సిద్దూకు కాంగ్రెస్ గాలం.. బంఫర్ ఆఫర్ తాయిలం.. Navjot Singh Sidhu offered deputy CM post by Congress?

Navjot singh sidhu offered deputy cm post by congress

Politics News, Punjab Assembly Elections, Navjot Singh Sidhu, Awaaz-e-Punjab party, Congress, Punjab Deputy CM, Punjab Congress, jalandhar,Amarinder Singh, AAP, Aam Aadmi Party, BJP

Congress is believed to have offered BJP rebel Navjot Singh Sidhu the post of deputy chief minister if he joins hands with the party in the upcoming Punjab assembly elections

సిద్దూకు కాంగ్రెస్ గాలం.. బంఫర్ ఆఫర్ తాయిలం..

Posted: 10/20/2016 01:33 PM IST
Navjot singh sidhu offered deputy cm post by congress

దాదాపు రెండు పర్యాలయాల నుంచి ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏఢాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలో పూర్తి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావింస్తుంది. అందుకు అనుగూణంగా పావులు కదుపుతుంది. ఇప్పటికే ఒపినీయన్ ఫోల్స్ సర్వేలలో కాంగ్రస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తున్నందని అంచనాలు వెల్లడయ్యాయి. అయితే గత ఎన్నికల సమయంలోనూ ఇలాంటి అంచనాలే పార్టీకి అధికారం దూరం చేశాయని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఏమాత్రం సబరపడకుండా పార్టీ పూర్తి మోజారిటీని అందుకునేందుకు అవసరమైన అన్ని చర్యలకు ఉపక్రమించింది.

ఇందులో భాగంగా మాజీ క్రికెటర్, బీజేపి రెబల్ గా ముద్రపడి, రాజ్యసభ సీటుకు వీడ్కోలు చెప్పి.. ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు కాంగ్రెస్ అధిష్టానం గాలం వేసిందని సమాచారం. ఆయనకు భారీ బంఫర్ ఆఫర్ ను తాయిలంగా ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ సిద్దమైందని టాక్. అయితే ఈ వార్తను అధికారికంగా ఎవ్వరూ వెల్లడించనప్పటికీ..రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది. అసలేంటి ఆ బంపర్ ఆపర్ అన్న విషయమై పంజాబ్ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

సిద్దూకి కాంగ్రెస్ ఇచ్చిన బంఫర్ ఆఫర్ తాయిలం ఉపముఖ్యమంత్రి పదవి. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో సిద్దూ కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలిపితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మాత్రం ఈ విషయంపై కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కాంగ్రెస్ లో చేరాలని వచ్చిన ఆఫర్ ను సిద్ధూ తిరస్కరించగా, తాజాగా డిప్యూటీ సీఎం పోస్ట్ అంటూ ఆయనకు మళ్లీ ఆఫర్ వచ్చింది.

సిద్ధూ తమ పార్టీకి మద్ధతు ఇవ్వడం కాదు ఏకంగా ఆయన నెలకొల్పిన ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు అమరిందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇదిలా వుండగా, కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా అమరిందర్ సింగ్ పేరు పరిశీలించినా, ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆవాజ్-ఏ-పంజాబ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదింపులు జరుపుతోందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధూ అక్కడ భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.

ఉత్తరప్రదేశ్ తో పోల్చితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో సిద్ధూను ఎలాగైనా తమ పార్టీకి మద్దతిచ్చేలా చేసుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అంతేకాదు సిద్దూ పార్టీకి చెందిన 13 మందికి అసెంబ్లీ టిక్కెట్లను కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసింది. మరి ఎవరి అఫర్ తో సిద్దూ సంతృప్తి చెందుతారో..? ఎవరితో ఎన్నికల బరిలోకి దిగుతారో వేచిచూడాల్సిందే..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles