Really YS Jagan has the scene to become ap cm

Really ys jagan has the scene to become ap cm

Jagan, AP, CM, Chandrababu Naidu, YSRCP, Elections

Really YS Jagan has the scene to become ap cm. Jagan Mohan Reddy dreams as ap cm in the next elections.

జగన్ కు సిఎం అయ్యేంత సీన్ ఉందా...?

Posted: 08/31/2015 12:11 PM IST
Really ys jagan has the scene to become ap cm

వైయస్ జగన్.. గత ఎన్నికల్లో టిడిపి మీద పోటీగా నిలిచి.. చివరకు గెలవలేక ఓటమి రుచి చూసిన నేత. ఏపి రాజకీయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తు, టిడిపి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న రాజకీయ నాయకుడు. అయితే జగన్ గత కొంత కాలంగా ఓ పాట పాడుతున్నాడు. ఏంటా పాట అనుకుంటున్నారా..? ఉందిలే మంచి కాలం ముందు ముందునా... అందరూ సుఖపడాలి నందనందనా... అంటూ తెగ పాడుతున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారా..? ఏపికి కాబోయే ముఖ్యమంత్రిని నేనే, వచ్చే ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధిస్తుంది.. నేను సిఎ: అయిపోతానని పగటి కలలు కంటున్నారు. అయితే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు.. అప్పుడెప్పుడో నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికలు వాటి ఫలితాల మీద జగన్ ఇప్పుడే కలలు కనడం నిజంగా ఆశ్చర్యమేస్తోంది. అయినా జగన్ ఏపికి సిఎం అయ్యే చాన్స్ ఉందా..? అంత సత్తువ ఉందా జగన్ కు.? మొత్తం స్టోరీ చదవండి.

గత ఎన్నికల్లో టిడిపి పార్టీకి పోటీగా నిలిచింది వైఎస్ఆర్ సీపీ. చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ చాణిక్యుడి ముందు జగన్ బాగానే పోటీ పడ్డారు. జగన్ చాణిక్యం కూడా గత ఎన్నికల్లో బాగానే పని చేసింది. గ్రామస్థాయి నుండి ఓట్లను రాబట్టడంలో వైసీపీ నాయకులు అంతా కలిసి జగన్ కు బాగా కోపరేట్ చేశారు. అయితే చాలా జిల్లాల్లో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నా అక్కడ మాత్రం బోణీ కొట్టకుండా ఖాళీ చేతులు చూపించింది. ఇక వైయస్ కుటుంబానికి, నాటి కాంగ్రెస్, నేటి వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో కూడా జగన్ కు వ్యతిరేక పవనాలు వీచాయి. చాలా ప్రాంతాల్లో జగన్ కు వ్యతిరేక ఓటు బ్యాంక్ పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గెలుపుబాటలో దూసుకెళితే.. జగన్ మాత్రం వస్తున్నా.. వస్తున్నా అంటూ వెనకాల పరుగెత్తారు.

జగన్ కు ఆ మాత్రం సీట్లు ఓట్లు వచ్చాయంటే గ్రేట్ అనే భావన ఉంది. కానీ నిజానికి జగన్ అయినా, ఆ స్థానంలో ఎవరు ఉన్నా కానీ అదే జరుగుతుంది. అయినా అధికార పార్టీ కాకపోయినా జగన్, అండ్ కో చేసిన ఖర్చు గురించి కొత్తగా చప్పక్కర్లేదు. అవినీతికి పారకాష్ట అని చెప్పుకునే వైయస్ కుటుంబంలోని  వ్యక్తే కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలే అని సర్దుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నాయకుల ఇళ్లలో, చెరువుల్లో మద్యం బాటిల్లు వేల సంఖ్యల్లో ప్రత్యక్షమయ్యాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆ పార్టీ చెయ్యని పనంటూ ఏదీ లేదు. ఎక్కడైనా తవ్వుకుంటూ పోతే నీళ్లు వస్తాయేమో కానీ గత ఎన్నికల్లో వైసీపీ నిర్వాకం వల్ల చెరువులను తవ్వితే లక్షల సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపించాయి. మొత్తంగా చూస్తే పార్టీ ఎంత చేయాలో అంత కన్నా ఎక్కువే చేసింది.

ఇక హిస్టరీ పరంగా చూస్తే.. జగన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో జైలు జీవితాన్ని గడిపి వచ్చి. సిఎం కావాల్సిన అర్హత పొందారు. అక్రమాస్తుల కేసులో జాతీయ స్థాయిలో ఎంతో కీర్తప్రతిష్టలు పొందారు జగన్. సిబిఐకి కూడా చేతి నిండా పని కల్పించిన ఘనత జగన్ ది. ఇప్పటి దాకా జగన్ చేసింది ఏమైనా ఉందీ అంటే అది ఓదార్పు యాత్రలు చెయ్యడమే. మరి ఓ సిఎం కు ఉండాల్సిన విజన్, డెడికేషన్ జగన్ లో ఎంత మాత్రం కనిపించవు. మరి ఇన్ని అర్హతలున్న జగన్ కాకుండా మరో వ్యక్తి సిఎం ఎలా అవుతారు అన్నది ప్రశ్న. అయినా చంద్రబాబు నాయుడుకే చమటలు పట్టిస్తున్నారు కాబట్టి ఆ మాత్రం జగన్ సత్తా కనిపిస్తోంది. ఒకవేళ జగన్ టైం బాగుండి సిఎం అయితే సిఎంగా పదవి బాధ్యతలు చేపడతారు లేదంటే తాను సిఎ: కాలేదని ఏపి ప్రజలను ఓదారుస్తూ మరో ఎలక్షన్ వచ్చే వరకు ఓదార్పు యాత్రలు చేస్తారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jagan  AP  CM  Chandrababu Naidu  YSRCP  Elections  

Other Articles