Vijayamma not appearing in ysrcongress actvities

vijayamma not appearing in ysrcongress actvities : after jagan came back from jail his mother, ysr congress honorary president vijayamma not appearing in party office and also in party activities political parties jagan told his mother to be in home only

vijayamma not appearing in ysrcongress actvities : after jagan came back from jail his mother, ysr congress honorary president vijayamma not appearing in party office and also in party activities political parties jagan told his mother to be in home only

విజయమ్మ ఎందుకు బయటకు రావటంలేదంటే..?

Posted: 10/18/2014 08:18 AM IST
Vijayamma not appearing in ysrcongress actvities

వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కొద్దిరోజులుగా బయట కన్పించటం లేదు. జగన్ జైలులో ఉన్నపుడు నిత్యం వార్తల్లో ఉన్న ఆమె ముఖం మీడియాలో చూసి ఎన్నిరోజులు అవుతుందో. పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉన్నా.., కనీసం కార్యాలయంకు కూడా రావటం లేదు అని తెలుస్తోంది. కొడుకు వచ్చే వరకు కుటుంబ బాధ్యతను, పార్టిని రెండు భుజాలపై వేసుకుని నడిపిన ఆమె ఇలా సడన్ గా అదృశ్యం కావటం వెనక కారణాలపై వైసీపీ నేతలే కాదు మిగతా పార్టీ వారు కూడా చర్చించుకుంటున్నారు.

నేతలు చెప్పుకుంటున్నవాటిలో ప్రధానంగా విన్పిస్తున్న ఊహాగానాలు ఇలా ఉన్నాయి. జైలులో ఉన్నంత కాలం విజయలక్ష్మి, షర్మిల పార్టీని నడిపారు. షర్మిల అవుట్ డోర్ పనులు చూస్తే.. విజయలక్ష్మి ఇండోర్ లో సమావేశాలు, సమీక్షలు నిర్వహించేది. అయితే జగన్ బయటకు వచ్చాక వీరిద్దరిని ఇంటికి పరిమితం చేశాడని అంటున్నారు. ఇప్పటివరకు మోసిన బరువు చాలు ఇక నేను చూసుకుంటాను అని చెప్పినట్లు కొందరు అంటుంటే.. మరికొందరు ఇంకో విధంగా మాట్లాడుకుంటున్నారు.

ఇక మరోకారణం ఏమిటంటే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి. విశాఖ ఎంపి స్థానం నుంచి పోటి చేసి బీజేపి నేత హరిబాబు చేతిలో విజయమ్మ ఓటమి చవిచూశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న ఆమె ఇలా ఓడిపోవటంపై మీడియాకు కన్పిస్తే ప్రశ్నలతో వేధిస్తారు కాబట్టి..., ఇంటినుంచి బయటకు రావటం లేదు అని తెలుస్తోంది. అటు చెల్లి షర్మిలను కూడా కొద్దికాలం బయటకు రానివ్వని జగన్.. ఈ మద్యే మీటింగ్ బెట్టి బాణంను మళ్లీ వదిలాడు. అయితే ఈ సారి తెలంగాణను చూసుకో అని బాద్యతలు అప్పగించాడు. మరి విజయక్ష్మి మళ్ళఈ ఎప్పుడు ప్రజల్లోకి వస్తుందో... అభిమానులకు సేవ చేస్తుందో చూడాలి.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayamma  ysr congress  latest updates  jagan  

Other Articles