Injustice | Deviprasad | Mlc

Injustice to employees union leader deviprasad in mlc

injustice, employees, union leader, deviprasad, mlc, trs, swamygoud, srinivasgoud

injustice to employees union leader deviprasad in mlc, in the mahabubnagar, rangareddy, hyderbad council constency deviprasad nomination from trs. but deviprasad lost mlc.

పాపం.. దేవీప్రసాద్ కు అన్యాయం జరిగిందట ..!

Posted: 03/27/2015 11:11 AM IST
Injustice to employees union leader deviprasad in mlc

దేవీప్రాసద్.. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన  ఉద్యోగ సంఘాల నేతల్లో ఒకరు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులను ఒకే తాటిపైకి తీసుకువచ్చి వారిని సమన్వయం చెయ్యడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే దేవీప్రసాద్ కు అన్యాయం జరిగిందట. అదీ మామూలుగా కాదు బాధ చెప్పుకోలేనంతగా అన్యాయం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం నుండి దేవీప్రసాద్ పోటీ చేసి ఓడియారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల తరఫున కీలకంగా వ్యవహరించిన స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ లకు టిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా అండగా నిలిచింది. అయితే స్వామి గౌడ్ ఏకంగా ఎన్నికై, మండలి చైర్మెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోనేత శ్రీనివాస్ గౌడ్ కూడా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వారిద్దరికి మంచి పదవులు తక్కడంతో ఎంతో కొంత ఆశతొ ఉన్న దేవీప్రసాద్ కు ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి. ఎన్నికల్లో గెలిచి మిలిగిన ఉద్యోగ సంఘాల నాయకుల మాదిరిగా తాను కూడా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని అనుకున్న దేవీప్రసాద్ కలలు కల్లలుగా మారాయి.

అయితే టిఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా మద్దతు దొరికింది కానీ వ్యక్తిగతంగా సరిగ్గా పని చెయ్యకపోవడం వల్లే ఓడియానని దేవీ ప్రసాద్ మీడియా ముందు వెల్లడించారు. కానీ తనకు రాజకీయాలపై పెద్దగా అనుభవం లేదని, అనుభవమున్న టిఆర్ఎస్ నేతలు తన ఓటమిని అడ్డుకోలేదని సన్నిహితులతో అన్నట్లు సమాచారం. అయితే కెసిఆర్ కూడా పెద్దగా దేవీప్రసాద్ ఎన్నిక గురించి పట్టించుకోలేదని, కానీ స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ లకు పూర్తి మద్దతిచ్చారని అనుకుంటున్నారట. మరి ఎమ్మెల్సీగా ఎన్నికల్లో ఓడిన దేవీ ప్రసాద్ ను చూసిన ఉద్యోగ సంఘాల నేతలు జాలి చూపిస్తున్నారట. పాపం స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ ల లాగా ఎక్కడికో వెళ్లాలనుకున్న దేవీ ప్రసాద్ ఇలా అన్యాయమయిపోయాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : injustice  employees  union leader  deviprasad  mlc  trs  swamygoud  srinivasgoud  

Other Articles