Students and telugu people praises ap cm chandrababu naidu

cm chandrababu fire on kcr, ap cm fire telangana cm kcr, EAMCET Counseling, AP CM Chandrababu letter to kcr, eamcet controversy, cm kcr latest press meet, cm kcr vs cm chandrababu, ap vs telangana, chandrababu latest press meet, ap cm latest speech, tdp vs trs.

students and telugu people praises ap cm chandrababu naidu: r Eamcet counselling between Telangana ... Reddy had colluded with AP Chief Minister N. Chandrababu Naidu.

చంద్రబాబు..! నీలో మగాడిని చూసామయ్యా!

Posted: 08/01/2014 02:49 PM IST
Students and telugu people praises ap cm chandrababu naidu

అరవై నాలుగు ఏళ్ల యువ అందగాడా! నీలో మగాడిని చూసామయ్యా అని తెలుగు ప్రజలు, తెలుగు విద్యార్థులు, తెలుగు మేథావులు, రాజకీయ పండితులు అంటున్నారు. అలుపెరుగని మగధీరుడిలా.. తెలుగు ప్రజలకు కోసం శక్తి కి మించి కష్టపడుతున్నావ్! తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చటానికి రెయింబవళ్లు, నిద్రాహారాలు మాని తెలుగు ప్రజల అభివృద్ది కోసం పరుగులు తీస్తున్నావు! అపార అనుభవం ఉన్న ఓ చంద్రన్న .. నీకు సాటి రారెవ్వురు! అరిచే కుక్కలకు, బెదిరించే బక్క నేతలకు దీటుగా.. సమాధానం చెబుతూ సాగిపోతున్న చంద్రబాబు నీలో మగాడిని చూసామయ్యా అని రాజకీయ నేతలు అంటున్నారు.

ఎపీలో కౌరవ సైన్యం చాలా మంది రాజకీయ నేతలు , యువ లీటర్లు ఉన్న పెద్దగా ఫలితం కనిపించటంలేదు, సొంత లాభం కోరకు పనిచేసే పార్టీలు పుట్టాయి. కానీ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ, శత్రువులతో సరసం ఆడుతూ.. తెలుగు ప్రజల, ఏపీ పరువు తీసాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత. రాజకీయ పరిస్థితులు ఘోరంగా మారాయి. తెలుగు విధ్యార్థుల, తెలుగు ప్రజల జీవితాల్లో కారుమబ్బులు కమ్ముకున్నాయి. ‘‘కొత్త బిచ్చగాడు పొద్దు తెలియదని’’ అనే విధంగా.. అధికారం దక్కటంతో.. నోటిలోని నాలుక ఇష్టం వచ్చినట్లు నాట్యం చేసి కొత్త సమస్యలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వారికి సమాధానం చెబుతూనే తెలుగు విద్యార్థుల, తెలుగు ప్రజల గురించి ఆలోచించి ఘనమైన నిర్ణయం తీసుకున్నావ్!

అతను శత్రువు అని తెలుసినా సంది చేసుకుందాం..రా! సమస్యలు పరిష్కరించుకుందాం..రా! కలిసి పని చేసి.. తెలుగు విద్యార్థుల, ప్రజల జీవితల్లో వెలుగులు నింపుదాం... రా! అని అనేకసార్లు లేఖలు రాసి, మీడియా ద్వారా పిలిచి, మంత్రులతో రాయభారం పంపిన, అటువైను ఎలాంటి సమాధానం రాలేదు! కానీ సైలెంట్ గా చీకటి పనులు చేస్తూ , కొత్త సమస్యలను సృష్టిస్తూ ముందుగా సాగిపోతున్న అనుభవంలేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మరో మెట్టు దిగి.. కలిసి మాట్లాకుందాం రా అని పిలవటం జరిగింది.

