Uttar pradesh cm akhilesh yadav telling love stories

akhilesh yadav, akhilesh yadav love jihad, uttar pradesh love jihad, uttar pradesh muslim, bjp mp hema malini news, hema malini latest news, akhilesh yadav latest news, akhilesh yadav fires, akhilesh yadav news

uttar pradesh cm akhilesh yadav telling love stories : Uttar pradesh young cm akhilesh yadav is in another problem

హేమమాలినిపై ప్రేమకథలు అల్లుతున్న సీఎం!

Posted: 08/25/2014 04:12 PM IST
Uttar pradesh cm akhilesh yadav telling love stories

ఇదేదో సినిమాను ప్రమోట్ చేయడానికి చేస్తున్న వ్యవహారం అయితే కాదు... సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో వుండి కూడా సమస్యలను పరిష్కరించకుండా వాటికి బదులు సినిమా ప్రేమకథలని అల్లుతూ జవాబుగా విశదీకరిస్తున్నాడు. అతనెవరో కాదు... అతి తక్కువ వయస్సులోనే సీఎం పదవిని చేజిక్కించుకుని, సరికొత్త ఒరవడికి నాంది పలికిన వివాదాస్పదమైన నాయకుడు అఖిలేష్ యాదవ్! తమకు న్యాయం చేస్తాడంటూ ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈయన్ను సీఎంగా ఎన్నుకుంటే... ఆ పదవిని చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ యువనేత ఏదో ఒకవిధంగా వివాదాస్పంగా అవుతూనే వున్నాడు. లేనిపోని వ్యాఖ్యలు చేసి, సరికొత్త సంచలనాలనే సృష్టిస్తున్నాడు.

ఒకవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నిత్యం మతఘర్షణలు, అత్యాచారాలు వంటి సంఘటనలతో కొట్టుమిట్టాడుతుంటే... ఈయన మాత్రం జరుగుతున్న చోద్యాన్ని చూస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. పరిష్కారమార్గాలను వెదుకురా బాబు అంటే... వాటికి తగ్గట్టుగా కథలు అల్లుకుంటూ కూర్చున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా లవ్ జిహాద్ అనే ఇంకొక కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలకు వల వేస్తున్నారని.. ప్రేమపేరుతో వారిని బలవంతంగా మతం మార్చే పనికి పూనుకున్నారనే వార్తలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. దీంతో అక్కడ మతసంఘర్షణలు భారీగా జరుగుతున్నాయి.

ఈ విషయంపై బీజేపీ పార్టీవాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తుంటే... అఖిలేష్ యాదవ్ మాత్రం చాలా విచిత్రంగా స్పందిస్తున్నాడు. అసలు లవ్ జిహాద్ అనేది జరగడం లేదని.. అవి కేవలం పుకార్లు మాత్రమేనని చెబుతున్న అఖిలేష్.. ఒక హిందీ సినిమా కథను అల్లుతున్నాడు. ప్రస్తుత బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న హేమమాలినీ, ఫిరోజ్ ఖాన్ లు కలిసి ముఖ్యపాత్రలో నటించిన ఒక హిందీ సినిమా గురించి వివరిస్తున్నాడు. కథ సారాంశం ప్రకారం.. హిందూయువకుడు అయిన హీరో, ముస్లిం యువతిని ప్రేమిస్తాడు.. అయితే వీరి పెళ్లికి ఎంతోమంది అడ్డుపడుతుండగా ఆ క్లిష్టమైన పరిస్థితులను పోరాడి చివరికి పెళ్లి చేసుకుంటారు. ఈ కథనే అఖిలేష్ చెబుతున్నాడు.

అంటే.. ప్రేమ జిహాద్ అనేది తప్పు కాదని అఖిలేష్ యాదవ్ వ్యక్తపరుస్తున్నాడు. అలాగే ఇటువంటి ప్రేమ జిహాద్ వంటి సంఘటనలపై బీజేపీ ఎంపీ అయిన హేమమాలినికి ఎటువంటి అభ్యంతరం వుండకపోవచ్చునంటూ వ్యాఖ్యానిస్తున్నాడు. సమస్యను పరిష్కారించాల్సింది పోయి... దాని మరింత అగ్గిరాజేలా ఈ సీఎం వ్యాఖ్యానాలు చేయడంతో ఇప్పుడది పెద్ద దుమారంగా మారిపోయింది. ముందే వివాదాస్పద సీఎంగా కితాబెక్కిన అఖిలేష్.. ఇప్పుడు తాజా తీరుతో మరెన్ని మరెన్ని విమర్శలకు గురవుతాడో! ఈ విషయం అక్కడ మరిన్ని దుమారాలను రేపుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhilesh yadav  uttar pradesh  love jihad  hindu muslim fights  

Other Articles