Two telugu states using bifurcation issue

Telangana and Andhra Pradesh, Telangana and AP, AP Reorganization Issue, Telangana Bifurcation, Reorganization Issue 2019 ELections, TRS TDP 2019 Elections, 2019 Bifurcation Issue, TRS Still Sentiment

Telangana and Andhra Pradesh states still raises the reorganization issue and continues to accuse the counterparts. When Naidu does it, it becomes a self-goal, but when it comes to TRS leaders it becomes sentiment.

విభజన రాజకీయాలతో కాలం గడిపేస్తున్నారా?

Posted: 04/18/2017 02:47 PM IST
Two telugu states using bifurcation issue

రాష్ట్ర విభజన జరిగిపోయి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ వాసనలు మాత్రం రెండు రాష్ట్రాలను వీడి పోవటం లేదు. 60 ఏళ్ల పోరాట ఉద్యమంలో విజయం సాధించామని ఒకరు, కాంగ్రెస్ అన్యాయంగా విభజించిందని మరోకరు ఇలా రెండు ప్రభుత్వాలు ఇప్పటికీ దంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాయి. పునర్వస్థీకరణ లో లోపాలున్న మాట వాస్తవమే అయినా, ఎక్కువగా నష్టపోయింది ఏపీయే అయినా, కేంద్రం మాత్రం స్వరం మార్చి సాయం విషయంలో వెనకంజ వేయటం దారుణమైన అంశమే. ఇక విభజన అనేది నాణేం అయితే టీడీపీ, టీఆర్ఎస్ రెండు పార్వ్శాలుగా మార్చుకుని మరీ వాడేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ మూడేళ్లలో ఇరు రాష్ట్రాలు సాధించిన ప్రగతి మాట అటుంచి చాలా సందర్భాల్లో విభజన పదాన్ని ఉపయోగించటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా లాభపడ్డట్లు భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నుంచే దీనిపై ఎక్కువ ధృష్టిసారించింది. ఛాన్సు దొరికినప్పుడల్లా ఉమ్మడి ఆంధ్రాలో తీరని ద్రోహం జరిగిందని, సొంత రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుకుందామని ఇలా చెప్పుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో వారి యవ్వారం కాస్త కామెడీగా మారుతోంది.

ఇక్కడో ఉదాహరణ చెప్పుకుందాం. రీసెంట్ గా జగిత్యాల జిల్లాలో ప్రగతి సభ జరిగింది. అక్కడ సభలో తెలంగాణకు ఉమ్మడి స్టేట్ లో జరిగిన అన్యాయాల గురించి ప్రసంగించిన నిజామాబాద్ ఎంపీ, కల్వకుంట్ల కవిత చివర్లో జై తెలంగాన అటూ నినాదాలు చేసింది. దీనికి జనాల నుంచి పెద్ద ఎత్తునే నినాదాలు వచ్చాయి. అయితే ఉద్యమ సమయంలో ప్రదర్శించిన ఆత్మగౌరవ నినాదాన్ని ఇప్పుడు స్వరాష్ట్రం, సొంత ప్రభుత్వంలో ప్రదర్శించాల్సిన అవసరం ఉందా? అని తోటి నేతలే గొణుక్కుంటున్నారు.

ఇక ఇదే సీన్ ను ఏపీకి మార్చి చూద్దాం. రాష్ట్ర విభజన అన్యాయమని, ఘోరంగా అన్యాయం చేశారని ప్రతీ మీటింగ్ లలో చంద్రబాబు ప్రసంగాలు ఇవ్వటం చూస్తుందే. కానీ, ఇక్కడే ఓ చిక్కు వచ్చి పండింది. ఆయన ఆ మాట అన్న ప్రతీసారీ మీడియాతో సహా అంతా రెండు రాష్ట్రాల్లో వైషమ్యాలు రేపటానికి బాబు ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శలు వచ్చిపడుతున్నాయి. సరైన గవర్నెన్స్ లేకపోవటం అనే కారణాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో తప్పు జరిగిన ప్రతీసారి ప్రతిపక్షాలు సులువుగా టీడీపీని టార్గెట్ చేయగలుగుతున్నాయి.

ఆ సమయంలో విభజన అనే సాకును చూపి ఏపీ సీఎం ఆత్మరక్షణ పోరాటం చేస్తుంటే.. అరిగిపోయిన సెంటిమెంట్ అనే అరిగిపోయిన సీడీ ఏస్తూ టీఆర్ఎస్ మాత్రం ఇంకా జనాలను దువ్వులనే ప్రయత్నిస్తోంది. 2019 ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఇప్పటికే ట్రయల్స్ మొదలయ్యాయి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2019 Elections  TRS  TDP  Bifurcation Issue  

Other Articles

 • Anam brothers to join ysrcp soon

  ఆనం బ్రదర్స్ వైసీపీలోకి?.. భూమన రాయబారం

  Apr 24 | ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఉన్న ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి సాగనంపుతున్నాడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. అయితే జంపింగ్ లతో రాజకీయంగా ఏర్పడే అల్లకల్లోలాన్ని తనకు అనుకూలంగా కూడా మార్చుకోవటంలో కూడా జగన్ విఫలం... Read more

 • Supporters put up posters demanding hero ajith to enter politics

  రా.. రా.. రారా బంగారం.. మరి వచ్చేనా..?

  Apr 18 | తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో.. అమ్మ వారసుడిగా ఆ మధ్యకాలంలో ప్రచారంలోకి వచ్చిన తమిళ హీరో అజిత్ పార్టీ పగ్గాలను అందుకోవాలని డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. దివంగత... Read more

 • Don t troll lokesh you may land in jail

  అటు ఊచల హెచ్చరికలు.. ఇటు పదేపదే తప్పిదాలు..!

  Apr 18 | టీడీపీ పార్టీకి చిన్నబాబు అనగానే అందరూ ఠక్కున గుర్తుపడతారు. అయన మరెవరో కాదు టీడీపీ అధ్యక్షుడు చంద్రాబాబు తనయుడు నారా లోకేష్. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన ముహూర్తం బాగోలేనట్టుంది. అప్పటి వరకు చిన్నబాబు పార్టీలో... Read more

 • Who accompanied with mudragada this time

  ముద్రగడతో కలిసొచ్చేది ఎవరసలు?

  Apr 14 | మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటించేశాడు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై తాడో పేడో తేల్చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో లేఖాస్త్రాన్ని... Read more

 • Chandrababu in preperation of plan c towards janasena pawan kalyan

  పవన్ కల్యాన్.. ప్లాన్ సి మేధోమధనంలో చంద్రబాబు.!

  Apr 12 | నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరుsÁa వినగానే చాణక్య రాజనీతిని గుర్తుకువస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తుంటారు. ఆయనకు నేటి తరం రాజకీయాలపై విపరీమైన గురి వుండటమే ఇందుకు... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno