బీజేపి తీర్థం తీసుకోనున్న కాంగ్రెస్ నేత రాణే..! Vishwajit Rane resigns Congress may join BJP

Rebel congress mla vishwajit rane may join bjp

congress mla, Vishwajit Rane, resign, Goa Floor Test, Manohar Parrikar, Goa Chief Minister, Goa floor test, Goa Assembly, Goa government, Divvijay singh, Bharatiya Janata Party, Congress

If sources are to be belived, Rebel Congress MLA Vishwajit Rane, who has resigned from congress immediately after Manohar Parrikar proved his majority, may join BJP

బీజేపి తీర్థం తీసుకోనున్న కాంగ్రెస్ నేత రాణే..?

Posted: 03/16/2017 06:11 PM IST
Rebel congress mla vishwajit rane may join bjp

గోవా ముఖ్యమంత్రి పీఠం కోసం ఐదేళ్లుగా కష్టించిన మాజీ కాంగ్రెస్ నేత విశ్వజీత్ రాణే.. తన కల సాకారం కాకపోవడంతో.. ‘‘వాక్ విత్ విన్నర్ టు బికమ్ ల విన్నర్’’ ఓటమి పలకరించినప్పుడు విజేతలతో  పయనిస్తే మనమూ విజేతలుగానే మిగులుతామన్న ఆంగ్ల సామానెతను బాగ వంటపట్టించుకున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. తాను ముఖ్యమంత్రి కావాలన్న కల చెదిరిపోయినప్పటికీ.. ముఖ్యమంత్రి వర్గంతో చేయి కలపి పయనించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంటే ఆయన త్వరలోనే బీజేపి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తుంది.

కాంగ్రెస్ పార్టీ అధిష్టాన దూతగా వచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్.. చిన్న పార్టీల మద్దుతు తీసుకోవడంలో చేసిన కాలయాపన, జాప్యంపై చిర్రెత్తిన ఆయన బహిరంగంగానే ఆయనపై విమర్శలు సంధించారు. అయితే ఈ క్రమంలో ఆయన గోవా ముఖ్యమంత్రితో రహస్యంగా భేటీ అయ్యారని, పార్టీలోకి వచ్చేందుకు సమ్మతించారని వార్తలు వినబడుతున్నాయి. పార్టీ మారిన తరువాత ఆయన స్థాయికి తగ్గట్టుగా బీజేపి ఆయనను పదవితో సత్కరించేందుకు కూడా ఒప్పందాలు కుదిరాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికారని కూడా కథనాలు వినిపిస్తున్నాయి.

అందుకనే ఆయన ప్రమాణస్వీకారం పూర్తికాగానే గోవా అసెంబ్లీలో పారికర్ బలనిరూపణ వరకు కూడా వేచివుండకుండా బయటకు వచ్చేశారని కథనాలు వస్తున్నాయి. రాణేతో పాటు మరికోందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ కండువాను మార్చనున్నారని సంకేతాలు వస్తున్నాయి. ఇక దీనికి తోడు తనను టార్గెట్ చేయడంపై రాణేపై దిగ్విజయ్ సింగ్ కూడా కొంత గుర్రుగానే వున్నారని తెలుస్తుంది. రాణే పారికర్ తో హోటల్ లో రహస్యంగా మంతనాలు జరపడం వెనుక కారణాలు ఏమిటని ఆయన ఇప్పటికే పత్రికాముఖంగా ప్రశ్నించడంతో.. అది కూడా రాణే పార్టీ మారేందుకు కారణం కావచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారితే ఆయనతో పాటు ఎవరెవరు వీడే అవకాశాలున్నాయన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ సిరీయస్ గా తీసుకుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress mla  Vishwajit Rane  resign  Goa Floor Test  Manohar Parrikar  BJP  congress  

Other Articles