లోకేష్ తో తెలంగాణకు సవాల్ విసరనున్న చంద్రబాబు..? AP cabinet expansion after diwali, will lokesh gets berth..?

Will chandrababu give nod to entry of nara lokesh into cabinet atleast this time

Chandrababu Naidu, Lokesh, cbinet berth, ktr, telangana, kcr, IT depatment, it ministry, Political Strategy, Telugu Desam Party, TDP, YSRCP, Janasena, MLC elections

Will Andhra pradesh chief minister chandra babu naidu gives nod for the entry of Nara lokesh into his cabinet atleast this time.

లోకేష్ తో తెలంగాణకు సవాల్ విసరనున్న చంద్రబాబు..?

Posted: 10/22/2016 05:31 PM IST
Will chandrababu give nod to entry of nara lokesh into cabinet atleast this time

తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడు నారా లోకేష్‌బాబుతో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు సవాల్ విసరునున్నారా..? అందుకు అనుగూణంగా పావులు కదుపుతున్నారా..? గవర్నర్ తో గంటకు పైగా భేటీకావడానికి కూడా కారణం ఇదేనా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజన జరిగిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోగా, ఉప్పునిప్పుగా మారింన విషయం తెలిసిందే. అయితే కాసింత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీ కూడా అధికంగా వుండేది.

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నువ్వా నేనా అంటూ సాగిన అటలో పరిశ్రమలు మొదలుకుని అభివృద్ది వరకు అన్ని రంగాలలో పైచేయి ఎవరిది అన్న విషయంలోనూ పోటీ పడ్డారు. ఆ మధ్య లోకేష్ బాబు.. కేటీర్ ఇద్దరూ పోటీ పడి మరీ అమెరికా పర్యటన చేసి తెలుగు రాష్ట్రలలో పెట్టుబడును తీసుకోచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే కాలక్రమేనా అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తనను తాను రుజువు చేసుకుంటూ కేటీఆర్ ముందుకు దూసుకెళ్తుండగా, ఆయనకు సవాల్ విసరాలని చంద్రబాబు భావిస్తున్నారు. తన అబ్బాయి లోకేష్ ని కూడా అమాత్యుడిని పదవినిప్పించి కేటీర్ కు ధీటుగా నిలబెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అన్ని వ్యవహారాలను నడుపుతున్న లోకేష్ బాబుకు మంత్రి పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, ఇందులోభాగంగానే ఇటీవల గవర్నర్ తో గంటసేపు భేటీ అయ్యారని సమాచారం.

 నవ్యాంధ్రలో అధికార పగ్గాలు చేతికందిన నాటి నుంచి.. తన పుత్రరత్నాన్ని అమాత్యుడిని చేయడం కోసం బాబు అనేక ప్రయత్నాలు చేస్తూనే వాయిదా వేస్తూ వస్తున్నారు.  లోకేష్ ను మంత్రి చేయ‌డం ఎలా అన్న అంశం.. టీడీపీ పార్టీలో, పార్టీ శ్రేణులలో మ‌రోసారి హాట్ టాపిక్ అయింది. గ‌త కొన్ని నెల‌లుగా ఇదే అంశం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌లుగుతూనే ఉంది. ఇదిగో అదిగో అంటున్నారే త‌ప్ప‌, చిన‌బాబుకు ప‌ద‌విని క‌ట్ట‌బెట్టే అంశంలో చంద్ర‌బాబు నాయుడు బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకునేందుకు ఒక‌టికి ప‌ది ర‌కాలుగా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలిసింది.

లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి అంటూ ఇస్తే ఏదో ఒక కీల‌క‌మైన శాఖే ఇవ్వాల్సి ఉంటుంది! ప్ర‌స్తుతం దేశం వ‌ర్గాలు ఇస్తున్న లీక్స్ ప్ర‌కారం చూసుకుంటే.. ఆర్థిక శాఖ‌, లేదా హోం శాఖ బాధ్య‌త‌ల్ని చిన‌బాబుకు ఇవ్వొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. లేక కేటీఆర్ తో సవాల్ ను ఎదుర్కునేందుకు ధీటుగా ఐటీ శాఖ ను అప్పగిస్తారా..? అన్న ప్రశ్నలు కూడా టీడీపీ నేతల్లో ఉత్పన్నమవతున్నాయి. ఎలాగూ వ‌చ్చేయేడాది ఫిబ్ర‌వ‌రిలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌స్తున్నందున.. ఆయనను ఎమ్మెల్సీగా ఎన్నుకుని చ‌ట్ట‌స‌భ‌లో స‌భ్య‌త్వం క‌ల్పించ‌ాలని కూడా నిర్ణయించారని తెలుస్తుంది.

లోకేష్ ఏ శాఖ తీసుకున్నా అత‌డిపైనే అంద‌రి అటెన్ష‌న్ తో పాటు భారీ అంచనాలు కూడా వుంటాయన్నది కాదనలేని నిజం. లోకేష్ ఏం చేస్తున్నారూ అని ప్ర‌జ‌లూ ఆస‌క్తిగా గమనిస్తుంటారు. రాష్ట్రం అప్పుల్లో వున్న సమయంలో అభివృద్ది అంత వేగంగా జరగదు. అయినా ప్రగతి ఫలాలను మాత్రం ప్రజలకు అందించాలి. అలా కాని పక్షంలో మంత్రిగా లోకేష్ ఏం సాధించారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. ఇక ఇది రాబోయే ఎన్నికలలో ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రంగా మారుతుందని ప్రశ్నలు కూడా పార్టీవర్గాలలో ఉత్పన్నమవుతున్నాయి. అయినా ఒకింత ధైర్యం చేసి లోకేష్ బాబుకు ఐటీ శాఖను కేటాయించి.. తెలంగాణకు సవాల్ విసరాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Lokesh  Political Strategy  Telugu Desam Party  TDP  YSRCP  Janasena  MLC elections  

Other Articles