Is ktr unhappy with dad kcr behavior

ktr unhappy with dad kcr, ktr and kcr, kcr government, danger politics, dad and son politics, kcr and ktr government, mp kavitha

trengthening rumors that Telangana IT Minister KTR is unhappy over the cabinet expansion and etc things

కె.టి.ఆర్ రాజీనామా చేయనున్నారా...?

Posted: 12/20/2014 02:54 PM IST
Is ktr unhappy with dad kcr behavior

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమారుడు, మంత్రి కె.తారక రామారావు ఈ మధ్య పార్టీ సమావేశాలకు కాని, ప్రభుత్వ కార్యక్రమాలకు కాని హాజరవటం లేదు. కారణమేంటో ఎవ్వరికి అంతు చిక్కటం లేదంట. కొన్ని వర్గాలు మాత్రం కె.టి.ఆర్ మాటకు మంత్రి వర్గ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వలేదని, తండ్రి మాటకు ఎదురు చెప్పటం వాళ్ళ వువ్వు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు అనుకుంటున్నారు. కాని కొన్ని వర్గాలు మాత్రం దీని కొట్టి పారేస్తున్నాయి. కె.టి.ఆర్ కు మరియు కె.సిఆర్ కు చిన్న గొడవ జరిగిందని దానిలో భాగంగానే కె.టి.ఆర్ కొన్ని కార్యక్రమాలకు హాజరు కావటం లేదని, అదంతా త్వరలోనే సర్దుకుంటుందని వాళ్ళిద్దరికీ ఎలాంటి భేదాప్రియలు లేవని ఆ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి.

ఏది ఏమైనా అలకకు సంబంధించిన కధనాలు చాలా వస్తూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశానికి రాకపోవడంతో దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. చివరికి టిఆర్ఎస్ కు సంబందించిన వివిధ కార్యక్రమాలలో కాని, ప్రభుత్వపరంగా జరిగే కార్యకలాపాలలో కాని ఆయన కనిపించకపోవడం అందరికి ఆసక్తిని కలిగిస్తుంది. టిఆర్ఎస్ లో ఏదో జరుగుతోందన్న అభిప్రాయానికి తావిస్తున్నారు.సాధారణంగా కెటిఆర్ అన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరవుతుంటారు. కాని కెటిఆర్ ఎందుకో ఈ మద్య కనిపించకపోవడం ఆసక్తికరంగానే ఉంది. కరీంనగర్ జిల్లాకే చెందిన కొప్పుల ఈశ్వర్ ఛీఫ్ విప్ బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా హాజరుకాకపోవడం విశేషమే.

కె.టి.ఆర్ చాల రోజులుగా ఏ కార్యక్రమానికి హాజరు కావటానికి ఆసక్త చూపటం లేదు. ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానించటానికి వెళ్ళిన కనీసం కలవటానికి కూడా అంగీకరించటం  లేదటా...  కె.టి.ఆర్ వేరే కుంపటి పెట్టటానికి సిద్దమవుతున్నట్లు కొన్ని వర్గాలు గుస గుస లాడుకుంటున్నాయి. మల్లి కె.టి.ఆర్ మదిలో వేరే కోపం కూడా పెట్టుకున్నట్లు అనుకుంటున్నారు. తన తండ్రి.., హరీష్ రావుకు మరీ ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నారని  తన మాట కనీసం పట్టించుకోవటం లేదని తన కుటుంబ సభ్యుల దగ్గర వాపోయినట్లు కొన్ని వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి.  హరీష్ రావు కు మరియు కె.టి.ఆర్ కు కూడా ఈ  మధ్య అసలు పడటం లేదని అందుకే హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గించాలని కె.టి.ఆర్.., కె.సి.ఆర్తో అన్నట్లు కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదంతా పక్కన పెడితే కె.టి.ఆర్ ను ఈ రాజకీయాలన్నీ వదిలేసి మళ్ళి అమెరికా వెళ్ళిపోవాలని కె.సి.ఆర్ అన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి అందుకే కె.టి.ఆర్ ఏ కార్యక్రమం లో పాల్గొనకుండా స్థబ్దు గా ఉంటున్నట్లు బయట పలు వర్గాలు గుసగుస లాడుకుంటున్నారు.  

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles