్‌ అంటూ, అ మేరకు అమ్మ వీలునామాను కూడా రాసిందంటూ ప్రచారం కూడా జరిగింది. జయలలిత మృతిచెందినప్పుడు విదేశాలలో వున్న అజిత్ వార్త తెలియగానే నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి ఆయన నివాళులు అర్పించారు. అయితే జయలలిత మరణం తరువాత రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినా ఆయన స్పందించలేదు. రాజకీయాల జోలికిపోకుండా సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా అన్నాడీఎంకే పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అజిత్‌ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. జయలలితకు నిజమైన వారసుడు అజిత్‌ అంటూ అభిమానులు పేర్కొంటున్నారు. మరి అజిత్ అభిమానుల ఒత్తిడికి లోంగేనా..? లేక తన దారి తనదేనని వెళ్లేనా..? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles