BJP wil win more seats in the Bihar elections

Bjp bags bihar elections

BJP Party bagging more seats in the Bihar elections. Recent survey conform the BJp victory. BJP party gaining more votes and seats in this election.

BJP Party bagging more seats in the Bihar elections. Recent survey conform the BJp victory. BJP party gaining more votes and seats in this election.

బీహార్ లో బీజేపీదే విజయం..!

Posted: 10/08/2015 10:33 AM IST
Bjp bags bihar elections

ఎన్నికలకు ముందు ఎన్నో చిత్రాలు జరగుతుంటాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు ఓటర్ల మనోగతాలను మార్చివేస్తుంటాయి. అయితే తాజాగా ఎన్నికలు జరగనున్న బీహార్ లో కూడా అదే జరుగుతోంది. నిన్నటి దాకా అటో.. ఇటో అన్నట్లున్న బీజేపీ పార్టీ భారీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  తొలివిడత పోలింగ్ మొదలు కావడానికి ఇక ఐదురోజులే ఉన్న తరుణంలో  కీలక సర్వేసంస్థలు  జరిపిన సర్వేలో  బీహార్ లో బీజేపీ ప్రభంజనం సాగుతోందని స్పష్టమైంది.  లోక్ నీతి- సీఎస్ డీఎస్  చివరి నిముషంలో నిర్వహించిన సర్వే ప్రముఖపత్రిక ప్రచురించింది. బీజేపీ-ఆధ్వర్యంలోని నాలుగు పార్టీల కూటమి  ఎన్నికల రేసులో ప్రత్యర్థికన్నా కన్నా నాలుగు శాతం పాయింట్లతో  ముందంజలో ఉంది.  సర్వేలో  బీజేపీ కూటమి 42 పాయింట్లు పొందగా  జేడీయూ- ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి  38 పాయింట్లతో వెనుకబడి ఉందట.  ఇది బీజేపీ కూటమికి కాస్త పైచేయే కానీ,    ప్రారంభదశలో నాలుగు శాతం తదుపరి దశల్లో మారే ప్రమాదమూ ఉంది.  అక్టోబర్ 12న 49 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో   విజయం పై ఏపార్టీకి ఆపార్టీ ధీమాతో ఉన్నాయి.

ఐదు దశల పోలింగ్ కు ఇది ఆరంభమే అయినా గుర్తించాల్సిన కీలక పరిణామం ‘ప్రభంజనం’.  ప్రభంజనంతో  వచ్చే ఫలితాలు  కచ్చితంగా  స్పష్టమైన మెజారిటీని తెచ్చిపెడతాయి. అయితే భవిష్యత్ లో  జేడీయూ – ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి కాస్త పరమిత స్థాయిలో ప్రభంజనం సృష్టించే అవకాశాలు లేకపోలేదు. ఆ దశలో ఇప్పటివరకూ ఏ కూటమి పక్షాన  నిర్ణయం తీసుకోని ఓటర్లు విజేతను నిర్ణయిస్తారు.  యూపీలో 2012లో  అఖిలేశ్ యాదవ్ కు ప్రయోజనం కల్గించింది ఈ ఓటర్లే.  బీఎస్పీ కన్నా ఓట్లలో  3 శాతం ఎక్కువసాధించి అఖిలేశ్ గద్దెనెక్కాడు.   లాలూ- నితిశ్  ప్రభుత్వం మరింత మెరుగ్గా ఉంటుందని చివరి క్షణంలో ఓటర్లు భావిస్తే మాత్రం నితీష్ కుమార్ కు కలిసి వస్తుంది. మొత్తానికి బీజేపీ పార్టీకి ఇది తీపి కబురే. బీహార్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం అందరి కన్నా ఎక్కువ సంతోషించేది మాత్రం నరేంద్ర మోదీనే ఎందుకంటే తనను ముందు నుండి వ్యతిరేకిస్తు వచ్చిన నితీష్ కుమార్ కు చెక్ పడుతుంది కాబట్టి. మరి ఏం జరుగుతుందో.. బీహార్ ఓటర్లు ఏం నిర్ణయిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Elections  BJP  Nitesh Kumar  lalu Prasad Yadav  Modi  Amith sha  Bihar Elections  Bihar future CM  

Other Articles