chandra babu words said by jupudi prabhakar rao

Jupudi prabhakar supports tdp for cash for vote

jupudi prabhakar rao, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

andhra pradesh chief minister chandra babu internal feelings came out as words from jupudi prabhakar rao at vijawada

పలికింది జూపూడి, పలికించింది మాత్రం.. బాబే(నా)..?

Posted: 06/30/2015 07:52 PM IST
Jupudi prabhakar supports tdp for cash for vote

ఓటుకు నోటు వ్యవహారం టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీని, పార్టీ అధినేతను కాపాడే ప్రయత్నం చేస్తూన్నే.. తమ అధినేత తప్పు చేశారా..? అంటే అవుననే అంగీకారం ఇచ్చినట్లు చేయడమే ఇందుకు కారణమైంది. ఓటుకు నోటు కేసులో తమ అదినేత చంద్రబాబు.. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్లో మాట్లారని ప్రత్యక్షంగా అంగీకరించకుండానే.. పరోక్షంగా మాత్రం అయన చేసిన వ్యాఖ్యలు అలానే వున్నాయి.

ఎన్నికలలో డబ్బును ఖర్చు పెట్టడం పెద్ద తప్పుకాదంటూనే.. రాజకీయాల్లో పతివ్రతలు ఎవరు ఉన్నారని అడిగారు. డబ్బు ఇవ్వకుండా ఎవరైనా ఎన్నికలలో గెలిచారా..? అంటూ నిలదీసి.. వితండవాదానికి తెరలేపారు. ఇంతవరకు బాగానే వున్నా.. జరుగుతున్నవి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు. అందునా.. అవి శాసనసభ్యుల కోటాలో జరుగుతున్న ఎన్నికలు. ఈ విషయాన్ని మరిచిన జూపూడి.. డబ్బు ఖర్చుపెట్టడం పెద్ద తప్పేం కాదు అన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే సాధారణ ఎన్నికలలో ఓటర్లను డబ్బుతో ప్రలో పెట్టడాన్ని సమర్థించకనే సమర్థించారు ఈ నేత.

 అదీకాక. ఇప్పడు రాజకీయాలలో అంత ప్రతివ్రతలు ఎవరున్నారని వ్యాఖ్యానించడం కూడా మరో చర్చకు దారి తీసింది. టీడీపీ అధినేత చంద్రబాబే.. ఓటుకు నోటు కేసులో తనను తాను ఢిఫెన్స్ చేసుకునేందుకు ఇలా జూపూడితో మాట్లాడించారా..? అన్న  ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అదీకాక. నిత్యం నితి, నిజాయితీ అంటూ ప్రసంగాలు ఇచ్చే తమ  అధినేత చంద్రబాబు కూడా పతివ్రత కాదని జూపూడి ఉద్దేశ్యమా..? అంటూ మరికోందరు ప్రశ్నిస్తున్నారు. అంటే.. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఎదుర్కోంటున్న అభియోగాలు నిజమని జూపూడి నమ్ముతున్నారా..? అని కూడా మరికోందరు నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఆయనే సమాధానం చెప్పాలి మరి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jupudi prabhakar rao  KCR  chandrababu  cash for vote  

Other Articles