వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే అదొక్కటే ఛాయిస్ | Jagan thinks about pre-poll alliance with BJP.

Ys jagan 2019 elections plan

YS Jagan, YS Jagan 2019 Elections, YS Jagan BJP Alliance, YS Jagan Eelection Plan, BJP Alliance with YSRCP, TDP BJP Alliance Breakup, Y S Jaganmohan Reddy, Y S Jaganmohan Reddy BJP, BJP YS Jagan

Andhra Pradesh Opposition Leader YS Jagan Keeps Option Open On BJP Alliance for 2019 Elections. will consider the option when it is really required leader Bhumana Karunakar Reddy Clarified.

జగన్ మైండ్ గేమ్ ను బాబు సాగనిస్తాడా?

Posted: 02/08/2017 12:55 PM IST
Ys jagan 2019 elections plan

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్పీపీ ప్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పరాభవం, ఆపై వలసల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఖచ్ఛితంగా గెలవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో జగన్ ముందున్న ఆఫ్షన్ ఏంటన్నది ఓసారి పరిశీలిస్తే...

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మిత్రపక్షాల కూటమి బ్రేకప్ అయితే గనుక వేగంగా బీజేపీతో పొత్తు కుదుర్చునేందుకు పావులు కదుపుతున్నాడన్నది అర్థమౌతోంది. ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే అవసరం అయితే తప్ప దానికి గురించి ఆలోచించమనే కోణంలో కూడా భూమన చెప్పటం విశేషం. ఒకవేళ బీజేపీ-టీడీపీ పొత్తు గనుక యథాతథంగా కొనసాగితే మాత్రం వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కూడా విజయం కష్టం అనే అనుకోవచ్చు. పైగా జనసేన రూపంలో మరో టఫ్ కాంపిటీటర్ బరిలో నిలుస్తుంది కూడా. కానీ, ప్రత్యేక హోదాపై ప్రతికూల పరిస్థితుల నేపథ్యం, పైగా దగ్గర్లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి బీజేపీ సుముఖంగా ఉండటంతో మిత్ర బంధం అప్పటిదాకా కొనసాగే అవకాశాలు అనుమానంగానే కనిపిస్తున్నాయి.

ఒకవేళ అదే గనుక జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే బీజేపీతో మంతనాలు చేసేందుకు రెడీగా ఉండాలని కీలక నేతలకు జగన్ ఇప్పటికే హింట్ కూడా ఇచ్చాడంట. ఇప్పటికే కేసుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న జగన్ కి ఆ ప్రభావం నుంచి ఉపశమనం దక్కాలంటే మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం ఎంతో కొంత అవసరం ఉంటుంది. పైగా తనపై ఎలాంటి వ్యతిరేకత(అలాగని సానుకూలత కూడా లేదు) లేని పార్టీతో ముందుకు వెళ్లటం మంచిదేనన్న భావనకి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెదేపా అధినేత చంద్రబాబు మాత్రం జగన్ పొత్తు పాచికలను పారనిస్తాడా? అన్నది అనుమానమేనంటున్నారు పలువురు సీనియర్ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Y S Jaganmohan Reddy  2019 Elections  BJP  Alliance  

Other Articles