Pawan kalyan supports to join jaggareddy in bjp party

pawan kalya, jaggareddy, pawan kalyan jagga reddy, pawan kalyan latest news, jagga reddy latest news, pawan kalyan kcr, kcr pawan kalyan, pawan kalyan jagga reddy kcr, medak mp seat, medak parliament seat, jagga reddy bjp party, jagga reddy joins bjp party

pawan kalyan supports to join jaggareddy in bjp party : the latest rumours are going viral that.. pawan kalyan is helps to jaggareddy join in bjp party and contest as parliament mp

పవన్ కల్యాణ్ చొరవతో జగ్గారెడ్డి బీజేపీలోకి జంప్!

Posted: 08/27/2014 03:57 PM IST
Pawan kalyan supports to join jaggareddy in bjp party

మెదక్ జిల్లా మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి బీజేపీ పార్టీలోకి జంప్ కావడంపై రకరకాల రాజకీయ అనుమానాలు వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాభవాన్ని చవిచూసినప్పటికీ ఈయన మాత్రం తాను కాంగ్రెస్ వాదినేనంటూ బలంగా చెప్పుకునే తిరిగేవారు. తాను రాజకీయాల్లో వున్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పుకున్న జగ్గారెడ్డి... అనుకోకుండా ఆ పార్టీని వదిలేసి బీజేపీలో చేరడం వెనుక వున్న ఆంతర్యం ఏమిటి..? అంటూ అందరూ ఆందోళనల్లో మునిగిపోయారు. పైగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ ఆయనకు టికెట్ కూడా కేటాయించింది. దీంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక బలమైన నాయకుడు వున్నాడని... అతడే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటూ దాదాపు ఫిక్స్ అయిపోతున్నారు.

మొదట టీఆర్ఎస్ పార్టీనుంచి మెదక్ ఎమ్మెల్యేగా 2004వ సంవత్సరంలో విజయ సంకేతాన్ని ఎగురవేసిన జగ్గారెడ్డి... కేసీఆర్ తో విభేదాలు రావడం వల్ల అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయారు. పదిసంవత్సరాలవరకు మెదక్ జిల్లా రాజకీయాల్లో ఆయన తనదైన ప్రతిభతో పట్టు సాధించారు. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఈయన కూడా మెదక్ జిల్లా నుంచి పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. అయినా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నటికి వీడేది లేదంటూ చెప్పుకుంటూనే వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికారంలోకి రాగానే.. ఆ పార్టీతో తనకు ఎటువంటి సంబంధాలు లేకపోయినా పవన్ కల్యాణ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలోనే ఆయన పవన్ గురించి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ప్రచారం చేయడం వల్లే బీజేపీకి లాభం చేకూరిందనే వ్యాఖ్యానాలు చేశారు. ఆ క్రమంలోనే వారిమధ్య మంచి సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ బహిరంగంగా కలిసినట్టు కనబడలేదు కానీ.. వారిమధ్య బంధాలు మాత్రం బాగానే నడిచాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఓడిన అనంతరం తాను ఏ పార్టీలోకి జాయిన్ కాను అని చెప్పుకున్న జగ్గారెడ్డి... అవకాశం వస్తే బీజేపీ పార్టీలోకి తప్పకుండా చేరుతానని పలుమార్లు చెప్పుకున్నారు. వారిమధ్య వున్న సన్నిహిత బంధాల వల్లే ఆయన అప్పట్లో ఆ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారాలు వచ్చాయి. అందులో భాగంగానే జగ్గారెడ్డి బీజేపీలోకి చేరడంలో పవన్ రెకమెండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా... సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ ప్రచారాలు చేసిన సందర్భంగా ఆయన కేసీఆర్ మీద ఎన్నో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే! అక్కడినుంచి మొదలు ఇప్పటివరకు కేసీఆర్, పవన్ లు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో విమర్శలు చేసుకుంటూనే వున్నారు. ఇక జగ్గారెడ్డి, కేసీఆర్ ల మధ్య వున్న శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే వున్నప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు నడిపారు. కేసీఆర్ అక్రమంగా డబ్బులు దోచేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన సందర్భాలూ వున్నాయి. దీంతో వీరిమధ్య విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి. వీరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సమయంలోనే పవన్, జగ్గారెడ్డిల మధ్య సన్నిహిత సంబంధాలు బాగా బలపడ్డాయి. దీంతో పవన్, జగ్గారెడ్డిలు ఇద్దరూ కలుసుకుని కేసీఆర్ ను ఓడించే దిశగా పావులు కదుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ఇచ్చిన సందేశాల మేరకు జగ్గారెడ్డి బీజేపీలోకి చేరారని.. చేరిన వెంటనే ఆయనకు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని జోరుగా పుకార్లు సాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jagga reddy  kcr  bjp party  medak parliament mp seat  

Other Articles