Balakrishna Danger To Chandrababu Cm Post | Political Gossips | TDP Party

Balakrishna danger to chandrababu cm post

balakrishna, chandrababu naidu, tdp party, political gossips, balakrishna mahanadu, chandrababu naidu mahanadu, ap capital city, hindupur mla balakrishna, ap cm chandrababu, nara lokesh, tdp party leaders, tdp ministers

Balakrishna Danger To Chandrababu Cm Post : According to the political sources the news going viral about cm post in tdp party. By analysing the balakrishna's recent speach.. he is looking to get cm post in the place of chandrababu naidu.

బాబు సీఎం పదవికి బాలకృష్ణ ‘గండం’

Posted: 05/28/2015 12:00 PM IST
Balakrishna danger to chandrababu cm post

రాజకీయ ‘రణ’రంగంలో పరిస్థితులు ఎప్పుడెలా వుంటాయో ఎవ్వరూ పసిగట్టలేరు. అప్పటివరకు ఒకేపార్టీలో వుంటూ ప్రాణస్నేహితులుగా మెలిగే రాజకీయ నాయకులు శత్రువులుగా మారొచ్చు. ఉన్నత పదవులు ఆశించి, ఒకరిపై మరొకరు నిందలు వేసుకోనూవచ్చు. తమ వాక్చాతుర్యంతో చీల్చిచెండాడిన ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలుపుకోనూవచ్చు. మరికొందరు అతి తెలివి ప్రదర్శించి.. తమ పార్టీ నేతలను తమవైపుకు తిప్పుకుని ఉన్నత పదవులు పొందేందుకు ప్రయత్నాలు చేయనూవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. నందమూరి బాలకృష్ణ చెప్పినట్లుగా ‘రాజకీయం’ అంటే దడిబిదిబిడే!

ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే.. టీడీపీ పార్టీలో ప్రస్తుత పరిణామాలు కాస్తా గందరగోళంగా వున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం! ముఖ్యంగా బాలకృష్ణ, సీఎం చంద్రబాబు మధ్య వ్యవహారం అంతా సరిగ్గా లేదని, ముందులాగా వారిమధ్య సఖ్యత బంధం లేదన్నట్లుగా చెప్పుకుంటున్నారు. మొన్నటివరకు సినిమాలు చేసుకుంటూ బిజీగా కాలం గడిపిన బాలకృష్ణ.. ఈసారి ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం.. అలాగే రాజకీయపరంగా తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాజకీయంలో బాలయ్య చాకచక్యంగా నడుచుకుంటున్నారు. ఓవైపు సినిమాలు చేసుకుంటూనే.. మరోవైపు రాజకీయపరంగా బాలయ్య వేస్తున్న పాదాలు చూస్తుంటే.. బాబు సీఎం పదవికి గండంగా మారినట్లేనని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. పైగా.. ఇటీవలే బాలయ్య చేసిన వ్యాఖ్యలు గమనిస్తే.. ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమంలో ప్రసంగించిన బాలయ్య.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడిన ఆయన.. చంద్రబాబును సైతం ఆకాశానికెత్తేశారు. ఎన్టీఆర్ మార్గంలోనే బాబు నడుస్తూ.. ఎన్నో సంస్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయని కొనియాడారు. ఇలా ఈ విధంగా బాబు గురించి మాట్లాడిన ఆయన.. చివరగా పేర్కొన్న వ్యాఖ్య అందిరినీ ఆందోళనల్లో పడివేసింది. హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలయ్య.. తాను కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని.. రాష్ట్రం మొత్తానికి సేవలందిస్తానని తెలిపారు. ఈ విధంగా ఈయన మాట్లాడిన విధానం చూస్తుంటే.. బాబు సీఎం పదవికి బాలయ్య గండంగా మారనున్నారని చెప్పుకుంటున్నారు. ఇంతేకాదు.. ఎన్నికల సమయంలో కూడా బాలయ్య ఈ విధంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను సీఎం పదివిని చేపట్టడానికైనా సిద్ధమని ఆనాడు పేర్కోవడం సంచలనంగా మారింది.

మరోవైపు.. చంద్రబాబు తర్వాత ఆయన స్థానంలో నారాలోకేష్  వస్తారని టీడీపీ వర్గాలు ఎప్పటినుంచి భావిస్తున్నాయి. ఇప్పటినుంచే లోకేష్ పార్టీ కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహిస్తుండటాన్ని చూస్తుంటే.. ఆ పార్టీ తరఫున బాబు తర్వాత సీఎం అభ్యర్థిగా అతడేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. బాలయ్య కూడా రాజకీయంలో తన వేగాన్ని పెంచడాన్ని చూస్తుంటే.. భవిష్యత్తులో వీరిమధ్య పొరపొచ్చాలు వస్తాయేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  chandrababu naidu  nara lokesh  political gossips  

Other Articles