శరత్ కుమార్ టార్గెట్ రజనీ కాదా? ఎవరసలు? | Not Rajinikanth Sarathkumar Couple target Vishal.

Sarathkumar comments not against rajinikanth

Radhika Sarathkumar, Sarathkumar, Non Local Comments, Vishal Non Local, Radhika comments Jayalalitha and Rajinikanth, Tamil Nadu non local politics, Radhika Sharathkumar Vishal

Radhika Sarathkumar non local comments not against Rajinikanth but also Vishal and team.

శరత్ కుమార్ రియల్ టార్గెట్ ఎవరసలు?

Posted: 01/17/2017 01:56 PM IST
Sarathkumar comments not against rajinikanth

తమిళ తంబీల పాలిట తలైవాగా, సూపర్ స్టార్ స్థాయిలో ఉన్న నటుడిపై శరత్ కుమార్ ఒక్కసారిగా చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. అభిమానుల ఆగ్రహా జ్వాలల నడుమ శరత్ కుమార్ దిష్టిబొమ్మలు తగలబడుతున్నాయి. జయ మరణానంతరం రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని రజనీ వ్యాఖ్యానించటం, ఆపై నీకు ప్రజల కష్టాలు ఏం తెలుసంటూ శరత్ కుమార్ తీవ్రంగా ఖండించటం, ఆపై తన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ మరో స్టేట్ మెంట్ ఇవ్వటం జరిగిపోయాయి.

స్థానికేతరుడైన రజనీకి(కర్ణాటక కు చెందిన వ్యక్తి) కావటంతోనే తాను రాజకీయాల్లోకి వస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నట్లు శరత్ కుమార్ వివరణ కూడా ఇచ్చాడు. దీంతో అభిమానులు మరింతగా రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలంటూ స్టార్ హీరోపై మండిపడుతున్నారు. అయితే కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ వ్యాఖ్యలు ఒక్క రజనీకాంత్ నే ఉద్దేశించినవి కావని అర్థమౌతోంది. తమిళనాడులో స్థానికేతరులు రాజ్యమేలుతున్నారని, వారిని నిలువరించాలని పరోక్షంగా శరత్ కుమార్ చెబితే, ఆయన భార్య, నటి రాధిక డైరక్టుగానే ఆ వ్యాఖ్యలు చేసేసింది.

ఎంజీఆర్, జయలలిత, రజనీకాంత్, వైగో, విజయ్ కాంత్ తదితరులంతా స్థానికేతరులేనని ఆమె విమర్శించారు. వీరిని ఆదరించాల్సిన అవసరం తమిళులకేంటని ప్రశ్నించింది. అయితే స్థానికేతరుల పేర్లను ప్రస్తావించే క్రమంలో నడిగర సంఘం నేత విశాల్ ను కూడా ఆమె టార్గెట్ చేయటం కొసమెరుపు. విశాల్ కులంతోసహా ప్రస్తావిస్తూ అతనోక రెడ్డి కులస్తుడని, ఆంధ్రా నుంచి వచ్చాడని చెబుతూ, "విశాల్ ఎవరు? విశాల్ రెడ్డి. కార్తీ, శివరామ్ ఎవరు? వీరంతా తమిళులా? వారి వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారు" అని వ్యాఖ్యానించింది.

దీంతో ఆ భార్య భర్తల అసలు టార్గెట్ రజనీ కాంత్ అయి ఉండకపోవచ్చుననే కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే విమర్శలు చేసే క్రమంలో రజనీ, జయలలిత పేర్లను కూడ ప్రస్తావించటం వెనుక ఏదైనా వేరే మర్మం ఉండొచ్చన్న అనుమానాలను కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే అన్నాడీఎంకే ను తొక్కి పడేయటం ఖాయమన్న ఉద్దేశంతోనే పార్టీ శ్రేణులు తమ భాగస్వామి అయిన సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్ కుమార్ తో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్న మాదిరి తమ వ్యాఖ్యలతో ఇబ్బందులకు గురిచేద్దామనుకున్న ప్రయత్నంలో వాళ్లే బాధితులుగా మారటం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Sarathkumar  Rajinikanth  Jayalalitha  Vishal  Non Local politics  

Other Articles