with bjp having enough number in both houses, focuses on achhedin

Will bjp emerge as the single largest party in rajya sabha

PM Modi, narendra modi, lok sabha, rajya sabha, five state elections, election results, BJP, Congress, allied parties, RS strong hold, jayalalithaa, mamata banerjee, achhutanandan, congress sonia gandhi, rahul gandhi, bjp achhedin,

Even after Two years PM modi government has not focused on achhedin, the reason is rajya sabha. Now they has enough number in both houses and focuses on achhedin

ఇప్పుడైనా బీజేపి ‘అచ్చేదిన్’ వచ్చేనా..?

Posted: 05/23/2016 12:42 PM IST
Will bjp emerge as the single largest party in rajya sabha

కేంద్రంలో కోలువుదీరిన నరేంద్రమోడీ ప్రభుత్వం అప్పుడే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా.. ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన మంచి రోజుల మాత్రం రాలేదు. అంతర్జాతీయంగా కారుచౌకగా లభిస్తున్న బ్యారట్ క్రూడ్ అయిల్ పై పన్ను పోట్లు వేసి యూపిఏ హయాంలో అందించిన ధరలకే ఇప్పుడు కూడా విక్రమిస్తు మధ్యతరగతి ప్రజలను చుక్కలు చూపిస్తుంది మోడీ సర్కార్. ఈ విషయంలో ఇప్పటికే మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇంధనంపై సెస్సుల రూపంలో ఆర్జిందిచిన లక్షా 40 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు.

పేదవాడికి డిపాజిట్ లేని బ్యాంకు అకౌంట్ ఇచ్చి అందులో గ్యాస్ తదితర డబ్బులు వేసుకునేందుకు మాత్రమే అవకాశాన్ని కల్పించారు. దీంతో అకౌంట్ లేని వారికి లాభం చేకూరిందని అనుకునేప్పటికీ.. అలా ఎంతో కొంత వున్న డబ్బును భీమా సౌకర్యం పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటుంది కేంద్రం. ఇది లాభమే కదా అన్న వారు లేకపోలేదు. అయితే అంతకుముందు అమలులో వున్న అపద్భంధు పథకాన్ని అటెకెక్కించింది కేంద్రం. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే లభించే 50 వేల రూపాయలను ఈ భీమాతో హరించుకుపోయింది.

ఇక స్వచ్చ భారత్ ప్రచారం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని శబ్రంగా చేయాలనుకుంటుంది. కానీ అంతకన్నా ముఖ్యంగా కరువు కాటువేయడంతో అకలితో అలమటిస్తున్న రైతన్నను మాత్రం అదుకోవడంలో విఫలం అవుతుంది. ఈ విషయమై ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలు పర్యాయాలు మొట్టికాయలు కూడా వేసింది. అయినా ప్రభుత్వ తీరు మారడం లేదు. రైతన్నల కోసం అసలు కేంద్రం ఏ విధంగానూ అదుకునేందుకు ముందుకురావడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి.

కేవలం ఎన్నికల ముందు రైతు జపం చేయడమే కేంద్రానికి పరిపాటిగా మారింది తప్ప. వారి సంక్షేమం కోసం ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు తీసుకోచ్చిందో తెలియడం లేదు. ఎన్ని పథకాలు తీసుకువచ్చింది. ఎంత మందికి లబ్ధి చేకూరిందన్న విషయాన్ని పక్కన బెడితే.. ఈ రెండేళ్ల కాలంలో ఎంత మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న లెక్కలు తీస్తే.. అర్థమవుతుంది. అయితే ఇక్కడ తప్పంతా బీజేపి ప్రభుత్వానిదని అనుకుంటే పోరబాటే. అయితే గత మూడు దశాబ్ధాలుగా ఎన్నడూ  లేని విధంగా ఏకపక్ష మెజారిటీ సాధించిన బీజేపి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతలకు అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం.

అలాంటిది అధికారంలోకి రాగానే యూపిఏ ప్రభుత్వం రైతన్నలకు అందించిన వరంగా చెప్పుకునే భూ సంస్కరణల చట్టంలో మార్పులు తీసుకువస్తామని, వారి భూములను అప్పన్నంగా పారిశ్రామిక వేత్తలను అప్పగించే విధానానికి మోడీ ప్రభుత్వం మొగ్గుచూపింది. అంతేకాదు ఇందుకోసం అనేక పార్టీలు ఉద్యమించడం కూడా బీజేపికి గిట్టలేదు. ఇక రాజ్యసభలో తమకు బలంలేదని అందకున్న బీజేపి.. సవరణలపై వెనక్కు తగ్గింది. ఇక ఇప్పుడు రాజ్యసభలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో మళ్లీ రైతుల భూముల విషయంలో సవరణల చట్టాన్ని మళ్లీ తెరపైకి తీసుకోస్తుందా..? అన్న అనుమానాలు కూడా రైతన్నల్లో వున్నాయి.

తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజ్యసభలో సమీకరణాలు మారనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి, మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల గెలుపు.. పెద్దల సభను బీజేపీకి అనుకూలంగా మార్చనున్నాయి. ఇప్పటివరకూ రాజ్యసభలో సంఖ్యాబలం అధికంగా గల కాంగ్రెస్.. బీజేపీ ప్రభుత్వ కీలక బిల్లులకు మోకాలడ్డుతోంది. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. అయితే తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాలతో పరిస్థితి మారనుంది.

జూన్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం తగ్గనుంది. ఆ మేరకు ఎస్పీ, ఏఐఏడీఎంకే తదితర పార్టీల బలం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతుతో కీలక బిల్లులకు మోక్షం కలుగుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) బిల్లు 2015లోనే లోక్‌సభలో ఆమోదం పొంది, సంఖ్యాబలం లేకపోవడంతో రాజ్యసభ ఆమోదానికి నోచుకోక అలా ఉండిపోయింది. ఇలాంటి పెండింగ్ బిల్లుల విషయంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో రాజ్యసభలో గట్టెక్కవచ్చని బీజేపీ భావిస్తోంది.
 
సీట్లు తగ్గినా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్సే! మొత్తం 57 రాజ్యసభ సీట్లకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ బలం 64. గత రెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ 4 నుంచి 5 స్థానాలు కోల్పోనుంది. దీంతో 245 సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపి మిత్రపక్షాల బలమే అధికంగా వుండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో తమకు బలం లేనందువల్లే తాము ప్రజలకు అందించాల్సి మేలును అందించలేకపోతున్నాం అని బీజేపి నేతలు వ్యాఖ్యాలుచేశారు.

స్వయంగా బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాల బలంలో ఎగువ సభలో అధికంగా వుండటం వల్లే తాము తీసుకోచ్చిన బిల్లులను అమోదింపజేసుకోలేక పోతున్నామని, రైతులకు అందించాల్సిన మేలును కూడా మోడీ అందించలేకపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈ తరునంలో బీజేప దాని మిత్రపక్షాల బలం కూడా సరిసమానంగా వుండటం వల్ల ఇక మంచి రోజులకు ముహూర్తాల వచచినట్లేనా..?  రెండేళ్లుగా లేని మంచి రోజులను కేంద్రం ప్రజలకు అందిస్తుందా..? లేదా..? ఇప్పుడైన పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, బీజేపిపై నమ్మకంతో ఓటువేసిన వారికైనా కనీసం మంచి రోజులు వస్తాయా..? అన్నది వేచి చూడాల్సిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajya Sabha  Five states Election results  BJP  Congress  allied parties  RS strong hold  

Other Articles