Opposition parties criticize pm modi s sp congress alliance jibe

uttar pradesh, samajwadi party, akhilesh yadav, rahul gandhi, bjp, jammu kashmir, pdp, mahabooba mufti, PM Modi, demonetisation, man mohan singh, indira gandhi, rajiv gandhi, pv narsimha rao, raincoat jibe, PM's 'derogatory' remark, congress india news, politics

opposition parties mainly from congress and samajwadi criticize Prime Minister Narendra Modi's sp-congress alliance jibe

‘‘శత్రుదేశం వల్లే గెలిచామన్నవారితో పోత్తులా’’

Posted: 02/17/2017 03:33 PM IST
Opposition parties criticize pm modi s sp congress alliance jibe

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాయా..? అంటూ అవేదన, అందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీజేపి పార్టీపైనే విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ప్రధాన మంత్రికి రాజకీయాలు దిగజారిపోయాయా అంటూ అవేదన వ్యక్తం చేసే నైతిక హక్కు లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. మిస్టర్ క్లీన్ గా పేరోందడం కూడా తప్పు అన్నట్టుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై పార్లమెంటు సాక్షిగా ఆయన చేసిన విమర్శలు దిగజారుడు తనానికి నిదర్శనం కావా..? అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షాలు.

ఇక ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాహుల్, అఖిలేష్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గురించి అఖిలేష్‌కు పూర్తిగా తెలియదని, 1984లో తండ్రి ములాయంపై ఆ పార్టీ హత్యాయత్నానికి కూడా పాల్పడిందని ఆరోపించారు. అటువంటి పార్టీతో ఇప్పుడు అఖిలేష్ పొత్తు పెట్టుకున్నారని అన్నారు. సినిమా ఫస్టాఫ్‌లో బద్ధ శత్రువులుగా ఉన్న రెండు పాత్రలు ఇంటర్వెల్ తర్వాత ఒక్కటయ్యారని రాహుల్-అఖిలేష్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. తండ్రిని చంపబోయిన వారితో ఎవరైనా చెలిమి చేస్తారా? రాజకీయాలు మరింత ఇంతగా దిగజారాయా? అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని ఈ కామెంట్ పట్ల కూడా కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రధానికి పలు సూచనలు చేస్తున్నాయి. ప్రధాని ఎన్నడో జరిగిన విషయాలను గుర్తు పెట్టుకోగలుగుతున్నారని, కానీ ప్రస్తుతం తన కళ్లముందు జరుగుతున్న విషయాలను మాత్రం చూడలేరని అన్నారు. జమ్మూకాశ్మీర్ లో తమ పార్టీ గెలుపుకు పాకిస్థాన్ ప్రభుత్వమే కారణమని చెప్పిన పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాలను నడుపుతున్న విషయమై ఆయన ఏం మాట్లాడతారో చెప్పాలని నిలదీస్తున్నారు. దేశంలోని రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరని చెబుతున్న నేతలు.. దేశానికి సంబంధించి మాత్రం ఇలాంటివి వుండవన్నారు.

కాంగ్రెసేతర పార్టీల ఏలుబడిలో గత 27 ఏళ్లుగా యూపీ సర్వనాశనం అయిందంటూ యాత్రలు చేసిన రాహుల్ ఈ 27 ఏళ్ల కాలంలో ఎక్కువకాలం రాష్ట్రాన్ని పాలించిన ఎస్పీతోనే జట్టు కట్టారని ప్రధాని అన్నారు. దీనిపై కూడా ప్రత్యర్థి పార్టీలు విమర్శలను కురిపించాయి. తమ పార్టీకి చెందిన నేతలపైనే ప్రధాని మోడీ విమర్శలను చేసిన విషయాన్ని గుర్తుచేశాయి. 70 ఏళ్లుగా జరిగిన అవినీతిని ప్రస్తావించిన ప్రధాని అందులో అరేళ్ల పాటు పాలించిన బీజేపి కురువృద్ద నేత అటల్ బిహారీ వాజ్ పాయ్ పై కూడా విమర్శలు గుప్పించారన్న విషయాన్ని నొక్కివక్కాణిస్తున్నాయి.

