Bihar polls: Disgruntled BJP MP Shatrughan Sinha’s wife may contest on JD(U) ticket

Bihar elections will shatrughan sinha s wife contest polls from jdu

Disgruntled BJP MP Shatrughan Sinha’s wife may contest on JD(U) ticket, Shatrughan Sinha, BJP MP, Poonam sinha, JD(U), Nitish Kumar, Narendra modi, bihar polls, Bihar Assembly polls 2015, Janata Dal (United),

Bharatiya Janata party MP Shatrughan Sinha's wife Poonam sinha may contest upcoming Bihar Assembly polls on a a Janata Dal (United) ticket, according to a media report.

బీజేపికి షాట్ గన్ షాక్.. జేడియూలో చేరున్న పూనం సిన్హా

Posted: 08/02/2015 11:57 PM IST
Bihar elections will shatrughan sinha s wife contest polls from jdu

బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపి పార్లమెంటు సభ్యుడు, సినీనటుడు శతృజ్ఞసిన్హా సొంతపార్టీకి పెద్ద షాక్ ఇవ్వనున్నారు. బీహార్ లో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ సమరశంఖం పూరించిన మరుసటి రోజునే బిహార్ కు వెళ్లిన ఆయన.. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పొగడ్తలతో ముంచెత్తారు. బీహార్ రాష్ట్రానికి నితీష్ ను మించిన సంరక్షుడు లేడని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన పార్టీని వీడనున్నారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు కూడా.

అయితే బిజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు ఆయన పక్కా వ్యూహాన్ని రచించుకున్నారు. బీహార్ అసెంబ్లీకి రానున్న ఎన్నికల్లో ఆయన తన భార్య పూనం సిన్హాను జెడియూ తరపున పోటీకి దించనున్నారు. ఈ కారణంగానే ఇటీవల సిన్హా బీహార్ సిఎం నితీశ్‌ను వరుసగా కలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నితీశ్ నుంచి ప్రస్తుతానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకున్నా అప్పుడే మీడియాకు ఈ విషయం లీకైంది. అంతా అనుకూలిస్తే ఆమె బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధిపై పోటీ చేసే అవకాశం ఉంది.

సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్ధులను గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తున్నశతృజ్ఞసిన్హాకు బిజెపి చెక్ పెడుతుందా? అధిష్టానంపై అసమ్మతి స్వరం వినిపించడమే కాక బెస్ట్ సిఎం అంటూ నితీశ్‌పై ప్రశంసలు కురిపించినా బిజెపి మౌనంగా ఉంది. ఇప్పుడు నేరుగా ఆయన తన భార్యను బిజెపిపై పోటీకి దించుతున్నారని తెలిశాకనైనా కమలనాథులు సిన్హాకు పాఠం నేర్పిస్తారా లేక మౌనమే నీ భాష ఓ మూగ మనసా అంటూ కాలం వెల్లదీస్తారా వేచి చూడాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shatrughan Sinha  BJP MP  Poonam sinha  JD(U)  Nitish Kumar  Narendra modi  bihar polls  

Other Articles