Tv9 banned in karnataka re opened in telangana latest news

tv9 banned in telangana, tv9 banned in karnataka, tv9 ban in karnataka reasons, tv9 ban in karnataka latest news updates, tv9 ban court statements, latest news updates, karnataka scams tv9 programme, karnataka latest news updates, telugu media news updates

tv9 banned in karnataka re opened in telangana latest news : number one news channel name owned tv9 facing problems in recent times, telangana mso's banned tv9 channel along with abn andhrajyothi and now its repeated in karnataka

విపరీత బుద్దే.. వినాశకాలే అంటే ఇదేనేమో

Posted: 11/28/2014 11:28 AM IST
Tv9 banned in karnataka re opened in telangana latest news

ఆశ ఉంటే పర్వాలేదు.. కాని అత్యాశ ఉంటే మాత్రం ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పటికైనా కుప్పకూలటం ఖాయం. నేను చెప్పినట్లు నడుచుకోవాలి.., నేనో కొత్త శాసనకర్తను అనే సామ్రాజ్యవాద ధోరణితో వచ్చిన వ్యక్తులు, సంస్థలు ఎక్కువ కాలం నిలవలేవు. ఇది చరిత్ర చెప్తున్న నిజమే కాకుండా ప్రస్తుతం కన్పిస్తున్న వాస్తవం. ఎలక్ర్టానిక్ మీడియా రంగంలో దూసుకొచ్చి నంబర్ 1 న్యూస్ ఛానెల్ గా ఎదిగిన టీవీ9 ఇఫ్పడు ఎక్కడ చూసినా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. మీడియా అంటే వణుకు పుట్టేలా చేసిన ఈ చానెల్ ప్రస్తుతం మాత్రం ఎవ్వరికి పట్టని విషయంగా మారింది. నాలుగు నెలల పాటు తెలంగాణలో నిషేధం ఎదుర్కున్న ఈ చానెల్ ఇప్పుడు కర్ణాటకలోనూ కట్టేయబడింది. ఇందుకు గల కారణాలు పరిశీలిస్తే సంస్థ తప్పు లేదు అని తెలుస్తుంది. అయితే విశ్లేషకుల సమాధానం ప్రకారం.., సంస్థ పాటించిన విపరీత విధానాలే ఇబ్బందుకు గురి చేస్తున్నాయి అని చెప్తున్నారు.

దేశంలో పాపులర్ న్యూస్ చానెళ్ళలో ఒకటిగా ఉన్న టీవీ9 ప్రస్థానం తెలుగులో మొదలయింది. ఉమ్మడి రాష్ర్టంగా విడిపోవటానికి పదేళ్ళ ముందే టీవీ9 మొదలయింది. అప్పటికే మరో సంస్థ 24గంటల వార్తా ప్రసారాల కోసం సిద్ధం అవుతుండగా.., చడీచప్పుడు కాకుండా వచ్చి తొలి 24గంటల చానెల్ గా పేరు పొందింది. వార్తను సంచలనంగా చూపించి... జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. చిన్న విషయాన్ని కూడా బాగా ఫోకస్ చేసి సంచలన వార్తగా క్రియేట్ చేసింది. న్యూస్ జనరేట్ అనే స్టేజి నుంచి న్యూస్ క్రియేట్ అనే విధానం ఈ సంస్థ వల్లే మొదలయిందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈ సంచలన వార్తలు మొదట్లో బాగానే ఉండేవి. ఆ తర్వాత జనాలకు ఈ తరహా వార్తలంటే వెగటు పుట్టింది. ప్రమోషన్లు, టీఆర్ పీ రేటింగుల కోసం మీడియా అంటే ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తుంది అనే స్థాయికి దిగజార్చింది.

తాజా కర్ణాటక నిషేధంను తీసుకుంటే.., అధికార పక్షం గురించి ఏదో బండారం బయట పెడతామని ప్రమోషన్ చేసుకున్నందుకు టీవీ9 ఛానెల్ బ్యాన్ అయిందని అంటున్నారు. వాస్తవంగా ఆ స్కామ్ ప్రజలకు ఉపయోగపడేది అయితే ప్రమోషన్ అక్కర్లేదు. అనుకున్న సమయంకు నేరుగా ప్రసారం చేయవచ్చు కదా. కాని ఇక్కడ టీఆర్పీ గురించి ఆలోచించి తన గోతిని తానే తవ్వుకున్నట్లు చేసుకుంది. కేబుల్ ఆపరేటర్ల నిబంధనలు, హక్కుల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని కర్ణాటక అధికార పక్షం చానెల్ బంద్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ అలా చేసి ఉంటే అధికార పక్ష వైఖరిని ముమ్మాటికి ఖండించాల్సిందే. అయితే టీవీ9 కూడా సెన్సేషన్ అనే పదం వదిలేస్తే ఇంతవరకు వచ్చేది కాదు అని విమర్శలు వస్తున్నాయి. అవినీతి, అక్రమాలను బట్టబయలు చేసిన చరిత్ర టీవీ9కు ఉంది. ఇదే సమయంలో ఇక మీడియా రంగంలో విపరీతమైన పోటిని, కొత్త ఒరవడిని సృష్టించింది. ఇలా విపరీత బుద్దులకు పోయి వినాశనం కోరుకున్నట్లు అయిందని టాక్ విన్పిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv9  telangana  banned  karnataka  government  mso  

Other Articles