నోట్ల పరిమితి.. ఎంత దాకా తీయొచ్చంటే... | RBI expected to hike withdrawal limit.

Demonetization rbi expected to hike withdrawal limit

Reserve Bank of India, hike withdrawal limit, Demonetization, Demonetization RBI, withdrawal limit, RBI Finance Ministry, RBI governor Urjit Patel

Reserve Bank of India. Expected to hike withdrawal limit soon. RBI employee union writes to guv about Finance Ministry involvement.

ఆర్బీఐపై ఫిర్యాదు ఎందుకు? లిమిట్ మారుస్తారా?

Posted: 01/16/2017 01:09 PM IST
Demonetization rbi expected to hike withdrawal limit

నగదు ఉపసంహరణలపై ఆంక్షలను మరోసారి సవరించేందుకు కేంద్రం సిద్ధమైపోతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రజానీకానికి మరోసారి ఉపశమనం కలిగించేలా ఆర్ బీఐ ఈ వారాంతంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏటీఎంల నుంచి రోజుకి రూ.4,500, బ్యాంకు శాఖల వారంలో రూ.24,000 నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. వీటిని ఈ వారంలోనే ఆర్ బీఐ సడలించనుందని అధికార వర్గాలు తెలిపాయి.

సేవింగ్స్ ఖాతాల నుంచి రూ.24,000 ఉపసంహరణ పరిమితిని 30 నుంచి రూ.35వేల వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే, కరెంటు ఖాతాలకూా రూ.24,000 పరిమితే ఉండగా... దీన్ని రూ.50వేలకు పెంచనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ఏటీఎంల నుంచి విత్ డ్రా ను 10వేలుగా మార్చే అవకాశం ఉంది. అయితే, ఉపసంహరణలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసే విషయంలో ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.

ఆర్బీఐ‘కీ’ వార్నింగ్...
కాగా, స్వయం ప్రతిపత్తిగా ఉండాల్సిన బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంకు ఇండియా(ఆర్బీఐ) కేంద్రం ను అనుసరించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆర్బీఐ ఎంప్లాయ్ యూనియన్ ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖపై ఆరోపణలు కూడా చేస్తోంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా ఆర్థిక శాఖ ఆదేశాలనుసారం పని చేయటం సరికాదని, అందుకోసం ఆర్బీఐలో బోర్డు ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ ఘాటుగానే ఓ లేఖలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  withdrawal Limit  Hike  Finance Ministry  

Other Articles