నయీం కేసులో తొలి పోలిటికల్ వికెట్ డౌన్.? Nethi Vidyasagar the first political wicket in nayeen case?

Nethi vidyasagar the first political wicket in nayeen case

nayeem, gangster, konda vijay kumar, nadeem, child labour, family members, police officials, former police officers, Land grabbings, victims complaints, nayeem bedroom, nayeemuddin, sit, special investigation team, Telangana

Telangana Government to drop Legislative Council Deputy Chairman Nethi Vidyasagar from the said post as his name is included in the list prepared by SIT, which mobilized key evidences establishing the nexus with the slain gangster Nayeem.

నయీం కేసులో తొలి పోలిటికల్ వికెట్ డౌన్.?

Posted: 10/27/2016 05:42 PM IST
Nethi vidyasagar the first political wicket in nayeen case

తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా సహా దక్షిణాధి రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ అక్రమాల కేసులో అయనతో సంబంధాలు వున్న నేతలను కూడా పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నయీం కేసులో విఫక్ష కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రికి సంబంధాలు వున్నాయన్న అభియోగాలు వెల్లువెత్తుతున్న తరుణంలో పోలీసులు ఆయా నేతలపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారని సమాచారం. ఈ క్రమంలో ముందుగా తెరపైకి వచ్చిన తమ పార్టీకి చెందిన నేతనే టార్గెట్ చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుడుతున్నాయి.

ఇందులో భాగంగా తొలి పొలిటికల్‌ వికెట్‌ దీపావళి తర్వాత పడనుందని అత్యంత విశ్వనీసయ సమాచారం. నయీంతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండ టీఆర్‌ఎస్‌ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ రావుపై మొట్టమొదటగా వేటు పడనుందని తెలుస్తోంది. ఆయనను మండలి ఉపసభాపతి స్థానం నుంచి తప్పించేందుకు రంగం సిద్దమైందని సమాచారం. దీపావళి పండగ తరువాత విద్యాసాగర్ రావు స్వచ్చందంగా పదవికి రాజీనామా చేస్తున్నారని సమాచారం.

నయీం బెదిరింపుల నుంచి తమను రక్షించాలని వెళ్తే.. ఆయనే స్వయంగా నయీంతో ఎందుకు సెటిల్ చేసుకోండి అని సిఫార్సు చేశారని బాధితులు సిట్ అధికారులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోనడంతో ఆయనపై చర్యలు తీసుకోనున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా నయీం బంధువులు కూడా నేతి సాయంతో తాము సెటిల్‌మెంట్లు చేసినట్టు వెల్లడించారని సమాచారం. నేతి విద్యాసాగర్‌రావుపై వేటు నేపథ్యంలో ఇతర రాజకీయ నాయకులపైనా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నయీం కేసులో తాము పారదర్శకంగా వ్యవహరిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్తూ వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు పలువురిపైనా చర్యలు తప్పవని వినిపిస్తోంది. దీంతో నయీంతో సంబంధం ఉన్న టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీల నేతల్లోనూ గుబులు మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand  MS Dhoni  inexperienced middle order  ranchi  cricket  

Other Articles