తెలిసి కూడా తప్పు చేస్తున్నారా? | KCR ignore section 30 of AP reorganisation act for high court

Kcr ignore section 30 of ap reorganisation act for high court

Former Justice Chandra Kumar about high court, Justice Chandra Kumar on High Court Bifurcation Row, KCR section 30, AP reorganisation act section 30

High Court Former Justice Chandra Kumar, where he speaks over issues like High Court Bifurcation Row, Judges Suspension. KCR should Concentrate section 30 AP reorganisation act for high court.

తెలిసి కూడా తప్పు చేస్తున్నారా?

Posted: 06/30/2016 03:13 PM IST
Kcr ignore section 30 of ap reorganisation act for high court

తమ ప్రమేయం లేదని కేంద్రం చేతులెత్తేస్తున్నప్పటికీ ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ మొండిపట్టుతో ఉన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ కోర్టును ఏర్పాటు చేసుకునే దాకా పదేళ్లు ఉమ్మడి హైకోర్టును భరించాలని, లేని పక్షంలో తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేసుకోవాలని అందులో ఉంది. అయితే ఇప్పటికిప్పుడు హైకోర్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అయినా విభజించాల్సిందేనని తెలంగాణలో పదిరోజులుగా కాష్టం రగులుతోంది.

విభజన చట్టాన్ని అసాంతం అవపోసన పట్టిన కేసీఆర్ కు అందులో ఉన్న లోసుగు తెలీదా అని ప్రశ్నిస్తున్నారు పలువురు మేధావులు. ముఖ్యంగా సెక్షన్ 30 సవరణపై దృష్టి సారించి ఉంటే హైకోర్టు ఈపాటికే వచ్చి ఉండేదని వారు చెబుతున్నారు. దీనిపై ఓ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రకుమార్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జడ్జిల ఆప్షన్స్ విషయంలో చీఫ్ జస్టిస్ తప్పేం లేదని, సెక్షన్ 30లో లోపమే దానికి కారణమని ఆయన అంటున్నారు.

సెక్షన్ 30 ఏంటీ?

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 30 ప్రకారం కొత్త హైకోర్టు నిర్మించేంత వరకు న్యాయ శాఖలో ఉమ్మడి సేవలు తప్పవు. ఇది ఏపీ రాష్ట్రానికున్న హక్కు. ఇందులో ఎవరినీ ప్రశ్నించలేం, అడ్డుకోలేం. ఇదే వారికి పాలిట ప్లస్ గా మారిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సమ్యలన్నింటికి పరిష్కారం సెక్షన్ 30లో సవరణ తేవడమే. పార్లమెంట్ సమావేశాల ద్వారానే ఇది సాధ్యం, లేదంటే రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ కు ప్రయత్నించవచ్చు చంద్రకుమార్ వివరించారు.

అయితే ఈ లాజిక్ లేం తెలీకుండా హైకోర్టును విభజించమని కేసీఆర్, మరికొందరు అంటున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ ఈ విషయంలో గట్టి పట్టుబడితే హైకోర్టు త్వరగా వస్తుందని, అలా చేయనంత వరకు తెలంగాణకు సొంతంగా హైకోర్టు రాకపోగా, న్యాయాధికారులపై వేటు, నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Former Justice Chandra Kumar  Telangana  High Court Bifurcation  KCR  section 30  

Other Articles