grideview grideview
  • Apr 15, 11:14 AM

    భాస్కర శతకము

    ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో కూడినవాడు ; సమయోచితం = కాలానికి...

  • Apr 14, 11:09 AM

    భాస్కర శతకము

    ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా : ఈ జగమందున్ = ఈ లోకంలో...

  • Apr 12, 11:06 AM

    భాస్కర శతకము

    ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా ! టీకా :...

  • Apr 11, 10:42 AM

    భాస్కర శతకము

    ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా! టీకా : అరయన్ = విచారించగా...

  • Apr 08, 01:16 PM

    భాస్కర శతకము

    ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా : నరుఁడు = మానవుడు ;...

  • Apr 07, 12:10 PM

    భాస్కర శతకము

    అవని విభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పను లన్నియుఁ జేకుఱు వారిచేతనే,  ప్రవిమల నీతిశాలి యగు రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధిఁదాఁటి సురారులఁద్రుంచి భాస్కరా! టీకా : అవని విభుండు = రాజు ; నేరిపరియై...

  • Apr 05, 11:31 AM

    భాస్కర శతకము

    అలఘు గుణ ప్రసిద్ధుఁడగు నట్టి ఘనుఁడొకఁడిష్టుఁడై తనున్  వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుఁగా,  తెలిసి కుచేలుఁడొక్క కొణి దెండడుకుల్ దన కిచ్చినన్ మహా  ఫలదుఁడు కృష్ణుఁ డత్యధిక భాగ్యము లాతని కీఁడై భాస్కరా! టీకా : అలఘు...

  • Apr 04, 10:44 AM

    భాస్కర శతకము

    అనఘునికైనఁ జేకుఱు వనర్హునిఁగూడి చరించినంతలో  మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే యనువుననైనఁ దప్పవు యథార్థము, తానది యెట్టులన్నచో  నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా ! టీకా : ధరిత్రియందున్ = భూమిలో ; అనర్హునిన్ =...