Jaipal reddy to take over ponnala after by elections

Sr. fongress leader ,Jaipal Reddy, Ponnala Lakshmaiah, medak by poll, pcc

Sr. fongress leader Jaipal Reddy to take over ponnala after by elections, if congress losses

జైపాల్ రెడ్డి చేతికి పీసీసీ పగ్గాలు..?

Posted: 09/12/2014 05:15 PM IST
Jaipal reddy to take over ponnala after by elections

అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు.. పార్టీకి చెందిన కీలక నేతలతో పరిచయాలు.. ఇవి తప్ప, మీడియా ముందు హల్‌చల్‌ చేయడంలో వెనుకంజలో నిలిచే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఇప్పుడు ట్రెండ్ మార్చారు. రాజకీయ విమర్శలు చేయడంలో తరుచుగా మీడియా ముందుకు వస్తున్నారు. మిగతా కాంగ్రెస్‌ నేతలకన్నా దూకుడుగా వ్యవహరిస్తూ.. అందరూ విస్మయం చెందేలా చేస్తున్నారు. ఇంతకీ జైపాల్ రెడ్డి పోలిటికల్ కౌంటర్స్ తో దూసుకెళ్లడానికి కారణాలేమిటి.? ఇన్నాళ్లు స్థబ్దుగా వున్న ఈ కాంగ్రెస్ కురువృద్దుడు ఎందకని జోష్ తో ముందుకు సాగుతున్నారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక జైపాల్‌రెడ్డి తీవ్రంగా కలత చెందారు. తెలంగాణ తెచ్చింది తానేనని చెప్పుకున్నా జైపాల్‌రెడ్డి మాటల్ని తెలంగాణ ప్రజానికం ఎవరూ ఒప్పుకోలేదు. యూపీఏ హయంలో కేంద్రంలో క్యాబినెట్‌ ర్యాంక్‌ లో కొనసాగిన తాను తెలంగాణ విషయమై చక్రం తిప్పారన్నది నిర్వివాదాంశం, అయినా దానికి ప్రజలు అంగీకరించలేదు. తన ఖాతాలో తెలంగాణను వెసుకోవడంలో విఫలమైన జైపాల్ రెడ్డి.. ఈ క్రెడిట్ ను కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడంలోనూ విఫలమయ్యారు. అయితేనేం మళ్ళీ తన ఇమేజ్‌ని పెంచుకోవడానికి ఆయన వీలు చిక్కినప్పుడల్లా మీడియా ముందుకొస్తున్నారు. తెలంగాణ తెచ్చింది మీడియా గొంతు నొక్కడానికా.? ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు రోడ్డెక్కడానికా.? అంటూ తెలంగాణ సర్కార్‌ని ప్రశ్నిస్తున్నారు. జైపాల్‌రెడ్డి తీరు కాంగ్రెస్‌ నేతలకే ఆశ్చర్యం కలిగిస్తోంది.

అయితే జైపాల్ రెడ్డి ఎందుకీలా విమర్శలు ప్రతివిమర్శలతో ముందుకెళ్తున్నారన్న విషయాన్ని కూపీ లాగిన నేతలు మాత్రం.. ఆయనకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పగ్గాలు అందుతున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలను కూడా విమర్శించాల్సిన అవసరం వుంటుంది కాబట్టే.. ఆయన చెలరేగిపోతున్నారని సమాచారం. మెదక్ ఉపపోరులో కాంగ్రెస్ విజయం సాధిస్తే పోన్నాలకు పదవీ గండం లేనట్లేనంటున్నారు. పోరబాటున జరగరానిది జరిగితే మాత్రం పోన్నాల చేతిలోని పీసీసీ అధ్యక్ష పగ్గాలను జైపాల్ రెడ్డికి అందించేందుకు అధిష్టానం సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అధిష్టానాన్ని ఒప్పించిన జైపాల్ రెడ్డి బాధ్యతలు అప్పగిస్తే.. తెలంగాణలో మళ్ళీ పార్టీ బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaipal Reddy  Ponnala Lakshmaiah  medak by poll  pcc president  

Other Articles