Raghavendra rao soundarya lahari with chandrababu

soundarya lahari guest chandra babu, raghavendra rao soundarya lahari with chandrababu, nara chandrababu naidu, soundarya lahari show, nandamuri taraka rama rao, chandrababu father-in-law, director raghavendra rao

raghavendra rao soundarya lahari with chandrababu

చంద్రబాబు నాకు అల్లుడు :రాఘవేంద్రరావు

Posted: 07/14/2014 03:52 PM IST
Raghavendra rao soundarya lahari with chandrababu

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఎవరికి అల్లుడు ఎవరు అంటే.. వెంటనే ..స్వర్గీయ నందమూరి తారాక రామారావు పేరు  చెబుతారు. కానీ ఇక నుండి అలా కాదు,  చంద్రబాబు మామ ఎవరు  అంటే.. టాలీవుడ్  దర్శకేంద్రుడు పేరు చెప్పుకోవాలని  టాలీవుడ్ లోని వ్యక్తులు అంటున్నారు.  అవును నిజమే  అని బుల్లితెర అభిమానులు కూడా అంటున్నారు.  చంద్రబాబుకు  మామ  దర్శకుడు కే. రాఘవేంద్రరావు అని  ఆదివారం రాత్రి అందరికి  తెలిసిందని  బుల్లితెర అభిమానులు అంటున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమింటే.. సీఎం చంద్రబాబు  ఆదివారం రాత్రి  . దర్శకుడు కె. రాఘవేంద్రరావు బుల్లితెర పై చేస్తున్న  సౌందర్యలహారి లైవ్ షోకు రావటం జరిగింది.  రాఘవేంద్రరావు,  సీఎం చంద్రబాబు,  పాటల రచయిత  అనంత శ్రీరామ్ , ఈటీవీ యాంకర్ ల మద్య సౌందర్యలహారీ షో నడిచింది. అయితే  ఈ  షో లో కే. రాఘవేంద్ర రావు ,  సీఎం చంద్రబాబు చాలా విచిత్రమైన సన్నివేశాలు నడిచాయి.   

Raghavendra Rao

అయితే ఎప్పుడు  మౌనంగా పని చేసుకోని పోయే  దర్శకేంద్రుడు,  సీఎం చంద్రబాబు పై పొగడ్తల వర్షం కురిపించారు.  చంద్రబాబు తో.. సీనియర్ ఎన్టీఆర్   రాఘవేంద్రరావుకు  ఉన్న సన్నిహిత సంబంధం గురించి చెబుతూ.. !! చంద్రబాబు    ‘‘అన్నగారికి(ఎన్టీఆర్)  అల్లుడు  అవుతాడు.. కాబట్టి.. నాకు వరసకు ..చంద్రబాబు అల్లుడే  అని చెప్పటం జరిగింది’’.  రాఘవేంద్రరావు నా అల్లుడు చంద్రబాబు అని చెప్పటంతో..  సీఎం చంద్రబాబు మొదట షాక్ తిన్నారు.  ఆ తరువాత   అర్థం చేసుకొని  చాలా ఆనందపడినట్లు బుల్లితెర అభిమానులు అంటున్నారు.

సీఎం చంద్రబాబు కూడా.. దర్శకేంద్రుడు తీసిన సినిమాలు.. కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి , మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమా పేర్లు ఉపయోగించి  రాఘవేంద్రరావు పై  పొగడ్తల వర్షం కురిపించారు.  అదే బాటలో.. దర్శకేంద్రడు కూడా తన పదునైన మాటల పూల పొగడ్తల మాలను..చంద్రబాబు మెడలో వేయటం జరిగింది.  ఈ మద్య నడిచిన  సన్నివేశం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో  సిఎం చంద్రబాబును హీరోగా పెట్టి  దర్శకుడు రాఘవేంద్రరావు సినిమా తీసిన ఆశ్చర్యం లేదని . బుల్లితెర అభిమానులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles