డిప్యూటీ సీఎం కేఈ పై కొత్త ఆరోపణలు? | Deputy CM KE krishnamurthy ignore district leaders

Deputy cm ke krishnamurthy ignore district leaders

Deputy CM KE krishnamurthy, Kurnool TDP politics, KE ignore Kurnool TDP politics, కేఈ పై కొత్త ఆరోపణలు, కర్నూల్ రాజకీయాల్లో కేఈ వైఫల్యం, తాజా వార్తలు, తెలుగు వార్తలు, కేఈ రాజకీయాలు, ఏపీ రాజకీయాలు, డిప్యూటీ సీఎం కేఈ చంద్రబాబు నాయుడు

Deputy CM KE krishnamurthy ignore district leaders and cadre. Leaders complaint on Deputy CM KE krishnamurthy

డిప్యూటీ సీఎం కేఈ పై కొత్త ఆరోపణలు?

Posted: 06/28/2016 03:00 PM IST
Deputy cm ke krishnamurthy ignore district leaders

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఉన్న అంతర్గత విభేదాల గురించి తెలిసిందే. అయితే అది ఒకప్పుడు మాత్రమే. మారిన పరిస్థితులతోపాటు తన పదవికే ఎసరు రావటంతో ఇకపై మంచిగా మెదులుకోవాలని ఆయన భావించారు. నిజానికి రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడే ఆయనను పదవి నుంచి తొలగిస్తారని అంతా అనుకున్నారు. ఇకపై తప్పులు జరగబోవ్వన్న హామీతో ఆ నిర్ణయంలో బాబు వెనక్కి తగ్గారు.

ఇక అప్పటి నుంచి బాబు దృష్టిలో పడేందుకు ఆయన చేయని ప్రయత్నాలు లేవంటే నమ్మండి.  కర్నూల్ టీడీపీ కార్యాలయం పై దాడి సందర్భంలో తమ్ముడు తమ్ముడే.. పార్టీ పార్టీనే... అంటూ సోదరుడు కేఈ ప్రభాకర్‌పై చర్యలకు దిగాడు ఆయన. అంతవరకు బాగానే ఉన్నా ముందు అసలు జిల్లా కార్యకర్తలను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన మంత్రిత్వ శాఖలో ఓవర్ సమీక్షలతో బిజీగా ఉన్న ఆయనకి సొంత జిల్లా రాజకీయాలను పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.

నిజానికి సొంత నేతల బలం లేకపోయినా కేవలం పార్టీ సీనియర్ నేత అనే కారణంతో కేఈకి డిప్యూటీ సీఎం పదవి దక్కింది.  కానీ, ఇప్పుడు కీలక పొజిషన్ లో ఉన్న ఆయన కనీసం జిల్లాస్థాయి నేతలతో కూడా మమేకం కాకపోవటం విడ్డూరం. కర్నూలు జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని ఓవైపు చంద్రబాబు భావిస్తుంటే… కేఈ చర్యలతో తిరోగమి బాట పడుతుందనే భయం పార్టీ కేడర్ లో నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఇన్ ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుకు మొరపెట్టుకుంటున్నారంట.

సాక్ష్యాత్తూ డిప్యూటీ సీఎం తమ జిల్లా వాడే అయినా తమ సమస్యలు పరిష్కారం కావట్లేదంటూ అచ్చెన్న దగ్గర వాపోతున్నారు. మొత్తానికి  కేఈ అతి జాగ్రత్తకు పోయి కర్నూల్ కార్యకర్తల నుంచే విమర్శలు ఎదుర్కోవటం ఆశ్చర్యం కలిగించేదే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles