Dayashankar's wife, daughter paying for being silent on obscene comment

Dayashankar singh s family files fir against mayawati bsp leaders

fir against mayawati, police case against mayawati, dayashankar slur row, fir on bsp leaders, swathi singh mayawati, mayawati swathi singh, Mayawati, abuse issue, swathi singh, Dayashankar singh, FIR, uttar pradesh

The family of expelled BJP leader Dayashankar Singh on Friday lodged a named FIR against Mayawati and some other BSP leaders for allegedly using foul language against them

బీజేపి రివర్స్ గేర్: దళిత నేతలపైనే కేసులా..?

Posted: 07/23/2016 12:05 PM IST
Dayashankar singh s family files fir against mayawati bsp leaders

బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం శరాఘతంలా తయారవ్వడంతో దానిని తిప్పికోట్టేందుకు బీజేపి ఎత్తుకు పైఎత్తు వేసింది. దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రంగా వున్న ఉత్తర్ ప్రదేశ్ లో మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న తరుణంలో ఎలాగైన తమ పార్టీకి అపాదించిన మరకను తొలగించుకునే పనిలో భాగంగా చకచకా పావులు కదుపుతోంది. ఇప్పటికే బీజేపి దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని, అటు గుజరాత్ లోనూ దళితులను టార్గెట్ గా చేసిన గో రక్షక సమితీ.. ఇటు ఉత్తర్ ప్రదేశ్ లో ఏకంగా బీఎస్సీ నేతనే టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయిండంతో ఈ భావన ప్రజల్లో బలపడే అవకాశాలున్నాయి,

గుజారాత్ లో దళితులను, కర్రలు ఇనుప రాడ్లతో కోట్టిన ఘటనపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విఫక్షాలు సానుభూతి వ్యక్తం చేయడం, దళితులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా సాగుతుండగానే మాయావతిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ మరటు వ్యాఖ్యలు చేయడం బీజేపి ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసే అవకాశాలు వుండడంతో.. బీజేపి ఏకంగా రివర్స్ గేర్ అమలు చేస్తున్నట్లు వుంది.

మాయావతి సహా బీఎస్సీ నేతలపై దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీఎస్పీ నాయకులు, కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలతో తానతో పాటు తన కుమార్తె కూడా మానసికంగా నలిగిపోతున్నామని, ముఖ్యంగా తమ 12 ఏళ్ల కుమార్తె తీవ్ర మనోవేదనకు గురైందని స్వాతి సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్సీ నేతలు తమ కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అరోపిస్తూ అమె పోలీసులకు పిర్యాదు చేశారు, దీంతో అమెపై ఏకంగా పోలీసులు ఎప్ఐఆర్ కూడా నమోదు చేశారు.

అయితే దయాశంకర్ కుటుంబ సభ్యులను తమ పార్టీ మద్దతురాలు వేధించలేదని మాయావతి అన్నారు. తనపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలతో బీఎస్పీ కార్యకర్తలు ఆవేదనకు లోనయ్యారని చెప్పారు. బలహీనవర్గాల ప్రజలను తనను సోదరి, దేవతగా ఆరాధిస్తారని అన్నారు. దయాశంకర్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని తమ పార్టీ కార్యకర్తలకు సూచించినట్టు చెప్పారు. తమను అవమానించారని చెబుతున్న దయాశంకర్ కుటుంబ సభ్యులు.. మహిళలకు జరిగిన పరాభవాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. దయాశంశర్ అనుచిత వ్యాఖ్యలు చేసివుండకపోతే.. తమ కార్యకర్తలు వారిపై ఎందుకు అనుచితంగా వ్యవహరిస్తారని బీఎస్సీ నేతలు ప్రశ్నించారు. అధికారంలో వున్నామని తమ నేత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆ తరువాత వాటిని తిప్పికోట్టేందుకు ప్రయత్నాలు చేయడం బీజేపి నేతలకు అలవాటుగా మారుతుందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mayawati  abuse issue  swathi singh  Dayashankar singh  FIR  uttar pradesh  

Other Articles