TRS may effect in the Hyderabad elections by the ABN Andhrajyothy channel

Trs may get negative results in the hyderabad elections by the abn andhrajyothy channel

ABN Andhrajyothy, Andhrajyothy, KCR, Telangana, Supreme court, Radhakrishna, KTR, open Heart with RK, Telanagan cabel

TRS may effect in the Hyderabad elections by the ABN Andhrajyothy channel. Telangana cabel operaters telecasting ABN Andhrajyothy channel from today

ఎబిఎన్ తో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు దెబ్బా..?

Posted: 12/01/2015 03:56 PM IST
Trs may get negative results in the hyderabad elections by the abn andhrajyothy channel

కేసీఆర్ కు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కథనాలు, వార్తలు ప్రసారం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏబీఎన్ ఛానల్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తర్వాత అసలు ఛానల్ ప్రసారాలు తెలంగాణ వ్యాప్తంగా రాకుండా బ్యాన్ చేశారు. తెలంగాణ కేబుల్ ఆఫరేటర్ల సంఘం ద్వారా ఏబీఎన్ ఛానల్ ప్రసారాలను తెలంగాణలో ఎక్కడా కూడా ప్రసారం కాకుండా నియంత్రించారు. అయితే ఏబీఎన్ ఛానల్ ప్రసారాలు తెలంగాణలో లేకుండా పోవడంతో తీవ్ర నష్టానికి గురైంది. కాగా ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా కొంత వరకు నెట్టుకురాగలిగింది. అయితే ఏబీఎన్ లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించింది. అయితే తాజాగా సుప్రీం కోర్ట్ తీర్పుతో తెలంగాణలో ఛానల్ ప్రసారాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

Also read: కేసీఆర్ పై చెలరేగుతున్న మీడియా ఆగ్రహజ్వాలలు!

తెలంగాణ వ్యాప్తంగా ఏబీఎన్ ఛానల్ మీద బ్యాన్ ఉన్న కాలంలో కూడా ఆంధ్రజ్యోతిలో తెలంగాణ సిఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురించింది. తాజాగా మరోసారి జనాల్లోకి ఏబీఎన్ ఛానల్ రావడంతో ఏబీఎన్ ఛానల్ ఆర్ కేకు శక్తి పుంజుకున్నట్లు కనిపిస్తోందని అప్పుడే కొంతమంది పరీశీలకులు బావిస్తున్నారు. ఏబీఎన్ ఛానల్ ను నిజానికి వరంగల్ ఎన్నికల కన్నా ముందే కేబుల్ చానల్స్ లో పునరుద్దరించాల్సి ఉన్నా కానీ ఏబీఎన్ ప్రసారాలు ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపుతాయని బావించి కేసీఆర్ కావాలనే నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Also read: మీడియాకు మావోల మద్దతు.. కేసీఆర్ కు షాక్ 

వరంగల్ ఉప ఎన్నికలు ముగిశాయి బంపర్ మెజారిటీతో టిఆర్ఎస్ గెలుపుసాధించింది. అయితే తాజాగా ఏబీఎన్ ప్రసారాలు పునరుద్దరించడం.. అలాగే త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ సమీపిస్తుండటంతో పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దాని మీద చర్చ సాగుతోంది. కొంత మంది మాత్రం ఏబీఎన్ చానల్ లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా కథనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వరంగల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటు బ్యాంక్ మీద ప్రబావం చూపే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ కు ఏబీఎన్ రాధాకృష్ణకు అస్సలు పొసగదని అందరికి తెలుసు. అయితే తన మీడియా ద్వారా హైదరాబాద్ ఎలక్షన్ లో రాధాకృష్ణ ఎలా ఫలితాలను ప్రభావితం చేస్తాడో.. కేసీఆర్ మీద ఎలా కసి తీర్చుకుంటాడో చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles