పన్నీరు కింకర్తవ్యం..? భవిష్యత్ రాజకీయం..? Tamil Nadu care taker cm panneerselvam political future in dilema

Tamil nadu care taker cm panneerselvam political future in dilema

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Palanisamy, , Bengaluru, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

As AIADMK's leader of legislature party Edapadi K Palanisamy got call from Raj Bhavan.. Questions araise in pannerselvam team.? how would he move, to which party he may shift.? what is his political future.

పన్నీరుకు మిగిలేది కన్నీరేనా..? కింకర్తవ్యం.?

Posted: 02/16/2017 12:56 PM IST
Tamil nadu care taker cm panneerselvam political future in dilema

అన్నాడీఎంకే అధినేత్రి, స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతతో అస్పత్రిలో చికిత్స నిమిత్రం చేరి.. తీరా కోలుకున్నారని వార్తలు వచ్చిన తరువాత అమె అకాల మరణం చెందడంతో.. తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అమ్మకు అపత్ కాలంలో కారాగారవాసం చేయాల్సి వచ్చినా.. అమె ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చినా.. ప్రతీసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అమ్మ విధేయుడు పన్నీరు సెల్వం మరోమారు అర్థరాత్రి ఆఘమేఘాల మీద ప్రమాణస్వీకారం చేశారు.

అమ్మ మరణవార్తతో శశికళ పావులు కదుపుతూ తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నదన్న వార్తల నేపథ్యంలో కేంద్రరమంత్రి వెంకయ్యనాయుడు చెన్నైకి వెళ్లి మరీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న కథనాలు కూడా వినిపించాయి. దీంతో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే పరిమితమైన శశికళ.. అమ్మ మరణించిన రెండు నెలల తరువాత మళ్లీ పావులు కదిపింది. పన్నీరు సెల్వం కూడా తన పదవికి రాజీనామా చేశారు.

అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ నెల 7న (బీష్మ ఏకాదశి రోజున) ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇంతవరకు సవ్యంగానే సాగినా.. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమైంది. ట్విస్టు, మలుపులు, క్యాంపు రాజకీయాలు, కిడ్నాప్ కేసులు, ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా చాణక్య రాజనీతిని మించిన ఎత్తులు.. పై ఎత్తులతో ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయ విశ్లేషకుల అంచనాలకే అందని విధంగా సమీకరణలు మారిపోయాయి.

ఒకరు బహిర్భూమికని, మరోకరు గోడదూకి, ఇంకోకరు తప్పించుకుని ఒకరి క్యాంప్ నుంచి మరో క్యాంపులోకి వచ్చి చేరుతూ ఎన్నో ప్రకటనలు చేయడం.. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. దీంతో ప్రత్యర్థి క్యాంపులోని ఎమ్మెల్యేలు అనేక మంది తనకు మద్దతు ఇస్తారని ధీమ వ్యక్తం చేసిన అపధర్మ ముఖ్యమంత్రి వారి క్యాంపుకు వెళ్లి ఎమ్మెల్యేలతో మాట్లాడతానని కూడా ప్రకటించడం.. ఒక దశలో పోలీసులు అడ్డుకోవడం అన్ని జరిగిపోయాయి. ఇక ఎమ్మల్యేలు బంధీలుగా వున్నారన్న పిటీషన్ తో వారి వివరాలను తెలుసుకోవలని న్యాయస్థానం అదేశించింది.

కవత్తూరు పోలీసులతో పాటు డీఆర్వో అక్కడివెళ్లి ఎమ్మెల్యేలతో వివరణలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించడం కూడా జరిగిపోయాయి. అయితే ఆ తరువాత కూడా ఒక ఎమ్మెల్యే, శశికళ జైలుకెళ్తున్న రోజున మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గోడ దూకారు. తాము ఏదో అనుకుంటో.. మరోటేదో జరుగుతుందనుకున్న ఎమ్మల్యేలు జంప్ జిలానీలుగా మారారు. మధురై పశ్చిమానికి చెందిన ఎమ్మెల్యే శరవణన్ ఓ అడుగు ముందుకేసి మరీ శశికళ సహా పళనిస్వామీలపై కిడ్నాప్ కేసు పెట్టారు.

మరోవైపు గోడదూకిన వారిపై సస్సెన్షన్ వేటు. ఇంతలో అన్నాడీఎంకే పక్ష నేతగా ఎన్నికలూన చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడం.. తక్షణం లోంగిపోవాలని అదేశించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో శశికళ వర్గం పక్ష నేతగా పళనీస్వామి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం.. పలుమార్లు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యపై క్లారిటీ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో శశికళ వర్గానికి చెందిన పళనిస్వామికి గవర్నర్ నుంచి పిలుపు అందడం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పక్షం రోజుల్లో అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని సూచించారు.

దీంతో ఆ పీఠం తనదేనని గంపెడాశలు పెట్టుకున్న పన్నీరుసెల్వం అందోళనకు గురికావడం తాజా పరిణామం. ఇక గవర్నర్ అదేశాల మేరకు పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసి శాసనసభలో బలాన్ని నిరూపించుకున్న పక్షంలో పన్నీరుసెల్వం వర్గం దారెటు వైపు పయనిస్తుంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అన్నాడీఎంకే పార్టలో కొనసాగే అవకాశం అసలు లేదు. అలా అని అమ్మకు బద్దశత్రువైన పార్టీ డీఎంకే వైపుకు వెళ్తారా..? అంటే అదికూడా జరగోచ్చు అన్నవారు లేకపోలేదు. లేక కొత్త పార్టీ పెట్టి రాణించగలరా..? అవన్నీ కాక బీజేపిలో చేరుతారా..? ఇలాంటి ప్రశ్నలే తెరపైకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఒంటిరిగానే ఇతర పార్టీలోకి వెళ్తారా..? లేక తనకు మద్దతునిస్తున్న వారందరినీ చేరదీసుకుని వెళ్తరా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇదే తరుణంలో గత వారం రోజులుగా శశికళ వర్గం నుంచి పన్నీరు సెల్వం బృందంలోకి ఒక వైపుగా కొనసాగిన వలసలు.. అలా స్థిరంగా వుండిపోతాయా..? లేక రానున్న పక్షం రోజుల వ్యవధిలో ఇటు వైపు నుంచి అటువైపుకు పయనిస్తాయా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

అమ్మకు విధేయుడిగా వున్న పన్నీరు.. చిన్నమ్మకు కూడా విధేయుడిగా వుండివుంటే మరోమారు సీఎం అయ్యేవారు.. అలా కాకుండా తిరుగుబాటు బావుటా ఎగురవేసి రెంటికి చెడ్డ రేవడిలా మారాడన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరికోందరైతే గోల్గన్ బే రిసార్టులో వున్న ఎమ్మెల్యే మద్దుతు తనకు వుందని మితిమీరిన విశ్వాసమే పన్నీరు కంట కన్నీరు ఒలికేలా చేసిందన్నవారు కూడా లేకపోలేరు. ఇంకోందరు మాత్రం మరో అడుగు ముందుకేసీ విధేయతకు మారుపేరుగా నిలిచిన పన్నీరు ఎవరి చెప్పడు మాటలు విని తిరుగుబాటు బావుటా ఎగురవేశారని నిలదీస్తున్నారు. ఈ తరుణంలో పన్నీరు రాజకీయ భవిష్యత్తు ఎలా రూపుదిద్దుకుంటుందో వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  panneerselvam  vidyasagar rao  governer  AIADMK  tamilnadu  

Other Articles