May Congress leader danam Nagender likely to join the TRS party

May congress leader danam nagender likely to join the trs party

Danam Nagender, Talsani Srinivas, TRS, Congress, Hyderabad, Elections

May Congress leader danam Nagender likely to join the TRS party. Telangana Minister Talasani Srinivas met Danam Nagender in his house.

కారెక్కనున్న దానం..? తలసాని మంతనాలు..!

Posted: 07/31/2015 03:37 PM IST
May congress leader danam nagender likely to join the trs party

మరో కాంగ్రెస్ నాయకుడు కారెక్కనున్నారా..? కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చి మరోనేత టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారా..? పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరో నేత దానం నాగేందర్ టిఆర్ఎస్ పార్టీలో చేరతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ దానం నాగేందర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ ను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడానికే దానం నాగేందర్ ఇంటికి వెళ్లారని పుకారు షికారు చేస్తోంది. అయితే బోనాల పండుగ వేడుకలకు ఆహ్వానించడానికి మాత్రమే దానం ఇంటికి వెళ్లినట్లు మంత్రి తలసాని తెలిపారు. దానం నాగేందర్ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి ఆయన కాంగ్రెస్‌పార్టీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పూర్తిస్థాయి కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. దానం టిఆర్‌ఎస్‌లోకి వెళ్లబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయినా వాటిని దానం నాగేందర్‌ గట్టిగా ఖండించిన సందర్భాలు లేవు.

అదేవిధంగా హైదరాబాద్‌లో నేతల మధ్య సఖ్యత లేదు. ఎవరిదారి వారిదే అన్నట్లుగా సాగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించి భంగపడ్డారు. ఆదిలాబాద్‌ పర్యటన సమయంలో రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు రాకపోవడంతో దానం నాగేందర్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాహుల్‌గాంధీ దానం తీరు పట్ల సంతృప్తిగా లేరని తెలిసింది. పిసిసి అధ్యక్షులు ఉత్తమకుమార్‌రెడ్డి తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని దానం నాగేందర్‌ సన్నిహితులతో వాపోయారు. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఈ కారణాలతో టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికే దానం మొగ్గుచూపుతున్నారు. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆహ్వానిస్తే వెళ్లడానికి దానం సుముఖంగా ఉన్నారని తెలిసింది.

ఇప్పటికే ఆయన సన్నిహితులు కొందరు టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. దానం వస్తానంటే పార్టీలోకి ఆహ్వానిస్తామని టిఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆహ్వానించే పరిస్థితులు లేవని చెబుతున్నారు. తనంతట తాను వస్తే చేర్చుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అంటున్నారు. త్వరలో గ్రేటర్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో దానం నాగేందర్‌ను చేర్చుకుంటే పార్టీకి అదనపు బలం తోడవుతుందని టిఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. దానం నాగేందర్‌ చేరడం వలన సిటీలో కాంగ్రెస్‌పార్టీ బలహీనం అవుతుందని ఆ పార్టీ నేతలు గట్టిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తలసాని దానంను కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దానంను చేర్చుకుని మర్రి శశిధర్‌రెడ్డికి చెక్‌ పెట్టాలన్నది తలసాని ఆలోచనగా ఉంది. కాంగ్రెస్‌పార్టీలో దానం నాగేందర్‌కు, మర్రి శశిధర్‌రెడ్డికి మధ్య సమన్వయం లేదు. దానం తర్వాత ముఖేష్‌గౌడ్‌ను చేర్చుకోవాలనేది టిఆర్‌ఎస్‌ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. బోనాల పండుగ సమయంలోనే గత సంవత్సరం కెసిఆర్‌ తలసాని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత రెండు రోజులకు తలసాని టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కూడా బోనాల పండుగ సమయంలోనే తలసాని దానం ఇంటికి వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danam Nagender  Talsani Srinivas  TRS  Congress  Hyderabad  Elections  

Other Articles