Modi power becomming low in recent times

narendra modi, prime minister of india, bjp, nda government, central ministers list, rjd, jdu, congress, anti bjp alliance, by poll result, latetst news, politics

narendra modi mania becoming low fallowing in recent times : bjp modi wave going to end soon latest by poll result showed that

మోడి హవా తగ్గుతోందా ?

Posted: 08/25/2014 06:22 PM IST
Modi power becomming low in recent times

రోజులు మారుతాయి. బండ్లు ఓడలవుతాయి. బీజేపికి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న బీజేపి ఒక్కసారిగా విజృంబించి అధికారంలోకి వచ్చింది. మిత్రపక్షాలతో కలిపి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తాలేని బీజేపిని.., స్వతంత్ర్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకొచ్చింది నరేంద్రమోడి. ఇది అందరికి తెలిసిన నిజం. ఒక ఉప్పెనలా వచ్చి ఢిల్లీలో కూర్చున్నారు. ఇప్పుడు అంతే వేగంగా ఉప్పెన వెనక్కు వెళ్తున్నట్లు కన్పిస్తోంది. గాలి ఎప్పుడూ ఒకే వైపు వీయదన్నట్లు.., మోడి గాలి కూడా ఇప్పుడు తగ్గిపోయిందా?. ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. మోడి మ్యానియా పూర్తిగా తగ్గలేదు. అయితే గతంలో ఉన్నంత ఊపు మాత్రం ఇప్పుడు లేదు.

కర్ణాటక రాష్ర్టంలో మొత్తం మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో చిక్కోడి, సబల్గా నియోజకవర్గాలను హస్తం కైవసం చేసుకుంది. శికారిపురా మాత్రం బీజేపి నేత యడ్యూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర వశమైంది. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్తున్న బీజేపికి ఈ ఫలితం షాక్ లాంటిది. మోడి వచ్చినా దక్షిణాదిన కమలం వికసించటం కష్టమని ఈ ఫలితం స్పష్టం చేస్తోంది. ఇక పంజాబ్ లో రెండు స్థానాలకు గాను ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో జైట్లీని ఓడించిన అమరిందర్ సింగ్ ఇంట ఈ ఎన్నిక మరో ప్రజా ప్రతినిధిని కూర్చోబెట్టింది. అమరిందర్ భార్య ప్రణీత్ కౌర్ ఉప ఎన్నికల్లో పాటియాలా నుంచి గెలుపొందారు. ఇక తల్వాండి సాబో అకాలీదళ్ వశమైంది.

బీహార్ బీజేపి వ్యతిరేక శక్తుల హవా సాగింది. రాష్ర్టంలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపికి వ్యతిరేకంగా లాలూ, నితీష్, కాంగ్రెస్ కూటమి ఆరు స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఆశ్చర్యకరంగా పోటి చేసిన రెండు చోట్లా గెలుపొందింది. ఇక చెరి నాలుగు స్థానాల్లో పోటి చేసిన జేడీయూ- ఆర్జేడి కూటమి నాలుగు స్థానాలను గెలుపొందింది. బీజేపిని మట్టికరిపించేందుకు రెండు దశాబ్దాలకు పైగా బద్ద శత్రువులుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూలు కలిసి పోటి చేశాయి. అనుకున్నట్లే ఫలితం పొందాయి. బీజేపి నాలుగు స్థానాలను గెలుచుకుని తన ప్రభావం మాత్రం చూపగలిగింది.

ఇక బీజేపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీ అధిక్యత చూపింది. మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలను కమలం గెలుచుకుంది. ఒక స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కేంద్రంలో, రాష్ర్టంలో బీజేపి అధికారంలో ఉన్నా.., ఇక్కడ అన్ని స్థానాలను కైవసం చేసుకోలేదంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. మోడి స్వయంగా ప్రచారం చేయకపోవటమా.., లేక ఆయన హవా నిజంగానే తగ్గిందా? అనేది ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం బీజేపికి ఈ ఫలితాలు పాఠం లాంటివి. లాలూ.,నితీష్ కూటమికి కాంగ్రెస్ జత కలిస్తే.., ఇక్కడ పాగా వేయటం కష్టమని ఈ ఫలితం స్పష్టం చేస్తోంది. ఇప్పటి నుంచి పాఠాలు నేర్చుకుని పట్టు సాధిస్తే వచ్చే ఏడాదికి పరిస్థితిలో మార్పు రావచ్చు. లేదంటే ఈ దఫా రుతు పవనాల లాగానే మోడి పవనాలు కూడా దేశంపై అంతగా విస్తరించకపోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  jdu  rjd  by poll result  

Other Articles