It's Official: No Special Status To AP

No special status to andhra pradesh and bihar centre in lok sabha

Andhra Pradesh, special status, AP special status, special status to AP, TDP, BJP, No Special Status To AP, Centre Denied Special Status to AP, union minister Indrajit Singh Rao, Lok Sabha, Question Hour, no Special Status to any Indian state, Special Status, AP, Bihar, Telangana, BJP, NDA

It's official. In a coldblooded betrayal, the BJP led NDA government has categorically denied according special status to any state including Andhra Pradesh.

అబద్దపు హామీలతో అధికారఫీఠం? గోదాట్లో ప్రత్యేకహోదా?

Posted: 08/01/2015 05:26 PM IST
No special status to andhra pradesh and bihar centre in lok sabha

అధికారంలో వున్నవారు అంతులేని అవినీతికి పాల్పడ్డారు. వారు చేసిన అశాస్త్రీయ రాష్ట్ర విభజనతో రాష్ట్రం అంధకారంలోకి జారుకుంది. ఈ దౌర్భాగ్య పరిస్థితిని నుంచి రాష్టాన్ని కాపాడేందుకు మాకే ఓటు వేయాలి అని అభ్యర్థిస్తూనే.. మరోవైపు రైతులకు రుణమాఫీలు చేస్తామన్న ప్రకటన గుప్పించిన నేత.. ఎన్నికల ముందు ఊరూరా తిరుగుతూ ప్రజలకు ఎన్నికల హామీలను ఇచ్చిన ఎవరో తెలుసా..? రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలంటే తమ్ముళ్లు.. మీరు ఈ సారి ఎన్నికలలో మా పార్టీకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అంతేకాదు ఈ సారి కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం తప్పకవస్తుందని, మోడీతో తాము మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నాము కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక తీసుకువస్తామని కూడా చెప్పారు.

అక్కడితో ఆగకుండా ఏకంగా అప్పటి ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఎన్నికల ప్రచారంలో భాగంగా పిలిచి.. ఆయనతో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటన చేయించారు. ఆంధ్రప్రదేశ్ లో మోడీ పాల్గోన్న ప్రతీ సభలోనూ, బిజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు పాల్గొన్న ప్రతీ సమావేశంలోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటే కేంద్రంలో బిజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందేనని ప్రజల ముందు హామీలు గుప్పించారు. అయితే కేంద్రంలో బిజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా గడుస్తున్నా.. ప్రత్యేక హోదా హామీ మాత్రం ఇప్పటికీ నేరవేరలేదు.

ఇక మీదట నెరవేరుతుందన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే సార్లమెంటు సాక్షిగా బిహార్ ప్రత్యేక హోదాపై లోక్ సభలో కేంద్ర మంత్రి ఇంద్రజీత్ సింగ్ ప్రశ్నోత్తరాల సమయంలో చేసిన ప్రకటన ఇందుకు కారణం. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, కేవంల ప్యాకేజీని మాత్రమే ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి అయినా ప్రత్యేక హోదా ివ్వడం అసాధ్యమని ఆయన వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు ఎలాంటి హోదా లేదని ఆయన చెప్పారు. తాము ప్రత్యేక ప్యాకేజీని మాత్రమే ఇవ్వగలమని అన్నారు.

కేంద్రంలో కొలువుదీరిన నరేంద్రమోడీ సర్కార్.. మంచి రోజులు వస్తాయని.. అవినీతి రహిత పాలన కోసమని, భారతీయుడి గౌరవం కోసమంటూ.. ఇలా ఎన్నో అంశాలపై ఎన్నికల సందర్భంగా మాట్లాడారు. మార్పు కోసం తమకు ఓటు వేయాలని కోరారు. అయితే ఆయనను విశ్వసించిన ప్రజలు విశ్వాసఘాతుకానికి గురయ్యారన్న విమర్శలు వినబడుతున్నాయి. తాము ఎంతో మార్పును ఊహించి, ఎంతో ఆశగా మంచిరోజుల కోసం వేచి చూస్తుంటే.. మోడీ కూడా అబద్దపు హామీలతో గద్దెనెక్కారని, అందుకు చంద్రబాబు కూడా దోహదపడ్డారని, కాంగ్రెస్ తమను ఎదుట నుంచి పోడిచి రాష్ట్ర విభజన చేయగా, బిజేపి, టీడీపీ పార్టీలు రెండూ కలసి తమను వెన్నుపోటు పడిచాయని రాష్ట్రప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh:  special status  TDP  BJP  NDA  

Other Articles