‘Is a journalist bigger than me’ statement was not about Akshay Singh, clarifies Kailash Vijayvargiya

Just i was joking says madhya pradesh bjp minister vijayvargiya

Doctor connected to Vyapam probe found dead in Delhi hotel, Dr Arun Sharma,Vyapam scam,MPPEB scam,MPPEB,Dean Arun Sharma,Jabalpur medical college,NS medical college, Delhi journalist death, Aaj Tak journalist, Vyapam scam, Rahul Gandhi, Arvind Kejriwal, cremation, Kailash Vijayvargiya, Journalist, Akshay Singh, joke, media

Madhya Pradesh Minister Kailash Vijayvargiya today clarified that his statement ‘Is a journalist bigger than me’ was a joke and not about Akshay Singh.

ప్రజలంటే అమాత్యులకు జోక్ గా మారిందా..?

Posted: 07/07/2015 06:39 PM IST
Just i was joking says madhya pradesh bjp minister vijayvargiya

ప్రపంచంలోకెళ్లా అతి పెద్ద ప్రజాస్వామ్యమని గర్వంగా చెప్పుకుంటున్నా.. మన రాజకీయ వ్యవస్థ మాత్రం విలువల పాటించడంలో క్రమేపి మసకబారుతుందని చెప్పక తప్పదు. ఎన్నికప్పుడే ప్రజలకు దండాలు పెడతారు..? అ తరువాత ఐదేళ్ల వరకు ప్రజలు వారికి దండాలు పెట్టాల్సిందే అంటూ ఎందరెందరో వ్యంగంగా చెప్పినా.. మన రాజకీయ నేతలకు మాత్రం అసలు చీమ కుట్టినట్లయినా వుండదు. ఎన్నికలప్పుడు వాగ్ధానాలు తప్ప.. ఆ తరువాత ప్రజలను చూస్తేనే ఈసడించుకుంటారు. ఇక అమాత్యులైతే.. తాము ప్రజా సేవకులం అన్న విషయాన్ని మరచి.. ప్రజలు మేము సమానమా..? అంటూ బీరాలు పోతారు.

ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గియా. వ్యాఖ్యలు. మధ్యప్రదేశ్ లో ఓ ఓ కుంభకోణ పర్వం వెలుగులోకి రావడం.. ఆ తరువాత జరుగుతున్న పరిణామాలు యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. బాధ్యాతాయుతమైన పదవిలో వున్న మంత్రి.. కైలాష్ విజయ్ వర్గీయా మాత్రం ఆయన నాకన్న గోప్పవాడా..? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి మంత్రి పదవి అంటే ప్రజా సేవకుడి బాధ్యత రెట్టింపు అయినట్లే. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వున్న మంత్రి తాను గోప్పా..? సాధారణ పాత్రికేయుడు గోప్పా అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ప్రతిపక్షాలు మంత్రి వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేయడంతో.. ఆయన నాలుక కరుచుకుని మీడియాపై నెపాన్ని నెట్టినా.. వాస్తవానికి ఈ తరహా భావన ఒకరిద్దరు మినహా అందరి మంత్రులలో వుంది. నిజంగా మంత్రులు గోప్పా..? లేక ప్రజలు గోప్పా..? అంటే ఎవరైనా ప్రజలే అంటారు. అంతెందుకు మరో సారి అధికారంలోకి రావాలంటే.. ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడతాయి ప్రభుత్వాలు. అయితే ఐదేళ్లకు వచ్చే ఎన్నికలతో ఈ నాయకుల పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఐదేళ్లకు ఓ పర్యాయం ప్రజల్లోకి వెళ్తే చాలనన్న భావన రావడం ఎంత మాత్రం సమంజసరం కాదు.  

ఈ విషయాన్ని పక్కన బెడితే ప్రజలు అసహజంగా మరణిస్తుంటే.. అనుమానాలు, నిరసనలు పెళ్లుబిక్కుతుంటే.. తాను జోక్ చేశానని మంత్రి వ్యాఖ్యానించడం మన దౌర్భాగ్యమే కదా..? అసహజమరణాలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ కేసుతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధమున్న సుమారు 49 మంది మరణిస్తుంటే.. మంత్రి గారు తొలుత.. ‘‘నా కన్నా పాత్రికేయుడు గోప్పా’’ అని వ్యాఖ్యానించారు. అతని వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన ‘‘నేను మీడియా వారితో జోక్ చేశాను’’ అని చెప్పడం ఆయన బాధ్యతరాహిత్యాన్ని తెలయజేస్తుంది. ఇలాంటి వివాదాస్సద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై కూడా అపఖ్యాతి పాలు చేస్తుంది. ఇప్పటికైనా మంత్రులు ఎలాంటి విషయాలపై ఎలా వ్యవహరించాలో..? ఎలాంటి అంశాలపై ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vypam scam  Kailash Vijayvargiya  Journalist  Akshay Singh  joke  media  

Other Articles