Ycp mp kothapalli geetha face to face ys jagan

ysrcp mp kothapalli geetha join tdp, araku mp meet on cm chandrababu, araku mp kothapalli geeta, ycp mp geetha fire on ys jagan, ycp mp fire on jagan party, Araku MP Kothapalli Geetha Face to Face Interview , MP Kothapalli Geetha press meet, ys jagan meet on pm narendra modi, ys jagan and ap cm chandrababu naidu, ysrcp mps, jagan party, bhutta renukha, , ycp mp geetha controvercy, ycp mp geetha commens on yscp leaders, MP Kothapalli Geetha Face to Face ys jgan, tdp vs ycp, ys jagan vs tdp leaders, ys jagan latest press meet, ys jagan latest comments on tdp, ys jagan press note, ycp mps jump to tdp, 2014 election, 2019 election ys jagan party.

YCP MP Kothapalli Geetha Face to Face ys jagan: YCP MP Kothapalli Geetha while talking in the interview cleared on the rumors of changing party that she is not thinking of changing her party

జగన్ చేస్తే సంసారం-నేను చేస్తే వ్య...మా?

Posted: 07/30/2014 03:57 PM IST
Ycp mp kothapalli geetha face to face ys jagan

‘‘ఉన్నోడు .. చేస్తే సంసారం - లేనోడు చేస్తే వ్యభిచారం’’ అనే నానుడి మాటలు గుర్తుకు వస్తున్నాయని ఆరకు ఎంపీ కొత్తపల్లి గీత అంటున్నారు. రాష్ట్రాభివృద్ది కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని కలిస్తే తప్పులేదు గానీ నేను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిస్తే తప్పా? అని కొత్త పల్లి గీత జగన్ పై విరుచుకుపడ్డారు.‘‘ జగన్ చేస్తే సంసారం.- నేను చేస్తే.. వ్య.... మా? అనే పద్దతిలో.. జగన్ వ్యహరిస్తున్నాడని గీత మండిపడ్డారు.

నా నియోజకవర్గ ప్రజలకు మంచిచేయాలన్న ఉద్దేశంతోనే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవటం జరిగింది. ఇందులో తప్పేముందని గీత ప్రశ్నించారు. చంద్రబాబును కలిసి 10 పేజీల మెమోరాండంను ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా అదీ మీడియా కూడా విడుదల చేయటం జరిగిందని గీత చెప్పటం జరిగింది. వైసీపీ పార్టీలో మహిళా నేతలు చెప్పుకోలేని ఇబ్బందుల ఉన్నాయి. అయినా జగన్ మాటకు కట్టుబడి ఇప్పటి వరకు ఉన్నాం. ఇకనైన వైఎస్ జగన్ కళ్లు తెరిచి తన వ్యవహార శైలిలో మార్పు వస్తే .. పార్టీ బాగుపడుతుంది. లేకపోతే.. 2019లో కూడా జగన్ పార్టీకి ఓటమి తప్పదని కొత్తపల్లి గీత చెప్పటం జరిగింది.

అదే సమయంలో చంద్రబాబు పరిపాలనా పై పొగడ్తలు కురిపిస్తూ.. వైసీపీ నేతల తీరుపై విమర్శలు చేయటం జరిగింది. అయితే ఇదే సమయంలో.. 2014 ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో కి రావటానికి రాజకీయ నాయకులు క్యూ కట్టారు. అదే ఎన్నికల తరువాత.. జగన్ పార్టీకి పవర్ లోకి రాకపోయేసరికి వైసీపీ పార్టీ తరుపున గెలిచిన నేతలు సైతం మెల్లమెల్లగా జారుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే జగన్ పార్టీకి చంెదిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా చంద్రబాబుతో మాట్లాడి.. కొత్త కష్టాలు కొని తెచ్చుకున్న విషయం తెలిసింది. అయితే బుట్టా త్వరలో సైకిల్ ఎక్కటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం అనర్హత వేటుతోనే బుట్టా వెనకడుగు వేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇప్పుడు ఎంపీ కొత్త గీత తెరపైకి రావటంతో.. వైసీపీ నేతలు పెద్దగా ఆశ్చర్యపోవటం లేదు.. దీనికి కారణం .. పార్టీని వదిలిపెట్టే సమయంలో ఇలాంటి కామెంట్లు చేయటం సహజమే. జగన్ పార్టీ నేతలు అంటున్నారు. ఏమైన .. జగన్ కు ఇష్టమైతే.. అంతబాగనే ఉంటుంది. కానీ ఇప్పుడు వైసీపీలో ఉన్న 8మంది ఎంపీలు సంఖ్య .. ఇప్పుడు నాలుగుకు మారిన ఆశ్చర్యంలేదని వైసీపీ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. అంటే తిరుపతి ఎంపీ వరప్రసాదరావు కూడా గోడ దూకే పనిలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక మిగిలిన నాలుగు ఎంపీలు వైఎస్ జగన్ బంధువులు కావటం.. కడప ఎంపీ అవినాష్, ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి లు జగన్ తోనే పార్టీకి అండగా ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles