హరిత హారం రెండో దశ కూడా అట్టర్ ఫ్లాపే | KCR second phase haritha haram utter flop

Kcr second phase haritha haram utter flop

KCR second phase haritha haram, haritha haram again utter flop, negligence of Officials haritha haram, haritha haram again failed, telangana greenary mission haritha haram, KCR vision flop, haritha haram programme

KCR second phase haritha haram utter flop. Due to negligence of Officials plants died.

సొగసులు వాడిపోతున్నాయి???

Posted: 07/20/2016 11:00 AM IST
Kcr second phase haritha haram utter flop

మూడేండ్లలో తెలంగాణ రాష్ట్రం హరిత వనం కావాలి... ఎక్కడ చూసినా పచ్చదనంతో అడవులను తలపించాలి. ఇది ప్రతిష్టాత్మక పథకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు. రాష్ట్రం మొత్తంగా బడి గుడి తేడా లేకుండా, చెరువుగట్లపైన, నదుల ఒడ్డున కూడా మొక్కలను విరివిగా పెంచాలని చెప్పారు. ప్రతి ఫ్యాక్టరీలో, అన్ని కార్యాలయాల్లో ఎక్కడ చూసినా చెట్లు ఎదగాలని, ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో కచ్చితంగా పచ్చదనం కనిపించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. పక్షం రోజులుగా హ‌రిత‌హారం ఉద్యమంలా సాగింది.

సెలబ్రిటీలు, అధికారులు, సామాన్య ప్రజానీకం అంతా చురుగ్గా ఇందులో పాల్గొన్నారు. భాగ్యనగరంలో టార్గెట్ 25 ల‌క్షలుగా పెట్టుకుంటే, అద‌నంగా మ‌రో 4 ల‌క్షలు  నాటడం విశేషం. అయితే మొక్కే కదా నాటేద్దాం అనుకున్నంత మాత్రానా సరిపోదని, దాని సంరక్షణ కూడా చూసుకోవాల్సిన బాధత్య అందరిపైనా ఉందని కేసీఆర్ పిలుపునిచ్చాడు. పనిలో పనిగా అధికారులకు కూడా ఆ భాద్యత సంరక్షణను అప్పగించారు. మొదటి దశలో కొన్ని మొక్కల పరిస్థితి చూసిన గవర్నర్ నరసింహాన్ కూడా ఈమేరకు అధికారులకు గట్టి వార్నింగే ఇచ్చారు. మరి ఉవ్వెత్తున్న ఈ జరిగిన ఈ కార్యక్రమం రెండో దశ అయినా సక్సెస్ అయ్యిందా అని చూసుకుంటే....

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పది రోజుల తిరగకముందే ఎండిపోతుండడం ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యాలకు అవరోధంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి వద్ద మొక్క నాటి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట హరితహారాన్ని ప్రారంభించిన మొక్కలు వాడిపోయాయి. మొక్కలు నాటినప్పటికీ వాటి సంరక్షణకు అవసరమైన చర్యలను అటు నాటిన వారుగానీ ఇటు నాటించిన ప్రభుత్వం కానీ రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ‘దిక్కులేని అనాథలుగా’ మారుతున్నాయి.

వెరసి హరిత హారం అంటే ఎండిన మొక్కల సమాహారం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నల్లగొండ జిల్లా కార్యక్రమంలో కేసీఆర్ మొక్కలు నాటుతున్న సమయంలోనే 153 కిలోమీటర్ల జాతీయ రహదారి పై రికార్డు స్థాయిలో ఒకేరోజు 87 వేల మొక్కలు నాటారు. ప్రజలు విద్యార్థులు ప్రభుత్వ శాఖల సిబ్బంది - మహిళా సంఘాలు - అంగన్ వాడీలు - స్వచ్ఛంద సంస్థల సభ్యులంతా పోటీలు పడి మరీ మొక్కలు నాటారు. అయితే నాటిన మొక్కలకు నీరు పోసే దిక్కులేక వేల సంఖ్యలో మొక్కలు ఎండిపోతూ దర్శనమిస్తున్నాయి.

హరితహారం ప్రారంభం రోజున అధికారులు మాట్లాడుతూ మొక్కల సంరక్షణకు పర్యవేక్షణాధికారులను నియమిస్తామని, వారి నంబర్లతో హెల్ఫ్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని, మొక్కలు ఎండిపోయినట్లు దృష్టికి వస్తే వారికి సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ దిశగా నేటికీ చర్యలు తీసుకోకపోగా, వాటివైపు చూసే వారే కరువయ్యారు. అధికారుల మాట అటుంచి సాధారణ ప్రజానీకం కూడా నాట్ ఇంట్రెస్టెడ్ అంట్ లైట్ తీస్కుంటున్నారు. వర్షాలు లేకపోవటం, ఉష్టోగ్రతల్లో మార్పుతో చాలా వరకు మొక్కలు ఇప్పటికే వేలల్లో చనిపోయాయి. ఒక్క నల్గొండలోనే కాదు, రాజధానిలో, మిగతా జిల్లాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హరితహారం సొగసుల సంగతేమోగాని నర్సరీల్లో మొక్కలు పెంచి నాటేందుకు చేసిన కోట్ల ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అయినట్లేనా పలువురు ఆవేదన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  haritha haram  greenary programme  utter flop  

Other Articles