Animals | Revanth Reddy | TTDP | KCR | Telangana |Media

Animals are anger on ttdp leader revanth reddy

Animals, Revanth Reddy, TTDP, KCR, Telangana, Media

Animals are anger on TTDP leader Revanth Reddy. Revanth Reddy commented on telangana cm KCR. He used the words like dogs, tiger, fox for cm kcr.

రేవంత్ రెడ్డి మాటలకు ఫీల్ అయిన జంతువులు

Posted: 04/28/2015 04:19 PM IST
Animals are anger on ttdp leader revanth reddy

రేవంత్ రెడ్డి.. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పేద్ద నోరున్న నాయకుడు. మీడియా ముందు మాట్లాడే అవకాశం వస్తే మీడియా వారి చెవులు వాచిపోయే వరకు మాట్లాడగల మహా మేధావి. అయితే మేధావి అయితే అయ్యాడు కానీ మా జాతి జోలికి ఎందుకు వస్తున్నాడు బాబోయ్ అంటున్నాయి కొన్ని జంతువులు. అదేంటి జంతువులు అలా అనుకోవడం ఏంటా అని అనుకుంటున్నారా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఎప్పుడూ మాటలతో దాడికి సిద్దంగా ఉండే రేవంత్ రెడ్డి మరోసారి తన మాటలకు పదును పెంచారు. అయితే మీరు మీరు ఏమైనా తిట్టుకోండి కానీ మా బోటి వాళ్లను ఎందుకయ్యా లాగుతున్నారు అని కొన్ని జంవుతులు తీవ్రంగా మండిపడుతున్నాయట. అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు.. జంతువులు ఎందుకు మండిపడుతున్నాయో తెలియాలంటే స్టోరీ చదవండి..

కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రేవంత్‌ కుక్కతోక వంకర ఎంత నిజమో కేసీఆర్‌ కారు కూతలు అంతే నిజమన్నారు. కేసీఆర్‌ ప్రవర్తనలో మార్పుల లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతిన బయటపెట్టిన తమను కుక్కలతో గాడుదలతో పోల్చారని...ఆ భాష తమకు రాక కాదని సంస్కారవంతమైన పార్టీ నుంచి వచ్చాం కాబట్టే సంయమనం పాటిస్తున్నామన్నారు. రాష్ట్రం రాకముందే హచ్‌కుక్కలాగా తెలంగాణకు కాపలా ఉంటానన్న కేసీఆర్‌ సీఎం అయ్యాక పిచ్చికుక్కలా అందరినీ కరుస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలా విమర్శల్లో కుక్క, పిచ్చి కుక్క, నక్క, పులి లాంటి జంతువుల పేర్లను వాడుకోవడంపై అవి మండిపడుతున్నాయి. అయినా మీకంటే మాటలు వచ్చు మైక్ ఇస్తే ఏమైనా మాట్లాడతారు కానీ మాకు అలా అవకాశం లేదు కదా అని బాధపడుతున్నాయట. అయినా మనుషులను తిట్టేంత ఖర్మ తమకు పట్టలేదని సముదాయించుకున్నాయట. పాపం.. జంతువులను వివాదాలకు వాడుకునే నాయకులు వాటి బాధను అర్థం చేసుకొని వాటి జోలికి పోకుండా ఉంటే మంచిదేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Animals  Revanth Reddy  TTDP  KCR  Telangana  Media  

Other Articles