 మీకు ఫీజులు భారం అయితే.. 58 శాతం విద్యార్థులకు మేము ఫీజులు కడతాం! మీరు 48 శాతం కట్టండండని ప్రేమతో ఆఫర్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్లో ఎలాంటి చలనం లేదు! సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎంసెట్‌ అడ్మిషన్లు పూర్తి కావాలని, దీనిపై కలిసి కూర్చుని మాట్లాడుకుందామని బాబు పిలుపునిచ్చారు. ‘‘సుప్రీం చెప్పినా, కేంద్రం చెప్పినా విననంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది. మనం హద్దులో మనం లేనప్పుడు సుప్రీంకోర్టు అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం తీర్పు ఇస్తుంది.

రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ఉంది. ఈ చట్టానికి ఒప్పుకొనే కేసీఆర్‌ కుటుంబ సమేతంగా(సోనియాతో) ఫోటోలు దిగారు. ఇవేమీ సామ్రాజ్యాలు కావు. పాకిస్థాన్‌, ఇండియాలాగా ఉండటం సరికాదు. విద్యుత్‌ సమస్యలపై తమిళనాడు, కర్ణాటకలతో సహకరించుకోవడంలేదా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న వారు ఇప్పుడు ఏమయ్యారని అడిగారు. కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణ సీఎంకి లేఖ రాశాను. ఇప్పుడూ రాస్తాను. విద్యార్థులు, ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గడానికీ సిద్ధం’’ అని చంద్రబాబు తెలిపారు.

పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్‌ వైఖరి గురించి విద్యార్థులకు తెలియజెప్పాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలకు చంద్రబాబు సూచించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మధుసూధన్‌ రెడ్డి, ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరిలతో పాటు విద్యార్థులు లేక్‌వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును కలిశారు. 1956 స్థానికత నిబంధన పెట్టడం వల్ల తెలంగాణ ప్రాంతంలోని భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా బాబు చెప్పారు.

స్థానికతను 1956ను ప్రామాణికంగా నిర్ణయించడంలో హేతుబద్ధతను చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘మహారాష్ట్ర, కర్ణాటకతోసహా ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 50 ఏళ్ల కిందట భద్రాచలం ఎక్కడుంది? వారికి స్థానికత సర్టిఫికెట్‌ ఎలా ఇస్తారు? 1956లో హైదరాబాద్‌లో కేవలం 11 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కోటీ 10 లక్షల మంది ఉన్నారు. వారంతా పన్నులు చెల్లించడంలేదా? వారి సంక్షేమం అక్కరలేదా?’’ అని నిలదీశారు. హైదరాబాద్‌కున్న ఇమేజ్‌పోతే నష్టపోయేది తెలంగాణ ప్రజలేనన్నారు.

ఇంత మంచిగా చెప్పిన వినకుండా ఒంటెద్దు పోకడిలో ముందు గా సాగిపోతే.. నష్టపోయేది తెలంగాణ ప్రభుత్వమే అని చంద్రబాబు అన్నారు. అసలు ఇంతకీ తెలంగాణ సీఎం కేసిఆర్ , ఏపీ సీఎం చంద్రబాబు కలవటానికి ఎందుకు భయపడుతున్నారు? గతంలో ఈ ఇద్దరు మంచి మిత్రులు? అధికారం వచ్చిన తరువాత శత్రువులుగా మారిపోయారు? కేసిఆర్ లో దైర్యం ఉందో లేదో తెలియదు గానీ, త్వరగా ఎంసెట్ సమస్య కు పరిష్కరం చెప్పకపోతే.. పార్టీ ఆఫీసులపై రాళ్లు పడిన ఆశ్చర్యం లేదని తెలంగాణ విద్యార్థులు అంటున్నారు. ఏమైన చంద్రబాబు తెలంగాణ ప్రజల్లో కూడా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. నిజంగా చంద్రబాబులో ఒక మగాడు ఉన్నాడని .. ఎంసెట్ రాసిన విద్యార్థులు అంటున్నారు. రెండు రాష్ట్రాల మద్య ఎంసెట్ వార్ తో ఏం జరుగతుందో చూద్దాం!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles