Telangana cm kcr comments pawan kalyan on survey

cm kcr, kcr latest news, kcr telangana survey, kcr news, kcr pawan kalyan, pawan kalyan comments kcr, kcr comments pawan kalyan, pawan kalyan telangana survey, telangana samangra kutumba survey, telangana survey news, kcr latest press meet, kcr telangana survery press meet, telangana survey news, pawan kalyan news

telangana cm kcr comments pawan kalyan on survey : telangana cm kcr comments on pawan kalyan for not participate in telangana survey which goes viral in andhra and telangana

తెలంగాణాలో పవన్ ను కేసీఆర్ వుండనివ్వరా..?

Posted: 08/20/2014 10:30 AM IST
Telangana cm kcr comments pawan kalyan on survey

భారతదేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే! అందులో దాదాపు తెలంగాణ ప్రజలందరూ పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారందరూ కూడా తమతమ వివరాలను ఈ సర్వేలో భాగంగా సమర్పించారు. అంతెందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన కుటుంబసభ్యుల వివరాలతోపాటు ఆస్తుల వివరాలను కూడా ఇచ్చారు. కొంతమంది ప్రముఖులు కూడా ఈ సర్వేలో భేషుగ్గా పాల్గొన్నారు. అయితే జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఈ సర్వేలో పాల్గొనలేదు. హాలిడే ట్రిప్ లో భాగంగా పవన్ బెంగళూరులో వున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక పార్టీ అధినేత అయి కూడా ఇలా ప్రవర్తించడం ఏమాత్రం బాగోలేదని తెలంగాణమంత్రులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పవన్ విషయం మీద ఓ ఘాటు కామెంట్ చేశారు. మంగళవారం సర్వే జరిగిన నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్... ‘‘దేశ చరిత్రలో ఇంతవరకూ జరగని విధంగా, కనీవినీ ఎరుగని రీతిలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఇందులో పాల్గొన్న సామాన్య ప్రజలతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సినీరాజకీయ ప్రముఖులు కూడా తమ వివరాలను నమోదు చేసుకున్నారు. దీనికి వారు సహకరించించినందుకు నా కృతజ్ఞతలు. ఎటువంటి భత్యాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఉద్యోగులకు నా ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఓ విలేకరి.. ‘‘ఈ సర్వేలో పవన్ కల్యాన్ పాల్గొనలేదని తెలిసింది. దీని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా కేసీఆర్.. ‘‘పవన్ కల్యాణ్ తెలంగాణాలో వుండదలుచుకోలేదేమో..! అతను కేవలం టూరిస్టుగానే వుండాలనుకుంటున్నాడేమో..!’’ అని వ్యాఖ్యానించారు. అయితే చివరగా.. ‘‘సర్వేలో వివరాలు ఇవ్వకపోతే అది వారి కర్మ’’ అంటూ ఆయన ఘాటుగా కామెంట్ చేశారు.

మరి ఇది పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నారా.. లేకపోతే ఎవరైతే ఇవ్వలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకుని అన్నారో తెలియదు కానీ.. ప్రస్తుతం దీని మీద భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. నిన్నమొన్నటిదాకా ఈ ఇద్దరు నాయకులు సైలెంట్ గా వున్న నేపథ్యంలో ఈ సర్వేతో మళ్లీ వారిమధ్య వాగ్యుద్ధం మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘కేసీఆర్ చెబుతున్న మాటలు వింటుంటే.. ఆయన పవన్ కల్యాణ్ ను తెలంగాణలో వుండనివ్వకుండా పంపించివేయాలనుకుంటున్నారా..?’’ అంటూ పేర్కొంటున్నారు. సాధారణంగా చెప్పుకోవాలంటే.. రాజకీయంగా వీరిద్దరూ ఇప్పటికే చాలా దూషించుకున్నారు. ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు గుప్పించుకున్నారు. ఏ రీతిలో అయితే పవన్ కల్యాణ్ సీఎం కేసీఆర్ మీద వ్యాఖ్యానాలు చేశారో... అంతకన్నా మించి ఆయన పవన్ మీద విమర్శల జల్లులు కురిపించారు. ‘‘నిన్నకాక మొన్న వచ్చిన ఒక పిల్లకుర్రాడు.. నామీదే కామెంట్లు చేస్తాడా..?’’ అంటూ ఆయన పవన్ ను ఉద్దేశించి చాలాసార్లు అన్నారు. ఇప్పుడు ఈ సర్వేలో పవన్ పాల్గొనకపోవడంతో మరోసారి ఘాటు కామెంట్లు చేశారు. మరి దీని మీద పవన్ ఎలా స్పందించనున్నాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  pawan kalyan  telangana survey  chandrababu naidu  junior ntr  

Other Articles