హామీలను బీజేపి నెరవేర్చేనా..? అరుంధతి సణుగుడు..? bjp not to fullfull up farmers poll promise..? does sbi chief hints the same.?

Bjp not to fullfull up farmers poll promise does sbi chief hints the same

SBI, Arundhati Bhattacharya, farm loan waivers, crop loan waived off, uttar pradesh farmers, bjp poll promise, kingfisher, vijay mallya, bad debts, agriculture based country

Uproar over sbi chief arundati bhattacharya latest statements, that bjp would not fullfill the poll promise given to waive off crop loans to uttar pradesh farmers.

హామీలను బీజేపి నెరవేర్చేనా..? అరుంధతి సణుగుడు..?

Posted: 03/17/2017 03:49 PM IST
Bjp not to fullfull up farmers poll promise does sbi chief hints the same

ఏరు దాటేవరకు ఓడ మల్లన.. దాటిన తరువాత బోడ మల్లన్న అని పిలిచే వారి సంఖ్య మారుతున్న కాలంలో మరీ ఎక్కువైపోతుంది. మరీ ముఖ్యంగా రాజకీయా నాయకులతో పాటు ఉన్నతస్థాయిలో వున్న అధికారులు ఇప్పుడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నారు. తాజాగా భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మ పర్సెన్ అరుంధతి భట్టాచార్య కూడా ఇదే మాటను జపించారా..? అంటూ అటు రాజకీయ వర్గాల నుంచి రైతు సంఘాల వరకు అందరూ తీవ్రంగా విమర్శలను ఎక్కుపెడుతున్నారు. ఇక మరికోందరైతే బీజేపి అభిమతాన్ని అమె నోట నుంచి పలికించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇంతకీ అమె చేసిన వ్యాఖ్యలు ఏమిటీ అని పరిశీలిస్తే.. రైతులకు ఇచ్చిన సాగు రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఈ వ్యాక్యల నేపథ్యంలో అమెపై బీజేపి మినహా అన్ని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. వీటికి తోడు పలు రాష్ట్రల రైతు సంఘాలు కూడా అమె వ్యాఖ్యలును వ్యతిరేకించాయి. పంట రుణాల ప్రోత్సాహకాలు రుణాలు తిరిగి చెల్లించే తీరును దెబ్బతీసే అవకాశం ఉండడంతోపాటు, రుణాలు తిరిగి చెల్లించే అలవాటు  కూడా తగ్గుతుందన్న వ్యాఖ్యలపై అమె తక్షణం దేశంలోని రైతులకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ కూడా పెరిగిపోయింది.

అమ ప్రభుత్వ అధికారే తప్ప, విధాన రూపకర్త కాదని.. తన పరిధికి మించి వ్యాఖ్యానించడం సరైందని కాదని కూడా హెచ్చరికలు వచ్చాయి. విజయ్‌ మాల్యా లాంటి పారిశ్రామికవేత్తలకు 1.40 లక్షల కోట్ల రుణాలను రైట్‌ ఆఫ్‌ చేసినపుడు.. బ్యాడ్ డెట్స్ కింద నోట్ల రద్దుతో ఎగవేతదారులు రుణాలను రైట్ ఆఫ్ చేసినపుడు ఆమె ఎందుకు స్పందించలేదని విపక్షాలు మండిపడ్డారు. ఇక దీనికి తోడు ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి సహా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చినప్పుడు అమె ఏం చేశారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

తీరా ఎన్నికలు పూర్తైన తరువాత.. అందులోనూ కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత అరుంధత భట్టాచార్య కు క్రెడిట్ డిసిప్లీన్ అభ్యంతరాలు గుర్తుకు వచ్చాయా..? అని ప్రశ్నల వర్షం కురుస్తుంది. యూపీలో బీజేపి రైతులకు ఇచ్చిన రుణ మాఫీని అమలుపర్చకుండా ఇప్పటి నుంచే అమె అడ్డుకునే యత్నాలకు తెరలేపుతున్నారని పలువురు అరోపిస్తున్నారు. అమెను అడ్డుగా పెట్టుకుని బీజేపి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వుండేందుకు యత్నిస్తుందా..? అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

యావత్ దేశం రైతు భారతమని ఎన్నికల ముందు ప్రసంగాలు చేసే నేతలు.. వారికి ఇబ్బడిముబ్బడిగా ఎన్నికల హామీలను గుప్పించి.. తీరా గెలిచాక వాటిని అమలుపర్చకుండా ఇలాంటి చౌకబారు యత్నాలకు పాల్పడతాయంటూ కూడా రైతు సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వ్యవసాయాధారిత దేశంలో రైతులకే అన్ని నిబంధనలు వర్తిస్తాయే తప్ప.. ఎగవేతదారులకు మాత్రం వేల కోట్ల రుణాలు అందుతాయని రైతులు అరోపిస్తున్నారు. అరుంధతి భట్టాచార్య తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles