Finally they know the power of Pawan Kalyan

Finally they know the power of pawan kalyan

Janasena, Pawan Kalyan, AP, Land, land Pooling, Chandrababu naidu

Finally they know the power of Pawan Kalyan. Th AP Ministers know the real power and following of janasena party Leader Janasena.

పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో వాళ్లకు తెలిసిందా..?

Posted: 08/22/2015 01:54 PM IST
Finally they know the power of pawan kalyan

నిన్నటి దాకా భూసేకరణ చేపట్టితీరుతాం అదీ.. ఇదీ అన్న ఏపి మంత్రలు ఒక్కసారిగా రూట్ మార్చారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో భూసేకరణ రైతులను ఒప్పించి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదని పవన్ కళ్యాణ ట్వీట్ చేయడం పెద్ద సంచలనమే. కాగా ప్రభుత్వం ల్యాండ్ ఆక్విజిషన్ యాక్ట్ తీసుకురాకుండా మరెలా భూమిని సేకరించాలో చెప్పాలని యనమల రామకృష్ణుడు అసహనం వ్యక్తం చేశారు. మరో మంత్రి కూడా పవన్ కళ్యాన్ సలహాలను పాటిస్తాం కానీ అంతా అయిపోయిన తర్వాత మూడు వేల ఎకరాల వద్ద రైతులు పేచీపెట్టడం ఏంటి అని అన్నారు. అయితే గత ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసిన పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో చంద్రబాబు నాయుడుకు తెలుసు. అందుకేగా ప్రధాని నరేంద్రమోదీ కూడా దేశవ్యాప్తంగా ఎంత హవా సాగుతున్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రావాలని స్వయంగా పవన్ కు ఫోన్ చేసి పిలిపించుకున్నారు.

భూసేకరణ మీద ముందు నుండి పవన్ కళ్యాణ్ రైతుల తరఫున మాట్లాడుతున్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా తాను ఊరుకోనని.. రైతుల తరఫున తాను ప్రశ్నిస్తానని ముందు నుండి అంటున్నారు. అందులో బాగంగానే గతంలో రాజధాని గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ మీద తన అభిప్రాయాలను రైతులతో, రైతుల అభిప్రాయాలను తాను పంచుకున్నారు. అయితే తాజాగా మరోసారి ప్రభుత్వం భూములు ఇవ్వని రైతుల నుండి ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ కింద భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. అందుకే పవన్ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎన్నికల్లో టిడిపి పార్టీని గెలిపించడంలో పవన్ తనవంతు కృషి చేశారు. తన చరిష్మాతో తెలుగు రాష్ట్రాల్లో టిడిపి ఓటు బ్యాంక్ ను బాగా పెంచారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలున్నా... ప్రజల తరఫున తాను గొంతు విప్పుతానని.. జనాల గొంతునవుతానని పవన్ తన పార్టీని స్థాపించే సమయంలోనే వెల్లడించారు. రాజధాని గ్రామాల్లో ఉన్న రైతులు ముందు నుండి పవన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాము నమ్మిన ప్రభుత్వమే... తమ ఓట్ల ద్వారా అధికారం చేపట్టిన ప్రభుత్వమే తమకు అన్యాయం చేస్తోందని అందుకే పవన్ కళ్యాణ్ తమకు దిక్కు అని తమ గోడు వినేందుకు రావాలని గతంలో పవన్ ను కోరారు. దానికి స్పందించిన పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. అయితే అనూహ్య స్పందనను చూసిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అవాక్కయ్యాయి. అయితే తాజాగా మరోసారి పవన్ గనుక రంగంలోకి దిగితే మాత్రం తమ పరిస్థితి మరింత చెడుతుందని. ఉన్న కాసింత మంచి పేరు కూడా గంగలో కలుస్తుందని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారట. అందుకే వీలైతే రైతులతో పాటు పవన్ కళ్యాణ్ ను కూడా భూసేకరణలో ఒప్పించి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  AP  Land  land Pooling  Chandrababu naidu  

Other Articles