President pranab questions telangana tdp leaders on ap situation

President pranab gives shock to telangana tdp leaders

president pranab gives shock to telangana tdp leaders, President pranab questions telangana tdp leaders on andhra pradesh situation, Ysrcp MPs, Talasani Srinivas yadav, TDP Mla in cabinet, telangana cabinet, andhra pradesh news, hyderabad news, Telangana news, india news, nation news, chandrababu, spy Reddy, kothapalli geeta,

president pranab gives shock to telangana tdp leaders by questioning on how Ysrcp MPs join into ruling party

టీ.టీడీపీ నేతలకు రాష్ట్రపతి షాక్.. మీరూ అదే బాటాలో..

Posted: 07/06/2015 07:02 PM IST
President pranab gives shock to telangana tdp leaders

ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబి అడ్డంగా దొరికిన తరువాత.. తెలంగాణ టీడీపీ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమ గూటికి చెందిన పక్షిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అన్ని రకాల చర్యలకు పూనుకుంటున్నారు. తమ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఫోన్ సంబాషణ టేపులు వెలువడగానే.. టీడీపీ అధిష్టానం అన్ని విధాలా పకడ్భంధీగా పావులు కదుపుతోంది. ఒకపైపు ఏపీ చెందిన మంత్రులు, పార్టీ నేతలు టీఆర్ఎస్ పై మూకుమ్మడిగా దాడి చేస్తుండగానే, మరి కోందరు తెరపైకి సెక్షన్ 8ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై వివరించారు. తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తన కేబినెట్ లో మంత్రి పదవిని కేటాయించారని చెప్పారు. ఇది విన్న రాష్ట్రపతి విస్మయం వ్యక్తం చేశారట. పార్టీ ఫిరాయింపులపై వారు ఓ పెద్ద వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారట. టీఆర్ఎస్ ఎన్నికలలో గెలిచింది 63 సీట్లు కాని ఇప్పుడు వారి బలం 83కు చేరిందని, ఇది కేవలం ఆపరేషన్ ఆకర్ష్ వల్లే సాధ్యమైయ్యిందని వారు రాష్ట్రపతికి తమ అవేదనను వెళ్లబోసుకున్నారట. కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చే్స్తున్నారని, తమ వారిని అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నారని చెప్పురట.

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పేందంగా సావధానంగా విన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఆ తరువాత వారిని సుతిమొత్తగా మందలించారట. టీడీపీ కూడా వైసీపీ చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యలను పార్టలోకి చేర్చకుంది కదా అని అడిగారట పార్టీ ఫిరాయింపులు మన దేశంలో అనేకం జరుగుతున్నాయని వీటిపై కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారట. అంతే ఈ మాట అనగానే టీడీపీ నేతలు.. రాష్ట్రపతి గారు ఎంపీ వద్దే ఆగారు.. ఇంకా మనం ఇక్కడే వుంటే ఎమ్మెల్సీల ఫరాయింపులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షుడు, పురపాలక సంఘాల చైర్మన్లను కూడా లెక్కపెడతారేమోనన్న భయంతో టీడీపీ నేతలు మళ్లీ కలుస్తాం అంటూ బయటకు వచ్చేశారట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : president  pranab mukharjee  Telangana Tdp leaders  

Other Articles