Ap government foll focus on pattiseema lift irrigation project

Complete plis works in a week cm tells officials

Patti seema project, pattiseema without permission, polavaram project, chandrababu naidu, union minister, sanwar lal jat, Indian Water Resources Minister Sanwar Lal Jat, palmuru project, nalgonda project, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, polavaram, national news, telugu news

Chief minister N Chandrababu Naidu has directed the officials concerned to complete the works under seven packages for diversion of Godavari river water to Polavaram Right Main Canal (PRMC) within a week’s time.

అక్రమ ప్రాజెక్టు నామస్మరణలో అమాత్యులు

Posted: 07/31/2015 06:52 PM IST
Complete plis works in a week cm tells officials

యధా రాజా తథా ప్రజల అన్న నానుడి ఉరికే రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధినేత చంద్రబాబు తరహాలోనే ఆమాత్యులు కూడా ఇప్పుడు అక్రమ ప్రాజెక్టు నామస్మరణలో మునిగి తేలుతున్నారు. అంతేకాదు. ప్రతిపక్షా నాయకుడిని కూడా ప్రాజెక్టును చూడాలని ఒ పక్క కోరుతూనే.. అసలు ప్రాజెక్టు చూసే ధైర్యం వుందా అంటూ సవాల్ విసరుతున్నారు. విపక్ష నేత జగన్‌ కు దమ్ము, ధైర్యం ఉంటే పట్టిసీమ ప్రాజెక్టును స్వయంగా చూడాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్‌ విసిరారు.

తమ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులను పూర్తిచేసి సాగు ఆయకట్టు పెంచాలని చూస్తుంటే ఆయనపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. గోదావరికి 1.08 లక్షల క్యూసెక్యుల వరద నీరు వచ్చిందని 10 టీఎంసీల నీరు ఒక ్కరోజే ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలిసిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.  ఓవైపు కృష్ణా డెల్టాలో నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి 2500 టీఎంసీల నీటిని తెప్పించటమే ధ్యేయమన్నారు. ఆల్మట్టికి 45 వేల క్యూసెక్కుల కృష్ణా నీళ్లు వచ్చాయని, ఆ నీళ్లు ఇక్కడకు వచ్చేలోపు పట్టిసీమ ద్వారా నీళ్లు కృష్ణాకు మళ్లించి, ఆ తర్వాత రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పంపిస్తామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారాయణ కూడా అధినేతను పోగడ్తలతో, విపక్ష నేతపై విమర్శలు కురిపించారు.

ఇంతవరకు బాగానే వున్నా.. ఈ ప్రాజెక్టును ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా.. దీనిపై మాత్రం ఇంకా స్పష్టత లేకుండా పోయింది. ఒకపైపు గత వారం పార్లమెంటు సాక్షిగా ఈ ప్రాజెక్టుకు అక్రమమని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్ జాట్ పార్లమెంటులో వెల్లడించారు.  పట్టిసీమ పోలవరంలో భాగం కాదని.. అసలు పట్టిసీమ ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ తమకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే, కేంద్రం నుంచి ఆమోదం పొందకుండానే ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సన్వర్‌లాల్ జాట్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రే ఈ ప్రాజెక్ట అక్రమమని స్పష్టం చేసినా.. నీతి, నిజాయితీకి కట్టుబడి, క్రమశిక్షణతో వ్యవహరించే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుపై ఇంకా బొంకుతుంది. స్వయంగా అమాత్యులే. అక్రమ ప్రాజెక్టు నామస్మరణలో మునిగిపోతున్నారు. అంతేకాదు.. ప్రాజెక్టు విషయమై నిజాలు మాట్లాడిన ప్రతీ ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది అటంకుడిగా చిత్రీకరించడమే కాకుండా వారిపై అనేక విమర్శలతో తెగబడుతున్నారు. ఇక విపక్ష నేత జగన్ పై కూడా అలాంటి విమర్శలే గుప్పించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుపై కేంద్రం చర్యలు తీసుకోవాలి. టీడీపీ ప్రభుత్వమా..? ఇదేనా నిజాయితి, ఇదేనా  నీతి.. ఏదీ క్రమశిక్షణ..? ప్రజలకు కనబడదనుకుంటున్నారా.. కపట నాటకం..! ఇంత జరిగినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టిసీమ ప్రాజెక్టు ఇంకా పాలొవరం ప్రాజెక్టులో భాగమేనని బుకాయిస్తుంది. సదరు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని అదేశాలను స్వయంగా ముఖ్యమంత్రే జారీ చయడం విడ్డూరం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patti seema project  polavaram  union minister sanwar lal jat  devineni uma  narayana  

Other Articles