అమర్ సింగ్ తో అనుబంధం జయప్రదకు చిక్కులు | Akhilesh sacks Jaya Prada from UP film board

Akhilesh sacks jaya prada from up film board

Jayaprada Amara Singh UP film board, Akhilesh sacks Amar Singh close aids include Uncle, Akilesh Yadav Jayaprada, Jayaprada Amar singh, Akhilsh another punch to Amar Singh aids, Jaya Prada removed from UP film board

Jayaprada close aid to Amara Singh for that reason UP CM Akhilesh sacks her from UP film board.

అమర్ సింగ్ తో అనుబంధం తప్పదు మరి!

Posted: 10/24/2016 09:37 AM IST
Akhilesh sacks jaya prada from up film board

యూపీని కంచుకోటగా మార్చుకుని ఏలుతున్న సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు కారణం ఎవరు? యాదవ కుటుంబంలో ఆరని చిచ్చు రగల్చింది ఎవరు? తండ్రి కొడుకుల వైరంతో పార్టీ చీలిక దిశగా అడుగులు వేయిస్తుంది ఎవరు? వీటన్నింటికి ఒక్క పేరే వినిపిస్తోంది. అతనే అమర్‌సింగ్. విశ్లేషకులు అభ్రిపాయం ప్రకారం పార్టీ నుంచి ఆరేళ్ల క్రితం బహిష్కృతుడైన అమర్‌సింగ్‌ను త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్లీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మోదీ హవా, ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అనుభవజ్నుడైన అమర్‌సింగ్ అవసరం ఎంతో ఉందని భావించిన ములాయం సోదరుడు శివపాల్.. ములాయంను ఒప్పించి మరీ అమర్‌ను పార్టీలోకి తీసుకొచ్చాడు.

అయితే అమర్‌కు రాజ్యసభ సీటివ్వడాన్ని సీఎం అఖిలేష్ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. అఖిలేష్‌కు మద్దతుగా ములాయం చిన్నాన్న కుమారుడు రాంగోపాల్ మద్దతు పలుకుతున్నారు. పార్టీలో క్రమంగా విభేదాలు పెరగడంతో నెల రోజుల క్రితం అఖిలేష్ కేబినెట్ నుంచి శివపాల్‌ను తప్పించారు. దీనికి ప్రతీకారంగా అఖిలేష్‌ను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించిన ములాయం ఆ పదవిని శివపాల్‌కు అప్పజెప్పారు. అఖిలేష్ అనుకూలురందరినీ పార్టీ పదవుల నుంచి తప్పించారు.

తండ్రి తీసుకున్న వ్యతిరేక నిర్ణయంతో రగిలిపోతున్న అఖిలేష్ గత కొంత కాలంగా తన వ్యతిరేకతను చూపిస్తూనే వస్తున్నాడు. ఓ దశలో సొంత పార్టీ ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇక మరోవైపు గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ నేతృత్వంలోని ఖ్వామీ ఏక్తాదళ్‌ను ఎస్పీలో విలీనం చేయడాన్ని కూడా సీఎం అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిణామాలన్నీ కుటుంబంలో కలహాలకు కారణమయ్యాయి. సయోధ్యకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో అఖిలేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి సీఎం క్యాంపు కార్యాలయానికి మకాం మార్చారు. దీనికి ములాయం పినతల్లి (ములాయం సింగ్ రెండో భార్య) సాధన కారణమని ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్ వ్యాఖ్యానించడంతో ములాయం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఇది జరిగిన రెండు రోజులైనా గడవకముందే అమర్‌సింగ్ అనుకూలురైన ముగ్గురు మంత్రులను సీఎం తొలగించారు. ఇందులో మొదటి టార్గెట్ గా సినీ నటి జయప్రద ఉన్నారు. చలనచిత్ర వికాస్ పరిషత్ ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశాలు ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కు రాజకీయ సన్నిహితురాలిగా ఉన్న జయప్రద ఇటీవలే ఈ పదవిలోకి వచ్చారు. జయప్రదకు చలనచిత్ర అభివృద్ది సంస్థ ఉపాద్యక్షురాలిగా మంత్రి హోదాలో ఉన్నారు. దీంతో రచ్చకెక్కిన విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

ఏ క్షణంలోనైనా అఖిలేష్ కొత్త పార్టీ పెట్టే సూచలను కనిపిస్తున్నాయి. కాగా అఖిలేష్ కు 183 మంది ఎమ్మెల్యేలు, మూలాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ కు మద్దతుగా నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు.దీంతో వివాదం రాజుకుని రచ్చకెక్కింది. పార్టీ రెండుగా విడిపోయింది. ఏ ఎన్నికల కోసమైతే అమర్ సింగ్ ను తిరిగి తీసుకొచ్చారో ఇప్పుడు అవే ఎన్నికలకు ముందు పార్టీ ఛిన్నాభిన్నం అయిపోతోంది. చీలిక దిశగా సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP Political Crisis  Amar Singh  Akhilesh Yadav  Jayaprada  Sacks  

Other Articles