ముద్రగడను సీరియస్ గా తీస్కోడా? | Mudragada again deadline for AP Govt.

Who accompanied with mudragada this time

Kapu Agitation, Mudragada Letter Chandrababu Naidu, CM Chandrababu Kapu Agitation, Mudragada Padmanabham Chandrababu Naidu, Kapu Backward Classes, Mudragada May 7 Dead Line

Kapu leader and former minister Mudragada Padmanabham dead line to AP Government. And Wrote letter to CM Chandrababu over inclusion of Kapus in Backward Classes before May 7.

ముద్రగడతో కలిసొచ్చేది ఎవరసలు?

Posted: 04/14/2017 03:03 PM IST
Who accompanied with mudragada this time

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటించేశాడు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై తాడో పేడో తేల్చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో లేఖాస్త్రాన్ని సంధించాడు. గురువారం ఇందుకు సంబంధించిన ఓ లేఖ సీఎం కార్యాలయానికి చేరింది కూడా. అయితే ఎప్పటికప్పుడు ఇలా ఉత్కంఠ రేపి చల్లబడుతున్న ముద్రగడతో ఈసారి మిగతా నేతలు కలిసి వస్తారా? అన్నదే ఇప్పుడు అసలు చర్చగా మారింది.

కాపులను బీసీల్లో చేరుస్తూ మే 7లోగా ఏదో ఒక నిర్ణయం వెలువరించాలని అందులో కోరాడు. గడువులోగా ఏదో ఒకటి తేల్చకపోతే మాత్రం తీవ్ర ఉద్యమం తప్ప తన ముందు వేరే ఆప్షన్ లేదని అందులో హెచ్చరించాడు కూడా. సుప్రీం కోర్టు మార్గదర్శకాలనుసారం గెలిచిన పార్టీలు, నేతలు వారిచ్చిన హామీలను ఖచ్ఛితంగా నెరవేర్చాలని సూచించింది. ఆ ఆదేశాలను మీరు కూడా పాటించాల్సిన అవసరం ఉందని చంద్రబాబును ఉద్దేశించి ముద్రగడ డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో కలిసి వచ్చేవారితో ఉద్యమం ఎగిసి పడుతుందని హెచ్చరించాడు కూడా. అయితే వారెవ్వరన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

అవసరమైతే చర్చల కోసం తమ తరపున నలుగుదైరుగురు ప్రతినిధులను పంపటానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న ముద్రగడ కాన్ఫిడెంట్ గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. గత రెండు దఫాల ఉద్యమ సమయంలో కలిసి వచ్చిన అన్ని పార్టీల ప్రతినిధులు తర్వాత ఎక్కడా ఆ ఊసే ఎత్తలేదు. దాసరి అనారోగ్యంతో ఉండగా, చిరు ఓవైపు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోవటంతో మళ్లీ రావటం కాస్త అనుమానమే. ఇక మిగిలిన వాళ్లలో అంబటి లాంటి వాళ్లు మంజునాథ కమిటీ నివేదిక నెలో, నెలన్నరలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేచి ఉండే ధోరణి మంచిదన్న భావనలో ఉన్నారు. అలాంటప్పుడు ఏ ధైర్యంతో నో కాంప్రమైజ్ అన్న వార్నింగ్ ఇచ్చాడన్నది అసలు పాయింట్ అంటున్నారు.

ఆ మాట అటుంచితే మెల్లిగా ఒక్కోక్కరు ముద్రగడకు దూరం కావటంతో ఈసారి ఉద్యమ తీవ్రత అసలు అంతగా ఉండకపోవచ్చనేది మరో టాక్. మరి ఈసారైనా ముద్రగడ వార్నింగ్ ను చంద్రబాబు సీరియస్ గా తీసుకుంటాడా? లేక ఎప్పటిలాగే అణచి వేస్తాడా? అసలు ముద్రగడ చెబుతున్నట్లు ఆ మిగతా నేతలు ఎవరు? ఆ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapu Agitation  Mudragada Padmanabham  Dead Line  

Other Articles