Ysrcp may merge party with congress in teangana

political news, speculations, ysr cogress, congress, aicc, inc, jaganmohan reddy, ysr, kcr, telangana, ponnala, ap congress, telangana congress, digvijay, latest news, trs

ysrcongress may merge into congress in telangana state : ysr congress may merge into congress in telangana

విలీనం దిశగా వైసీపీ ?

Posted: 08/22/2014 03:29 PM IST
Ysrcp may merge party with congress in teangana

విభజనకు ముందు సమైక్య స్వరం విన్పించినా, విభజన తర్వాత రెండు రాష్ర్టాల్లో కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి. రాష్ర్టం కలిసుండాలని బాహాటంగానే ప్రకటించిన ఈ పార్టికి తెలంగాణలో కూడా మూడు సీట్లు వచ్చాయి. అయితే ఏపీలో మాత్రం ఆశించిన మేర స్థానాలు దక్కించుకోలేక ప్రతిపక్షంలో కూర్చుంది. ఇప్పుడు పరిస్థితులు, పరిణామాలు మారిపోయాయి. ఫ్యాను గాలి చాలటం లేదని చాలా మంది నేతలు ఏసీ కారెక్కుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి మారిపోయింది. శాసిద్దామని ఆశించిన నేతలు.., నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. వలసలు వెళ్తున్న నేతలను కట్టడి చేయలని జగన్.., ఏకంగా పార్టీనే విలీనం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఇక దుకాణం బంద్ చేయాలని   భావిస్తున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ను ఏ పార్టీలో కలపాలని ఆలోచించిన జగన్.., చివరకు కాంగ్రెస్ లోనే విలీనం చేయాలని నిర్ణయించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీలోని నేతలంతా టీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో ఆ పార్టీతో విలీన పొత్తుపై చర్చించినా ప్రయోజనం ఉండదు. పైపెచ్చు.., విభజన శక్తులతో జగన్ కుమ్మక్కయ్యారని ఏపీలో తీవ్ర విమర్శలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇక మిగిలింది కాంగ్రెస్ కాబట్టి అందులోనే వైసీపీని కలపాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ లో తెలంగాణ వైసీపీని విలీనం చేయాలని భావిస్తున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రకటనా ఇంకా రాలేదు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన జగన్.., ఆయన చూపినంతగా రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోయారు. ఓదార్పు యాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లగలిగారు. అయితే తెలంగాణ ఉద్యమం వైసీపీపై తీవ్రంగా ప్రభావం చూపింది. అదే సమయంలో జగన్ జైలుకు వెళ్ళటం కూడా పార్టీపై ప్రభావం చూపింది. ఎన్నికల ముందు జైలు నుంచి వచ్చిన జగన్ సమైక్య నినాదంతో తెలంగాణలో అప్రకటితంగా పార్టీని మూసుకున్నట్లు భావించారు. అయితే అప్పటికే సీమాంధ్రలో టీడీపీ పాగా వేసి కేంద్రంపై విమర్శల దాడి పెంచింది. అటు విభజనపై పార్లమెంటులో చర్చ సమయంలో టిడిపి ఎంపీల ఆందోళన, తెలంగాణ బిల్లు పాస్ అయ్యాక ప్రజలకు టీడీపీ ఇచ్చిన హామిలు ఆ పార్టీకి అధికారం కట్టబెట్టాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీస శాసన సభ్యత్వాలు లేకుండా.., స్థానికత సెంటిమెంట్ బలంగా ఉండే తెలంగాణలో సమైక్య పార్టిగా ముద్రపడ్డ వైసిపి కోలుకుంటుందని ఎవరూ చెప్పరు. దీంతో జగన్ విలీనమే ఉత్తమంగా భావిస్తున్నారు.
(కేవలం ఊహాజనిత సమాచారం ఆధారిత కధనం )

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  ysr congress  congress  telangana  

Other Articles