vasundhara raje returns to jaipur without meeting bjp top brass

Bjp party top brass ready to take action against raje

bjp party top brass ready to take action against raje, Raje Leaves Delhi Without Meeting BJP Top Brass, rajasthan, cm, vasundhara, raje, leaves, delhi, without, meeting, bjp, top, brass, india, lalit modi, narendra modi, niti aayog, BJP chief Amit Shah, modigate, vasundhara raje, bjp high comand, Narendra modi

Embattled Rajasthan Chief Minister Vasundhara Raje attended a NITI Aayog deliberation here but left the capital without meeting either Prime Minister Narendra Modi or BJP chief Amit Shah.

రాజేపై వేటుకు రెడీ అవుతున్న బీజేపీ..

Posted: 06/28/2015 04:27 PM IST
Bjp party top brass ready to take action against raje

ఐపీఎల్ ఆర్థిక నేరాలకు, నిధుల మళ్లింపు కేసులో అభియోగాలు ఎదుర్కోంటు లండన్ లో తలదాచుకున్న లలిత్ మోడీ వ్యవహరాంలో పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించిందా..? అంటే అవుననే సందేహాలే తలెత్తతున్నాయి. భారత ప్రభుత్వం లలిత్ మోడీ పాస్ పోర్టును రద్దు చేసిన తరువాత..  ప్రతిపక్ష నాయకురాలి హోదాలో అమె లలిత్ మోడీకి తన మద్దత్తు వుంటుందని పేర్కోంటూ.. ఈ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి తెలియపర్చకూడదని రాసిచ్చిన సిఫార్సు లేఖలు కాంగ్రెస్ బట్టభయలు చేయడంతో.. అమె నుంచి బీజేపి కూడా దూరం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇదే వ్యవహారంలో. కేంద్ర మంత్రి సుష్మ సర్వాజ్ కు అండగా నిలిచిన అగ్రనేతలు.. వసుందర రాజేపై మాత్రం వేటు వేసేందుకు రెడీ అవుతన్నారని తెలుస్తుంది.

కు పార్టీలో పరాభవం ఎదురైంది. అమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిరాకరించారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె పార్టీ అధిష్టానాన్ని, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే అమెను అధిష్టానంతో పాటు ప్రధానమంత్రి మోడీ కూడా దూరంగానే పెట్టారు. అమెకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో వసుంధర నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే తిరిగి రాజస్థాన్‌కు బయలుదేరి వెళ్లారు.

దీంతో అమెపై బిజేపి అధిష్టానం చర్యలకు ఉపక్రమిస్తుందని, ఈ నేపథ్యంలో అమెకు అపాయింట్ మెంట్ ఇచ్చి.. భేటీ కావడం ఇష్టం లేకపోవడంతో.. నిరాకరించారిని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆ చర్యలు ప్రభుత్వ చర్యలా..? లేక పార్టీ చర్యలా..? ముఖ్యమంత్రి పదవి లో కొనసాగిస్తారా..? లేక వేటు వేస్తారా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. ఒక వేళ ముఖ్యమంత్రి పదవి నుంచి రాజేను తప్పించిన పక్షంలో అమెపై చట్ట పర్యంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని, అమె లలిత్ మోడీకి సిఫార్సు లేఖను ఎలా ఇచ్చారన్న దానిపై విచారణ జరపాలని కూడా విఫక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modigate  vasundhara raje  bjp Top Brass  high comand  Narendra modis  

Other Articles