telenagana cm Kcr indications on joining NDA government

Telangana government to be part in nda government

Telangana government to be part in NDA government, Telangana chief minister Kcr, Telangana government, Prime Minister Modi, PM Narendra Modi, Central Government, indications, union minister portfolios for kavitha, TRS MPs

Telangana chief minister Kcr gives indications on joining NDA government at centre

కమలంతో దోస్తీకి కేసీఆర్ సంకేతాలు..? ఎందుకు.?

Posted: 05/29/2015 04:11 PM IST
Telangana government to be part in nda government

కేంద్రంలో కోలువుతీరిన ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వంలో కారు చేరనుందా...? ఎన్.డి.ఎ.లో టిఆర్ఎస్ భాగస్వామి అవుతుందా అన్న ప్రశ్నలకు అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలకు, విధానాలకు ఎక్కడా వ్యతిరేకత రాకుండానే.. అడపా దడపా విమర్శలు మాత్రం గుప్పిస్తూ.. ముందుకు సాగుతుంది టీఆర్ఎష్. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినాన ప్రారంభించిన స్వచ్ఛా భారత్ కార్యక్రమాన్ని.. స్వచ్ఛా హైదరాబాద్ పేరుతో వారం రోజుల పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చేత మండుటెండలో ఉరుకులు పరుగులు పెట్టించి మరీ అమలుపర్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇంత హైరానా చేసింది ఎందుకని ఆరా తీస్తే.. కేంద్రంతో దోస్తీకే నని టీఆర్ఎస్ పార్టీ సంకేతాలను జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఈ విషయమై ప్రశ్నిస్తే ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా కప్పదాటు సమాధానాలు ఇస్తున్నారు. ఎన్డీఏలో చేరడం తమ ఎజెండాలో లేదని సన్నాయి నోక్కులు నోక్కుతున్నారే తప్ప..తాము ఎన్డీఏతో చేరే అవకాశం లేదని చెప్పడం లేదు. అంతేకాదండోయ్ ప్రధాని మోడీ చేపట్టిన వివిధ కార్యక్రమాలను కెసిఆర్ బేష్షుగ్గా వున్నాయని కితాబిస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు.. మోడీ ప్రభుత్వం తీసుకోచ్చిన భూ సంస్కరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని సమర్థిస్తుంగా.. రాజ్యసభలో బిల్లును అడ్డుకునేందుకు తమతో జతకడతారా..? అని ప్రశ్నిస్తున్నా.. అసులు ఉలుకు పలుకు లేకుండా వుండిపోయింది టీఆర్ఎష్.

Kcr-with-Modi-1అయితే ఎన్నికలకు ముందు, తరువాత కూడా బీజేపిపై విమర్శలను కోనసాగించిన టీఆర్ఎస్.. ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడానికి కారణం ఏంటని లోతుగా విశ్లేషించుకోగా.. కేంద్రంతో జతకట్టేందుకే టీఆర్ఎస్ ఇలా చేస్తుందని సమాచారం. అందుకనేనేమో.. తాజాగా నిన్న కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు కేంద్రం నుంచి వనరులు పంపిణీ వాటాను పెంచడం హర్షదాయకమని అన్నారు. నిధుల పంపిణీ తీరుతెన్నులనే మోడీ ప్రభుత్వం మార్చిందని ఆయన ప్రశంసించారు. రాష్ట్రాలకు మోడీ మంచి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కోన్నారు. అంతేకాదండోయ్ కేంద్రం తెలంగాణ పట్ల వ్యతిరేకతతో లేదని కూడా కెసిఆర్ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా తమకు ఎదురయ్యాయని, రామగుండం ఎన్.టి.పి.సి ప్లాంట్ కు బొగ్గు కేటాయింపులు కల్పించలేదని అదే బాధగా ఉందని కేసీఆర్ అన్నారు.

అధికారం చేపట్టిన తొలినాళ్లలో మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేసీఆర్.. ఎందుకిలా కేంద్రంపై ప్రేమను కనబరుస్తున్నారా..? అన్న ప్రశ్నలకు నిధుల సమకూర్చడం ఒక విషయమైతే.. మరో లబ్ది కూడా వుందని తెలుస్తోంది. అయితే అది రాష్ట్రానికి కూడా మేలు చేసే లబ్దే అయినా.. నాలుగేళ్ల పాటు మాత్రం తన పార్టీకి చెందిన ఎంపీలను.. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. తన తనయకు కేందర్ మంత్రి పదవిని కట్టబెట్టాలనే.. వాంఛేనని సమాచారం. ఈ క్రమంలో టీఆర్ఎస్ కేంద్రంతో జతకడుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  nda  indications  

Other Articles