ఆరు నెలలు అయ్యింది.. ప్యాకేజీ పొట్లాలు కడుతున్నారా? | Union Cabinet again differs on Special Package.

Central delay on ap special package

AP Special Package, Special Package Delay, Andhra Pradesh Special Package, Union Cabinet Special Package, Special Package Chandrababu Naidu, Special Package Delay Venkaiah Naidu

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu said to be disappointed again Union Cabinet again failed to give its nod to Special Package to the state, in its meeting held recently.

ఏపీ స్పెషల్ ప్యాకేజ్ ఎందుకింత ఆలస్యం?

Posted: 02/24/2017 05:38 PM IST
Central delay on ap special package

ఏపీ ప్రజల నుంచే కాదు, విపక్షాల విమర్శల దెబ్బకి స్పెషల్ ప్యాకేజీ విషయంలో ఏం చేయలేని పరిస్థితికి తెలుగు దేశం ప్రభుత్వం చేరుకుంది. స్పెషల్ కేటగిరీ తప్ప... అంటూ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం ఆ హామీని ఆరు నెలలు గడిచినా పట్టించుకోని పరిస్థితి. చివరకు బడ్జెట్ సమయంలో మాట వరసకు కూడా ఆ ఊసెత్తలేదు. దీంతో భారీ ఆర్థిక సాయంతో ఊరట చెందొచ్చని ప్రజలను ఊరడించిన సీఎం చంద్రబాబు అండ్ కో ఇప్పుడు ఏం చేయబోతున్నాడా? అన్నది చర్చగా మారింది.

మాములుగా ఇలాంటి విషయాల్లో త్వరగా తేల్చేయటం ప్రభుత్వాలకు అలవాటు. అలాంటిది నెలలు గడుస్తున్నప్పటికీ కేంద్ర కేబినెట్ దానికి చట్టబద్ధత కల్పించకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. కేంద్ర కేబినెట్ ఇన్ని సార్లు సమావేశమైనప్పటికీ ఒక్కసారిగా కూడా ఈ అంశాన్ని చర్చించకపోవటం ఏంటని పలువురు ప్రశ్నించారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్థిక మాత్యులు అరుణ్ జైట్లీ వచ్చే సమావేశంలో తప్పక చర్చిస్తానని ప్రకటించాడు.

కానీ, బుధవారం అది కూడా జరిగిపోయింది. కానీ, ఏపీ స్పెషల్ ప్యాకేజీ దుమ్ము దులపలేకపోయారు. సహజంగానే ఇది చంద్రబాబు నాయుడు కు అసంతృప్తి తెప్పించింది. మరోవైపు ఈ అంశంపై ఏకీపడేసేందుకు విపక్షాలు సిద్ధమౌతున్నాయి. దీంతో కీలక నేతలతో హడావుడిగ ామంతనాలు జరపటమేకాదు, త్వరలో ఓ బృందంగా ఢిల్లీ వెళ్లి ఈ విషయంపై ప్రధానితోసహా పలువురు మంత్రులను కలిసేందుకు సిద్ధమౌతున్నాడంట. మరి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయమనే వెంకయ్య నాయుడు లాంటి వాళ్లు ఈ వ్యవహారంలో ఇంకా ఎందుకు జోక్యం చేసుకోవటం లేదబ్బా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Special Package  Central Delay  Chandrababu Naidu  

Other Articles