ప్రధాని తన కార్యలయంలో కూర్చుంటే పారిశ్రామిక వేత్తలు గుర్తుకువస్తారని, వారికోసం రైతులను సైతం ఇబ్బందులు పెడతారని విమర్శించారు. భూసంస్కరణ చట్టంలో మార్పులకు సిద్దపడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. తనను పర్యటించడానికి విలులేకుండా వీసా కల్పించడానికి నిరాకరించిన దేశానికి చెందిన అధ్యక్షుడు వస్తే ప్రోటోకాల్ మరచి విమానాశ్రయానికి వెళ్లిన ప్రధాని చరిత్రలోనే లేరని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శించారు. ఇక నాలుగు కోట్ల రూపాయల సూటు వేసుకున్న ప్రధానిగా కూడా మోడీ చరిత్ర పుట్లలో నిలిచారని విమర్శలు చేశారు. ఇక ఆయన రోజు మార్చుకునే దుస్తుల సంఖ్యపై కూడా ఎన్నో విమర్శలు వున్నాయన్నారు.

ప్రధానిని చేసిన దేశ ప్రజలను, వారి సంక్షేమాన్ని మర్చి విదేశాలలో ఎక్కువ కాలం గడిపిన ప్రధానిగా కూడా మోడీ ముందువరుసలో నిలుస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రమే దేశప్రజలు గుర్తుకువస్తారని విమర్శించారు. మోడీ చేసిన పాత పెద్ద నోట్ల రద్దు వల్ల పేద ప్రజల అకౌంట్లలోకి డబ్బులు వరద కడతాయని అన్నారని ఎవరి అకౌంట్లోనైనా మీకు చెందని డబ్బులు వచ్చాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ చేప్పిన 15 లక్షల రూపాయలు రెండేళ్లు గడుస్తున్న ఎవరికీ అందలేదని.. అచ్చె దిన్ అయన పార్టీ కార్యకర్తలకు, నేతలకే తప్ప దేశప్రజలకు రాలేదని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttar pradesh  samajwadi party  akhilesh yadav  rahul gandhi  bjp  jammu kashmir  pdp  mahabooba mufti  PM Modi  

Other Articles

 • Dip in fuel charges expected as international crude oil prices decrease

  భారీగా తగ్గనున్న ప్రెటోల్, డీజిల్ ధరలు..?

  Mar 24 | వాహనదారులకు దేశీయ ఇంధన సంస్థలు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నాయా..? అంటే ఔను అన్న సంకేతాలే వినబడుతున్నాయి. కేంద్రంలోకి బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చన నాటి నుంచి అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు... Read more

 • Complaint filed against women s activist for posting objectionable pics of up cm

  బజారున పడి.. కేసులు పెట్టి.. పరువు తీసుకున్నారా..?

  Mar 22 | బీజేపి యువమోర్చ ఆ ముఖ్యమంత్రి పరువును తీసిందా..? దేశంలోనే అత్యంత కీలకమైన, అత్యధిక స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన యోగీ అదిత్యనాథ్ విషయంలో బీజేపి యువమోర్చా నేతలు... Read more

 • Prashant kishor to decide on joining congress

  ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్ లోకి??

  Mar 22 | ఐదు రోజుల క్రితం లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఓ పోస్టర్ వెలిసింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పట్టిస్తే 5 లక్షలు ఇస్తామని ఆ పార్టీ కార్యకర్తలే అందులో పేర్కొన్నారు.... Read more

 • Bjp not to fullfull up farmers poll promise does sbi chief hints the same

  హామీలను బీజేపి నెరవేర్చేనా..? అరుంధతి సణుగుడు..?

  Mar 17 | ఏరు దాటేవరకు ఓడ మల్లన.. దాటిన తరువాత బోడ మల్లన్న అని పిలిచే వారి సంఖ్య మారుతున్న కాలంలో మరీ ఎక్కువైపోతుంది. మరీ ముఖ్యంగా రాజకీయా నాయకులతో పాటు ఉన్నతస్థాయిలో వున్న అధికారులు ఇప్పుడు... Read more

 • Rebel congress mla vishwajit rane may join bjp

  బీజేపి తీర్థం తీసుకోనున్న కాంగ్రెస్ నేత రాణే..?

  Mar 16 | గోవా ముఖ్యమంత్రి పీఠం కోసం ఐదేళ్లుగా కష్టించిన మాజీ కాంగ్రెస్ నేత విశ్వజీత్ రాణే.. తన కల సాకారం కాకపోవడంతో.. ‘‘వాక్ విత్ విన్నర్ టు బికమ్ ల విన్నర్’’ ఓటమి పలకరించినప్పుడు విజేతలతో ... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno