టీడీపీలోకి మరో ఇద్దరు పక్కా! | two more krishna YSRCP MLAs join TDP

Two more krishna ysrcp mlas join tdp

Tiruvuru MLA TDP, Pamarru MLA TDP, Krishna YSRCP, YSRCP krishna MLAs to TDP, Nuzvid MLA rumours, టీడీపీలోకి మరో ఇద్దరు, కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, సైకిల్ ఎక్కనున్న వైసీపీ ఎమ్మెల్యేలు, కృష్ణా వైసీపీ ఖాళీ, జగన్ కి కృష్ణాలో ఝలక్, ఏపీ రాజకీయాలు, వైసీపీ వార్తలు, వైసీపీ నుంచి జంప్, మరో ఇద్దరు జంప్

Another shock to YSRCP. Tiruvuru and Pamarru MLAs join TDP soon.

టీడీపీలోకి మరో ఇద్దరు పక్కా!

Posted: 06/24/2016 12:31 PM IST
Two more krishna ysrcp mlas join tdp

ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఆకర్ష్ జోరు తగ్గలేదు. జగన్ కూడా పెద్దగా పట్టించుకోకపోవటంతో వైసీపీ నేతలు కూడా ఇష్టానుసారం సైకిల్ ఎక్కేస్తున్నారు. ఇప్పటికే 20కిపైగా ఎమ్మెల్యేలు పార్టీ మారగా తాజాగా మరికొందరు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారని తెలుస్తోంది.

వైసీపీ కి గట్టి పట్టు ఉన్న కృష్టా జిల్లాలో ఇప్పటికే భారీగా వలసలు జరిగాయి. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ బాట పట్టనున్నట్లు సమాచారం. నూజివీడు, తిరువూరు, పామర్రు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. వీరిలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మాత్రం చేరిక విషయాన్ని ఖండించారు.

పార్టీ మారే విషయాన్ని ఉంటకిస్తూ అధికార పక్షంలోకి చేరిన వారంతా ఏడాదిలోపు తిరిగి వైసీపీలోకే వస్తారని ఆయన అంటున్నారు. అయితే మిగతా ఇద్దరు మాత్రం సైలెంట్ గా ఉండటంతో వారి చేరిక దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. 20 మంది చేరికతో  ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీ బలం 47కి పడిపోయింది. అయితే వరుస చేరికలతో ప్రతిపక్షాన్ని ఖాళీ చేస్తున్నామని చంకలు గుద్దుకుంటున్న టీడీపీకి భవిష్యత్తులో ఇవే పెద్ద తలనొప్పిగా మారటం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP akarsh  Krishna YSRCP  Tiruvuru MLA  Pamarru MLA  Nuzvid MLA  

Other Articles